Karimnagar Shocker: కరీంనగర్ లో షాకింగ్ ఘటన.. డ్యాన్స్ చేస్తున్న ఇంటర్ విద్యార్థినికి గుండెపోటు.. మృతి.. కారణం ఇదేనా?
ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని కాలేజీలో జరిగిన ఫ్రెషర్స్ డే ఫంక్షన్ లో డ్యాన్స్ చేస్తూ అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోయి మరణించింది.
Karimnagar, Aug 12: ఇంటర్ మొదటి సంవత్సరం (Inter First Year) చదువుతున్న ఓ విద్యార్థిని కాలేజీలో జరిగిన ఫ్రెషర్స్ డే ఫంక్షన్ (Freshers Day Function) లో డ్యాన్స్ (Dance) చేస్తూ అకస్మాత్తుగా గుండెపోటుతో (Heart Attack) కుప్పకూలిపోయి మరణించింది. కరీంనగర్ జిల్లాలో (Karimnagar) ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే, జిల్లాలోని గంగాధర మండలం వెంకటాయపల్లికి చెందిన ప్రదీప్తి ఆదర్శ పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం అభ్యసిస్తోంది. కాగా, శుక్రవారం కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుక నిర్వహించారు. ఈ క్రమంలో ప్రదీప్తి తోటి విద్యార్థినులతో కలిసి డ్యాన్స్ చేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. కళాశాలోని వైద్యులు ఆమెకు సీపీఆర్ చేసిన ప్రయోజనం లేకపోవడంతో వెంటనే కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే బాలిక మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు.
కారణం ఇదేనా?
ప్రదీప్తికి చిన్నతనం నుంచే గుండెలో రంధ్రం ఉండేది. ఆమెకు ఆపరేషన్ చేయించాలని వైద్యులు తల్లిందండ్రులకు ఎప్పుడో సూచించారు. అయితే, ఆర్థికస్తోమత లేక వారు ఆపరేషన్ చేయించలేదు. ఇప్పుడు అదే ఆమెను బలి తీసుకున్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.