Telangana Cabinet: తెలంగాణలో రూ. 50 వేల వరకు రుణమాఫీ, ఆగస్టు 15 నుంచి నెలాఖరు వరకు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు, ఆగస్టు 16 నుండి దళిత బంధు హుజూరాబాద్ నుంచి ప్రారంభించాలని కేబినెట్ తీర్మానం
50,000 వరకు ఉన్న పంట రుణాల మాఫీని (waiver of crop loans) ఆగస్టు 15 నుంచి నెలాఖరు వరకు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం (Telangana Cabinet) నిర్ణయించింది. అలాగే ఆగస్టు 16 నుండి 'దళిత బంధు' పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నుంచి ప్రారంభించాలని, రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది.
Hyderabad, August 2: రూ. 50,000 వరకు ఉన్న పంట రుణాల మాఫీని (waiver of crop loans) ఆగస్టు 15 నుంచి నెలాఖరు వరకు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం (Telangana Cabinet) నిర్ణయించింది. అలాగే ఆగస్టు 16 నుండి 'దళిత బంధు' పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నుంచి ప్రారంభించాలని, రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది. అందుకు పూర్తిస్థాయిలో అధికారయంత్రాంగం సిద్ధం కావాలని కేబినెట్ ఆదేశించింది.దళిత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రతి జిల్లాలో ‘‘సెంటర్ ఫర్ దళిత్ ఎంటర్ ప్రైజ్’’ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అన్నారు.
యూనిట్ పెట్టగానే ప్రభుత్వ బాధ్యత తీరిపోదని యూనిట్ సరిగ్గా నడుస్తుందా లేదా అన్న విషయాన్ని నిరంతరం పర్యవేక్షించడం కూడా ముఖ్యమని కేబినెట్ తీర్మానించింది. దళిత బంధు ద్వారా ఎవరికైతే లబ్ధి చేకూరుస్తారో వారికి అందజేసే ఒక ప్రత్యేక కార్డు నమూనాలను కేబినెట్ పరిశీలించింది. ఈ కార్డు ఆన్లైన్ అనుసంధానం చేసి లబ్ధిదారుని పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు.
Here's TS CMO Tweet
వృద్ధాప్య పెన్షన్లకు అర్హతను 57 సంవత్సరాలకు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో సంబంధిత ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని కేబినెట్ అధికారులను ఆదేశించింది. ఈ నిర్ణయంతో మరో 6,62,000 కొత్త పింఛన్లు పెరగనున్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పింఛన్ల సంఖ్య 58 లక్షలకు చేరుకోనున్నది. కుటుంబంలో ఒక్కరికే పింఛను పద్ధతిని కొనసాగిస్తూ భర్త చనిపోతే భార్యకు, భార్య చనిపోతే భర్తకు వెంటనే పెన్షన్ బదిలీ చేయాలని, ఈ ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు.