Telangana Budget Session 2020: మార్చి 6 నుంచి తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు, 8న అసెంబ్లీకి రానున్న తెలంగాణా బడ్జెట్, కేసీఆర్ బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి
ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ శనివారం విడుదలైంది. రెండు వారాలపాటు జరగనున్న ఈ సమావేశాలు తొలి రోజున రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ ప్రసంగంతో ఉభయ సభలు ప్రారంభంకానున్నాయి. మార్చి 8వ తేదీన ఆర్థిక శాఖమంత్రి తన్నీరు హరీశ్ రావు (Harish Rao) అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అలాగే శాసన సభ వ్యవహారాల శాఖమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అదే బడ్జెట్ ను కౌన్సిల్ లో ప్రవేశపెట్టనున్నారు.
Hyderabad, Mar 01: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Telangana Assembly Budget Sessions) మార్చి 6వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ శనివారం విడుదలైంది. రెండు వారాలపాటు జరగనున్న ఈ సమావేశాలు తొలి రోజున రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ ప్రసంగంతో ఉభయ సభలు ప్రారంభంకానున్నాయి. మార్చి 8వ తేదీన ఆర్థిక శాఖమంత్రి తన్నీరు హరీశ్ రావు (Harish Rao) అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అలాగే శాసన సభ వ్యవహారాల శాఖమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అదే బడ్జెట్ ను కౌన్సిల్ లో ప్రవేశపెట్టనున్నారు.
చికెన్ ముక్కలు తింటూ కరోనా రాదని చెబుతున్న తెలంగాణా మంత్రులు
శుక్రవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు (Telangana Budget Session 2020) మొదలవుతాయి. ఉభయసభల సంయుక్త సమావేశంలో గవర్నర్ ప్రసంగించిన తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశమవుతుంది. సభను ఎన్నిరోజులు నిర్వహించాలనే విషయాన్ని బీఏసీ సమావేశంలో ఖరారుచేస్తారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సభ తీర్మానం చేయనున్నది.
సభానాయకుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇప్పటికే ఈ విషయాన్ని ప్రకటించారు. ఆ తీర్మానంతోపాటు లోకాయుక్త బిల్లును చట్టసభ ఆమోదానికి ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 9న (సోమవారం) హోలీ సెలవు ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం 8న ఉభయసభల్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశమున్నది.
దేశవ్యాప్తంగా ఆర్థికంగా గడ్డు పరిస్థితి నెలకొనడం, కేంద్ర బడ్జెట్ తెలంగాణ వాసులకు పెద్దగా ఊరటనివ్వకపోవడం తదితర పరిణామాల నేపథ్యంలో.. కేసీఆర్ (CM KCR) బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒకట్రెండు కొత్త పథకాలను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. మంత్రి గంగుల కమలాకర్ ఇటీవల దీనికి సంబంధించి హింట్ ఇచ్చారు.