IPL Auction 2025 Live

Khammam Jana Garjana: ఖమ్మంలో నేడు కాంగ్రెస్ జన గర్జన సభ.. వంద ఎకరాల్లో దాదాపు ఐదు లక్షల మందితో నిర్వహణ.. ఇప్పుడు అందరి చూపు ఖమ్మం సభ వైపే.. వేదికసాక్షిగా ఎన్నికల శంఖారావం పూరించనున్న రాహుల్.. రాజకీయ పక్షాల ఆసక్తి

ఈ క్రమంలో ఈ రోజు సాయంత్రం ఖమ్మంలో జరిగే కాంగ్రెస్ తెలంగాణ జన గర్జన సభపై అందరి దృష్టి నెలకొంది.

Congress Leader Rahul Gandhi (Photo Credits: Twitter@INC)

Khammam, July 2: మరికొద్ది నెలల్లో తెలంగాణ (Telangana) అసెంబ్లీకి (Assembly) ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ (Congress) కు కొత్త జవసత్వాలు అద్దడానికి ఆ పార్టీ అధినాయకత్వం, స్థానిక నేతలు సిద్దమయ్యారు. ఈ క్రమంలో  ఈ రోజు సాయంత్రం ఖమ్మంలో జరిగే కాంగ్రెస్ తెలంగాణ జన గర్జన సభపై (Jana Garjana Sabha) అందరి దృష్టి నెలకొంది. ఈ సభకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తరలి వస్తున్నారు. ఈ ఏడాది చివర్లో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. కొంచెం కష్టపడితే తెలంగాణలో అధికారంలోకి రావచ్చని, తద్వారా వచ్చే లోక్ సభ ఎన్నికలకు సమాయత్తం కావొచ్చని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. దాంతో, రాష్ట్రంపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర ముగింపుతో పాటు బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఇదే సభలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.

Twitter New Rules: ట్విట్టర్ లో కొత్త నిబంధనలు.. రోజుకు వెయ్యి ట్వీట్లే చూడొచ్చు.. కొత్త ఖాతా దారులకు 500 ట్వీట్లు మాత్రమే.. ఎలాన్ మస్క్ తాజా నిర్ణయం వెనుక కారణం ఏంటంటే?

కాంగ్రెస్ కు ప్లస్ పాయింట్

తెలంగాణలో పూర్వ వైభవం దిశగా ఒక్కో అడుగు ముందుకు వేస్తున్న కాంగ్రెస్ పార్టీలో భట్టి పీపుల్స్ మార్చ్ నేతల మధ్య ఐక్యత తీసుకొచ్చింది. అదే సమయంలో బీజేపీలో కీలక నేతల మధ్య విభేధాలు వెలుగులోకి రావడం కాంగ్రెస్ కు ప్లస్ పాయింట్ అయింది.

Congress Bhatti Vikramarka: కాంగ్రెస్‌ను తిట్టినోల్లే పార్టీలో ఉన్నారు షర్మిల వస్తే తప్పేంటి... రేవంత్ మీద భట్టి విమర్శలు

రాజకీయ పక్షాల ఆసక్తి

ఖమ్మం సభ వేదికగా రాహుల్ తెలంగాణ ఎన్నికల శంఖారావం పూరిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో జన గర్జన సభ రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా మారుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలపై అధికార బీఆర్ఎస్ ఆరాతీస్తున్నట్టు తెలుస్తోంది. ప్రగతి భవన్ పెద్దలు ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నారని, బీజేపీ ఢిల్లీ పెద్దలు కూడా ఖమ్మం సభ వైపే చూస్తున్నట్టు తెలుస్తోంది.

Twitter Down: ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ డౌన్‌, వేల సంఖ్యలో ఫిర్యాదులు, ఎలాంటి ప్రకటన చేయని యాజమాన్యం, సోషల్ మీడియాలో ట్విట్టర్‌ పై మీమ్స్‌

వంద ఎకరాలు.. 5 లక్షల మందితో సభ

జన గర్జన సభను కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మంగా తీసుకుంది. వంద ఎకరాల్లో దాదాపు ఐదు లక్షల మంది పాల్గొనే సభ ఏర్పాట్లను చేసింది. జన సమీకరణకు అగ్రనేతలు కసరత్తులు చేశారు.