MLCs to Congress (Credits: X)

Hyderabad, July 5: అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఫలితాలతో (Assembly Elections) కుదేలైన బీఆర్ఎస్ (BRS) పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీ ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం అర్ధరాత్రి ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్న వెంటనే జూబ్లీహిల్స్‌ లోని ఆయన నివాసంలో సమావేశం జరిగింది. అనంతరం ఆషాఢ అమావాస్యకు ముందురోజు రాత్రి వీరంతా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే సీఎం నివాసానికి చేరుకోవడానికి ముందు కూడా ఆరుగురు ఎమ్మెల్సీలు దస్ పల్లా హోటల్‌ లో సమావేశమయ్యారు. అక్కడి నుంచి నేరుగా సీఎం నివాసానికి చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ చార్జ్ దీపాదాస్ మున్సీ సమక్షంలో వీరందరూ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

ప్రధాని మోదీతో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి భేటీ, రాజకీయాలు ఎన్నికల వరకేనని వెల్లడి, వివిధ సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చామని తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి

పార్టీ మారిన వారు వీళ్లే..

కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో ఎమ్మెల్సీలు దండె విఠల్, భాను ప్రసాద్, ఎగ్గె మల్లేశం, బుగ్గారపు దయానంద్, ప్రభాకర్ రావు, బస్వరాజ్ సారయ్య ఉన్నారు. తాజా చేరికలతో శాసనమండలిలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 12కు పెరిగింది. మొత్తం మండలిలో సభ్యుల సంఖ్య 40 ఉండగా.. రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

వీడియో ఇదిగో, కాంగ్రెస్‌కు ఓటేసి పొరపాటు చేశామనే విషయం ప్రజలకు అర్థమైంది, మళ్లీ కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారని తెలిపిన బీఆర్ఎస్ అధినేత