Telangana Assembly Session: రేపు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. సభ ముందుకు రానున్న కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలు.. రాష్ట్రంలో మొత్తం బీసీల జనాభా ఎంతంటే?

తెలంగాణ అసెంబ్లీ రేపు ప్రత్యేకంగా సమావేశం కానునున్నది. కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చించేందుకు ఈ నెల 5న కేబినెట్ భేటీ నిర్వహించి అనంతరం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో వీటిపై చర్చించాలని భావించారు.

assembly building in Telangana !(X)

Hyderabad, Feb 3: తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly Session) రేపు ప్రత్యేకంగా సమావేశం కానునున్నది. కులగణన, ఎస్సీ (SC) వర్గీకరణ అంశాలపై చర్చించేందుకు ఈ నెల 5న కేబినెట్ భేటీ నిర్వహించి అనంతరం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో వీటిపై చర్చించాలని భావించారు. ఈ విషయాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా ఈ నెల 1వ తేదీన వెల్లడించారు. అయితే ఒక రోజు ముందుగానే అంటే ఈ నెల 4వ తేదీనే తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు ముందు ఉదయం పది గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో బీసీ సబ్ కమిటీ కులగణన నివేదిక, ఎస్సీ వర్గీకరణపై ఏక సభ్య కమిషన్ నివేదికను కేబినెట్‌ కు అందజేస్తారు. కుల గణన నివేదిక, ఎస్సీ వర్గీకరణపై చర్చించి మంత్రి మండలి నిర్ణయం తీసుకుంటుంది. క్యాబినెట్ సమావేశం అనంతరం 11 గంటలకు శాసనసభ, శాసనమండలి ప్రత్యేక సమావేశాలు ప్రారంభమవుతాయి. శాసనసభ, శాసనమండలిలో ఈ రెండు నివేదికలను ప్రవేశపెట్టి చర్చిస్తారు.

చివరి టీ 20లోనూ టీమిండియా గ్రాండ్ విక్టరీ, 97 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్, 150 పరుగుల తేడాతో ఘన విజయం

46.25 శాతం బీసీలు, 12.56 శాతం ముస్లింలు

తెలంగాణ సచివాలయంలో మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి అధ్యక్షతన కులగణపై కేబినెట్ సబ్‌ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా కేబినెట్‌ సబ్‌ కమిటీకి కులగణన నివేదికను ప్లానింగ్‌ కమిషన్‌ అధికారులు ఇచ్చారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో 96.9 శాతం కులగణన సర్వే జరిగిందని.. 3.1 శాతం మంది సర్వేలో పాల్గొనలేదన్నారు.

టీ 20ల్లో రికార్డులు బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ, ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో 37 బాల్స్‌లో సెంచరీ పూర్తి 

కులగణన రిపోర్టు..

  • తెలంగాణలో కుల గణన సర్వే చేసిన జనాభా 3,54,77,554
  • మొత్తం కుటుంబాలు 1,12,15,134
  • కుల గణన ప్రకారం ఎస్సీల జనాభా - 61,84,319.. (17.43 శాతం)
  • ఎస్టీల జనాభా - 37,05,929.. (10.45 శాతం )
  • బీసీల జనాభా - 1,64,09,179 (46.25 శాతం)
  • ముస్లింల జనాభా- 44,57,012 (12.56 శాతం)
  • బీసీ ముస్లింలు: 35,76,588 (10.08 శాతం)
  • ఓసీ ముస్లింలు: 8,80,424 (2.48 శాతం)
  • ఓసీల జనాభా- 44,21,115 (13.31 శాతం)
  • మొత్తం ఓసీ జనాభా - 15.79 శాతం

నేడు కేబినెట్ సబ్ కమిటీకి ఎస్సీ వర్గీకరణ నివేదిక

నేడు కేబినెట్ సబ్ కమిటీకి ఎస్సీ వర్గీకరణ వన్ మ్యాన్ కమిషన్ నివేదికను జస్టిస్ షమీమ్ అక్తర్ అందజేయనున్నారు. నివేదికపై ఈ నెల 4వ తేదీన కేబినెట్‌ లో చర్చ జరిగిపి అనంతరం అసెంబ్లీలో కులగణన, ఎస్సీ వర్గీకరణ రెండు నివేదికలను ప్రవేశపెట్టనున్నారు. చర్చల అనంతరం ఆమోదం ఇవ్వనున్నారు. ఇదే జరిగితే,  ఎస్సీ వర్గీకరణ అమలు చేయబోతున్న మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలువనున్నది.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Group-2 Results Today: నేడు గ్రూప్‌-2 ఫలితాలు.. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల పరీక్ష ఫలితాలు

Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Advertisement
Advertisement
Share Now
Advertisement