Warangal Suspected Deaths: వరంగల్‌లో కలకలం రేపుతున్న వలసకూలీల డెత్ మిస్టరీ, బావిలో నుండి 9 అనుమానాస్పద శవాలు వెలికితీత, హత్యా,ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు
వరంగల్ జిల్లాలో బావిలో శవాల ఘటన (Warangal Suspect Deaths) ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. నిన్న బావిలో నుంచి నాలుగు మృతదేహాలను వెలికితీయగా, నేడు మరో అయిదు మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో మొత్తం తొమ్మిది మృతదేహాలు బావిలో లభ్యం కావడంతో స్థానికంగా కలకలం రేపుతోంది. వరంగల్ శివారులోని గీసుగొండ మండలం గొర్రెకుంటలో జరిగిన ఈ విషాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పూర్థి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు.
Hyderabad, May 22: తెలంగాణలో పెను విషాదం చోటు చేసుకుంది. వరంగల్ జిల్లాలో బావిలో శవాల ఘటన (Warangal Suspected Deaths) ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. నిన్న బావిలో నుంచి నాలుగు మృతదేహాలను వెలికితీయగా, నేడు మరో అయిదు మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో మొత్తం తొమ్మిది మృతదేహాలు బావిలో లభ్యం కావడంతో స్థానికంగా కలకలం రేపుతోంది. వరంగల్ శివారులోని గీసుగొండ మండలం గొర్రెకుంటలో జరిగిన ఈ విషాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పూర్థి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. 'అందుకే చెప్పలేదు' ! కరోనా వ్యక్తి మృతిపై వచ్చిన ఆరోపణలపై స్పందించిన ఈటల రాజేంధర్, కరోనా పరీక్షల నిర్వహణపైనా సమాధానం ఇచ్చిన హెల్త్ మినిస్టర్
గీసుకొండ మండలం గొర్రెకుంటలోని ఓ బావిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి శవాలు గురువారం కనిపించాయి. వీరంతా బెంగాల్ నుంచి వచ్చి ఇక్కడి ఓ కంపెనీలో పనిచేస్తున్న మక్సూద్, అతని భార్య నిశా , కూతురు బుశ్రా, ఆమె మూడేళ్ల చిన్నారిగా పోలీసులు గుర్తించారు. కాగా ఇవాళ అదే బావిలో మరో 5 మృతదేహాలు బయటపడ్డాయి
కొంతకాలం క్రితం మసూద్ కుటుంబం బతుకు దెరువు కోసం బెంగాల్ (West Bengal migrated) నుంచి వచ్చి గొర్రెకుంట గ్రామంలో నివాసం ఉంటోంది. స్థానికంగా ఉన్న కంపెనీలో మక్సూద్, అతని భార్య పని చేస్తున్నారు. వీరి ఇద్దరు కుమారులు పాలిటెక్నిక్ చదువుతున్నారు. కూతురికి పెళ్లై మూడేళ్ల బాబు ఉన్నాడని స్థానికులు చెబుతున్నారు. వీరు గత ఏడాది డిసెంబరు నుంచి గొర్రెకుంట ప్రాంతంలో ఉన్న గన్నీ సంచుల తయారీ గోడౌన్‌లో పనిచేస్తున్నారు. తెలంగాణలో మరో 38 కరోనా పాజిటివ్ కేసులు, కొత్తగా మరో 5 మరణాలు నమోదు. రాష్ట్రంలో 1699కి చేరిన మొత్తం కోవిడ్-19 బాధితుల సంఖ్య, 45కి పెరిగిన కరోనా మరణాలు
వరంగల్‌లోని కరీమాబాద్ ప్రాంతంలో వీరు అద్దెకు ఉండేవారు. కానీ లాక్‌డౌన్ వల్ల ఇంటి నుంచి రావడానికి ఇబ్బందిగా ఉండటంతో కొద్ది రోజుల నుంచి గోదాంలో ఉన్న రెండు గదుల్లోనే మక్సూద్ దంపతులు, వారి ఇద్దరు కుమారులు ఉంటున్నారు. భర్తకు దూరంగా ఉంటున్న కుమార్తె బుస్ర సైతం తన కుమారుడితో కలిసి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ముంబై-ఢిల్లీ కనీస టికెట్ ధర రూ. 3500, మినిమం ధర రూ. 10 వేలు, 3నెలల పాటు ఇదే ఛార్జీలు అమల్లో, వివరాలను వెల్లడించిన పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి
వీరితో పాటుగా బీహార్‌కు చెందిన ఇద్దరు యువకులు సైతం గోడౌన్‌లోని మరో గదిలో ఉంటూ పని చేస్తున్నారు. మొత్తం 8 మంది ఒకే ప్రాంగణంలో నివాసం ఉంటూ ఉపాధి పొందుతున్నారు. గోడౌన్ యజమాని సంతోష్ గురువారం మధ్యాహ్నం అక్కడికి వచ్చే సరికి పనిచేసే వారెవరూ కనిపించలేదు. ఆ ప్రాంగణం మొత్తం పరిశీలించగా పాడు బడిన బావి సమీపంలో వారి వస్తువులు కనిపించాయి. బావిలోకి చూడగా నాలుగు మృతదేహాలు కనిపించాయి. దీంతో వెంటనే గీసుకొండ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్ సిబ్బంది వచ్చి ఆధారాలు సేకరించారు. వరంగల్ నగరపాలక సంస్థ సిబ్బంది విపత్తు నిర్వహణ బృంద సభ్యులు, పోలీసులు కలిసి మృతదేహాలను తాళ్లతో వెలికి తీశారు. ఈ రోజు మరో అయిదు మృతదేహాలను వెలికి తీసారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్నివరంగల్ పోలీసు కమిషనర్ రవీందర్ సందర్శించి చుట్టుపక్కల పరిసరాలను పరిశీలించారు.
ఇదిలా ఉంటే మృతదేహాల ఒంటిపై గాయాలు లేకపోవటంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కేసుకు సంబంధించి క్యూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తోందని చెప్పారు. 9 మృతదేహాల్లో ఆరుగురు మక్సూద్ కుటుంబసభ్యులే కాగా మిగిలిన వారెవరనేది మిస్టరీగా మారింది. ఇటీవల మక్సూద్ మనవడి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించగా.. ఆ వేడుకల్లో మక్సూద్ కూతురి విషయంలో బిహార్ యువకులు, స్థానికుల మధ్య ఘర్షణ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తే హత్యా, ఆత్మహత్యా అనేది నిర్ధారణ అవుతుందని సీపీ తెలిపారు