Hyderabad, May 21: తెలంగాణలో ఈరోజు మరో 38 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం COVID-19 కేసుల సంఖ్య 1699 కు చేరింది. ఈరోజు నమోదైన మొత్తం కేసుల్లో 26 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోవే, కాగా రంగారెడ్డి జిల్లా నుంచి రెండు కేసులు నమోదయ్యాయి. ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో మరో 10 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇప్పటివరకు వలస వచ్చిన వారిలో 99 మందికి కరోనా సోకినట్లు నిర్ధారింపబడింది.
మరోవైపు, గత మూడు రోజులుగా వరుసగా కోవిడ్ బాధితులు చనిపోవడం కొంత ఆందోళన కలిగిస్తుంది. గురువారం మరో 5 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కోవిడ్ మరణాల సంఖ్య 45కి పెరిగింది.
ఈరోజు మరో 23 మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 1036 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 618 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కొంది.
Telangana's #COVID19 Report:
ఇదిలా ఉంటే, వనస్థలిపురంలో ఓ కరోనా మృతుడి అంత్యక్రియలపై వివాదం చోటుచేసుకుంది. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, తమ అనుమతి తీసుకోకుండా తన భర్త అంత్యక్రియలు ఎలా నిర్వహించారంటూ గాంధీ ఆస్పత్రి అడ్మినిస్ట్రేషన్ పై మరియు జీహెచ్‌ఎంసీ అధికారులపై మాధవి అనే మహిళ తీవ్ర ఆరోపణలు చేశారు. తన భర్తపై ఏవైనా ప్రయోగాలు నిర్వహించారా? జవాబు చెప్పాలంటూ నిలదీశారు. ఇదే విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళుతూ ట్వీట్ చేయడంతో అది వెంటనే వైరల్ సోషల్ మీడియాలో, ఆ వెమ్టనే మీడియాలో తీవ్రదుమారం చెలరేగింది.
వెంటనే ఈ వివాదంపై స్పందించిన గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్, కరోనాతో ఆస్పత్రిలో చేరిన 24 గంటల్లోనే ఆ వ్యక్తి మరణించాడని, ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపే మృతదేహాన్ని పోలీసులకు అప్పగించామని స్పష్టం చేశారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదంటూ మీడియా ముఖంగా అధికారులను నిలదీశారు.
ఇటీవల, వనస్థలిపురంలో నివసించే మధుసూదన్ మరియు అతడి కుటుంబం కరోనా బారినపడి, గాంధీ ఆస్పత్రిలో చేరారు. అయితే కొన్నిరోజులకు కరోనా నుంచి కోలుకున్న కుటుంబ సభ్యులంతా డిశ్చార్జ్ అయి, ఇంటికి వెళ్లగా.. మధుసూదన్ మాత్రం ఇంటికి రాలేదు. ఈ విషమై ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నింగా వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో కరోనా చికిత్స కోసం వెళ్లిన తన భర్త జాడ తెలియడం లేదంటూ కేటీఆర్‌కు ట్విటర్‌లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పరిణామాలు వివదాస్పదం అయ్యాయి.
ఈ వివాదంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంధర్ స్పందించారు. తమ ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు వైద్యం అందిస్తున్న గాంధీ ఆసుపత్రి వైద్యులపై, గాంధీ ఆసుపత్రిపై నిందలు వేయడం సరికాదు అన్నారు. మంత్రి స్పందనను ఈ లింక్ క్లిక్ చేసి చూడండి. మధుసూదన్ మృతికి గల కారణాలను మంత్రి వివరించారు.