TS Assembly Budget-2021 Session: మార్చి 15 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు, గ‌త బ‌డ్జెట్ కంటే మెరుగ్గా ఈసారి బ‌డ్జెట్‌, 18న తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేసీఆర్ సర్కారు

2021-2022 బడ్జెట్‌కు (TS Assembly Budget Sessions 2021) సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసింది. మార్చి 15 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Telangana Assembly Budget sessions 2021) నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

Telangana CM KCR | File Photo

Hyderabad, Mar 9: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు ముహూర్తం ఖరారయింది. 2021-2022 బడ్జెట్‌కు (TS Assembly Budget Sessions 2021) సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసింది. మార్చి 15 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Telangana Assembly Budget sessions 2021) నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 15న ఉదయం 11 గంటలకు గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి.

16న దివంగత ప్రజాప్రతినిధుల మృతి పట్ల సంతాప తీర్మానం ప్రకటిస్తారు. 17న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతారు. 18న 11.30నిమిషాలకు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్ పేద ప్రజలకు ఆశాజనకంగా ఉంటుందని అధికార పార్టీ వర్గాలు అంటున్నాయి.

బడ్జెట్ ప్రతిపాదిత అంచనాల కోసం సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్ధిక పద్దులో పొందు పరచాల్సిన శాఖల వారి బడ్జెట్ అంచనాలను, అధికారులు అందించిన ఆర్ధిక నివేదికలను పరిగణలోకి తీసుకుని సీఎం పరిశీలించారు. కరోనా ప్రభావం వల్ల రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ. 50 వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందని దాని ప్రభావం లక్ష కోట్లకు చేరుకున్నదని సీఎం అన్నారు.

భైంసాలో మళ్లీ ఇరువర్గాల మధ్య గొడవలు, 144 సెక్షన్‌ అమల్లోకి, అల్లర్లపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆరా, బాధితులకు న్యాయం చేయాలని తెలిపిన మంత్రి కేటీఆర్, ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలిపిన బండి సంజయ్

కాగా కరోనాంతర పరిస్థితిలో రాష్ట్ర ఆర్ధిక కార్యకలాపాలు పుంజుకున్నాయని, వివిధ రూపాల్లో రాబడి పెరిగిందని, ఈ నేపథ్యంలో గత బడ్జెట్ కంటే రాబోయే బడ్జెట్ కేటాయింపులు ఎక్కువగానే ఉండే ఆస్కారమున్నదని సీఎం తెలిపారు. అన్ని శాఖలతో బడ్జెట్‌పై కసరత్తు ముగిసిన తరువాత తుది దశలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బడ్జెట్‌కు తుది మెరుగులు దిద్దడం జరుగుతుంది.

పలు సంక్షేమ, అభివృద్ది పథకాల అమలుతో పాటు, ఇప్పటికే అమలులో ఉన్న గొర్రెల పెంపకం కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తామని సీఎం తెలిపారు. ఈ పథకం ద్వారా యాదవులు, గొల్ల కుర్మల కుటుంబాలు ఆదాయాన్ని ఆర్జిస్తున్నందున ఇప్పటికే పంపిణీ చేసిన 3 లక్షల 75 యూనిట్లకు కొనసాగింపుగా మరో 3 లక్షల గొర్రెల యూనిట్ల పంపిణీకి గాను రానున్న బడ్జెట్‌లో ప్రతిపాదనలను పొందుపరచనున్న‌ట్లు సీఎం తెలిపారు.

హైదరాబాద్ పేరు మార్చి తీరుతాం, సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు, భాగ్యనగర్‌గా మారుస్తామని..దీనిని ఎవరూ అడ్డుకోలేరన్న బీజేపీ నేత

గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం మెచ్చుకున్నదన్నారు. దేశంలోనే అత్యంత అధికంగా షీప్ పాపులేషన్ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ పురోగమిస్తున్నదని కేంద్రం గుర్తించిన నేపధ్యంలో గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని సీఎం తెలిపారు. అదే విధంగా ఇప్పటికే కొనసాగుతున్న చేపల పెంపకం కార్యక్రమం గొప్పగా సాగుతున్నదనీ, మంచి ఫలితాలు కూడా వస్తున్నందున దాన్ని కూడా కొనసాగిస్తామని సీఎం వెల్ల‌డించారు.



సంబంధిత వార్తలు

Tollywood Celebrities To Meet CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని క‌లువ‌నున్న అల్లు అర‌వింద్, చిరంజీవి ప‌లువురు ప్ర‌ముఖులు, అల్లు అర్జున్ వ్య‌వ‌హారం త‌ర్వాత తొలి భేటీ

Nara Devansh Set A Record In Chess: నారా దేవాన్ష్ టాలెంట్ కు ప్ర‌పంచం ఫిదా, 9 ఏళ్ల వ‌య‌స్సులోనే స‌రికొత్త రికార్డు సృష్టించిన నారావారి వార‌సుడు

CM Revanth Reddy: సర్వమత సమ్మేళనంం తెలంగాణ, మత విద్వేషాలు రెచ్చగోడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి, క్రిస్టియన్ల సంక్షేమం- అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామన్న సీఎం

Pawan Kalyan Welcome Film Industry To AP: ఏపీలో షూటింగ్స్ చేయండి! సినీ ఇండస్ట్రీకి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆహ్వానం, అల్లు అర్జున్ పై రేవంత్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ప్రాధాన్య‌త సంత‌రించుకున్న కామెంట్స్