Golconda Bonalu: బోనాలకు ముస్తాబైన గోల్కొండ.. ఈ ఆదివారం నుంచే వేడుకలు షురూ.. భక్తుల కోసం ప్రత్యేక బస్సుల ఏర్పాటు
ఈ ఆదివారం బోనాలు ప్రారంభం కానున్నాయి. చరిత్రాత్మకమైన గోల్కొండ కోట జగదాంబిక మహంకాళి ఎల్లమ్మ ఆలయంలో ఆషాఢ మాసం బోనాలు ప్రారంభమై నెల రోజుల పాటు కొనసాగనున్నాయి.
Hyderabad, July 5: ఆషాఢ మాసం బోనాలకు (Golconda Bonalu) హైదరాబాద్ (Hyderabad) ముస్తాబయ్యింది. ఈ ఆదివారం బోనాలు ప్రారంభం కానున్నాయి. చరిత్రాత్మకమైన గోల్కొండ కోట జగదాంబిక మహంకాళి ఎల్లమ్మ ఆలయంలో ఆషాఢ మాసం బోనాలు ప్రారంభమై నెల రోజుల పాటు కొనసాగనున్నాయి. జంటనగరాల నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. ఈ క్రమంలో గోల్కొండ కోటలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాటర్ ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. క్యూ లైన్లకు బారికేడ్ల నిర్మాణంతో పాటు స్టేజీల ఏర్పాట్లు చేస్తున్నారు.
యూకే పార్లమెంటు ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం.. ఓటమిని అంగీకరించిన రిషి సునాక్
ప్రత్యేక బస్సు సర్వీసులు
గోల్కొండ జగదాంబిక బోనాలకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి.వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే, సీబీఎస్, పటాన్ చెరు, ఈసీఐఎల్, మెహిదీపట్నం, దిల్ షుక్‌నగర్, కూకట్‌పల్లి, చార్మినార్, ఉప్పల్, మల్కాజిగిరి, పాత బోయిన్‌పల్లి నుంచి 75 బస్సులు తిరుగుతున్నాయి.