Hyderabad, Febuary 27: ఏదైనా ఒక పనికోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తే వరకు పనులు జరుగుతాయో చెప్పక్కర్లేదు. ఆ పని పూర్తి చేసుకునే సరికి తలప్రాణం తోకకు వస్తుంది. పింఛన్‌రాక ప్రభుత్వ ఆపీసుల చుట్టూ తిరుగుతున్న ఓ వృద్ధురాలికి అప్పటికప్పుడు పింఛన్ వచ్చేలా చేశారు చేశారు ఈ కలెక్టర్. అందరిచేతా శభాష్ అనిపించుకున్న ఈ కలెక్టర్ ( Collector) ఇప్పుడు సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అయ్యారు. వివరాల్లోకెళ్తే..
తెలంగాణా (Telangana) రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి (Jayashankar Bhupalpally) జిల్లా కలెక్టర్ ఆఫీస్ కు ఓ గిరిజన వృద్ధురాలు వచ్చింది. చాల కాలంగా ఆమె ఓ పనిమీద తిరుగుతున్నా కావడం లేదు. అందుకే తన గోడును వెళ్లబోసుకోవడానికి కలెక్టర్ ఆఫీస్ కు వచ్చి మెట్లమీద కూర్చుంది.
పట్టణ ప్రగతి కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్థానిక ఎమ్మెల్యేగండ్రా వెంకటరమణా రెడ్డిలతో కలిసి కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం (Jayashankar Bhupalpally Collector) తన కార్యాలయానికి వచ్చారు.
కూతురు ఆత్మహత్య, తండ్రిని బూటుకాలుతో తన్నిన కానిస్టేబుల్
అప్పటికే ఆ మహిళ అక్కడే దిగులుగా కూర్చుని ఉంది. ఆ మహిళను గమనించిన కలెక్టర్ ఎందుకు ఇక్కడ కూర్చున్నావని ప్రశ్నించగా రెండు సంవత్సరాలుగా పించన్ రావడంలేదని చెప్పింది. వెంటనే స్పందించిన కలెక్టర్.. ఆమె పక్కనే కూర్చుని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సుమతితో ఫోన్ లో మాట్లాడి వృద్ధురాలికి పించన్ ను మంజూరు చేయించారు.
ఈ దృశ్యాన్ని చూసిన వారంతా కలెక్టర్‌పై ప్రశంసలు కురిపించారు. మెట్లపై కలెక్టర్ కూర్చొని ఉన్న ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మీరు గ్రేట్ సార్.. అంటూ అభినందిస్తున్నారు నెటిజన్లు. మీ లాంటి ఆఫీసర్లే ఈ సమాజానికి కావాలని కామెంట్లు పెడుతున్నారు.