Assault (Image used for representational purpose only) (Photo Credits: ANI)

kompally, August 11: హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కొంపల్లిలో ఓ మైనర్‌ బాలిక(7)పై తండ్రి, కుమారుడు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన పేట్‌ బషీరాబాద్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..శివ‌కుమార్(45), కుమారుడు శ్యామ‌ల్(19) అనే ఇద్ద‌రు వ్య‌క్తులు కొంప‌ల్లిలో నివాస‌ముంటున్నారు. వీరు ఉంటున్న ఇంటి ప‌క్క‌నే ఓ బాలిక ఉంటోంది. ఆమెకు ఫోన్ ఇస్తామ‌ని మాయ‌మాట‌లు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లారు. అనంత‌రం బాలిక‌పై అత్యాచారం చేశారు. ఈ విష‌యం బ‌య‌ట‌కు చెబితే చంపేస్తామ‌ని బాలిక‌ను హెచ్చ‌రించారు.

షాకింగ్ వీడియో ఇదిగో, కన్న కూతుర్ని చంపి శవాన్ని బైక్‌కు కట్టి రోడ్డు మీద ఈడ్చుకెళ్లిన తండ్రి, వైరల్ అవుతున్న సీసీ టీవీ పుటేజీ

అయితే గ‌త రెండు మూడు రోజుల బాలిక ప్ర‌వ‌ర్త‌న‌లో తేడా వ‌చ్చింది. ఏమైంద‌ని త‌ల్లి గ‌ట్టిగా ప్ర‌శ్నించ‌గా, జ‌రిగిన ఘోరాన్ని వివ‌రించింది. దీంతో బాధితురాలి త‌ల్లి పేట్‌బ‌షీరాబాద్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. బాధిత కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులైన తండ్రి, కుమారుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.చికిత్స నిమిత్తం బాలిక‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని బాలిక కుటుంబ స‌భ్యులు డిమాండ్ చేశారు.