Telangana Chicken Egg Mela in Hyderabad to fight COVID-19 scare (Photo-ANI)

Hyderabad, Febuary 29: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా వైరస్ (Coronavirus) విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ భారీన పడి ఇప్పటికే వేల మంది మరణించారు. లక్షలాది మంది కరోనా (COVID-19) లక్షణాలతో చికిత్స పొందుతున్నారు. అయితే నాన్ వెజ్ తినడం ద్వారా కరోనా వస్తుందంటూ ఈ మధ్య సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ దెబ్బకు కోడి మాంసం (Chicken) అమ్మకాలు సగానికి సగం పడిపోయాయి.

దిశ నిందితుల కుటుంబాలకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

దేశవ్యాప్తంగా వారానికి సగటున 7.5 కోట్ల కోళ్ల అమ్మకాలు జరుగుతుండగా.. ప్రస్తుతం 3.5 కోట్ల కోళ్లు మాత్రమే అమ్ముడవుతున్నాయి. ఫలితంగా పౌల్ట్రీల్లో కోడి ధర 70% వరకు పతనమైంది. కిలో కోడి ధర రూ.100 నుంచి రూ.30-35కి పడిపోయింది. ఇదే సమయంలో కోడి బరువు కిలో పెరిగేందుకు ఖర్చు రూ.75 అవుతోందని పౌల్ట్రీ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

డిమాండ్ తగ్గడంతో చికెన్ ధరలు భారీగా తగ్గిపోయాయి. పౌల్ట్రీ ఇండస్ట్రీపై ఇది పెను ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పౌల్ట్రీ పరిశ్రమ సమాఖ్య ఈ అపోహలను తొలగించడానికి నడుం బిగించింది.

దేశంలో తొలిసారిగా టిక్‌టాక్, ట్విటర్, వాట్సప్‌పై క్రిమినల్ కేసులు

దీనిపై వినియోగదారుల్లో అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్‌ పీపుల్స్‌ ప్లాజాలో ‘చికెన్‌, ఎగ్‌ మేళా’ (Chicken And Egg Mela) నిర్వహించాయి. మేళాలో 8 వేల కిలోల చికెన్‌తో పాటు గుడ్లతో తయారుచేసిన రుచికరమైన స్నాక్స్‌ వినియోగదారులకు ఫ్రీగా పంపిణీ చేశారు.

Here's ANI Tweet

ఈ ఫెస్టివల్‌కు తెలంగాణా మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు కోడికూర ఉత్సవంలో పాల్గొన్నారు. ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, మర్రి జనార్దన్ రెడ్డితో పాటు చికెన్ ప్రియులు పెద్ద ఎత్తున ఈ మేళాకు తరలివచ్చారు. కరోనా వైరస్ కు, చికెన్ కు ఎలాంటి సంబంధం లేదని మంత్రులు స్పష్టం చేశారు. స్వయంగా వేదిక మీదే మంత్రులు, నేతలంతా చికెన్ లెగ్‌ పీస్‌ లు తిన్నారు.

అవ్వ కోసం మెట్ల మీద.., వృద్ధురాలి పెన్షన్ కష్టం తీర్చిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్

సంక్షోభంలో ఉన్న పౌల్ట్రీ పరిశ్రమకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా కేటీఆర్ హామీ ఇచ్చారు. వదంతులతో చికెన్ పరిశ్రమ బాగా దెబ్బతిన్నదని.. వెంటనే తిరిగి పుంజుకోవాలని ఆకాంక్షిస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.