CM KCR on National Politics: జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు,నేను బతికుండగా తెలంగాణను ఆగం కానివ్వను, మ‌త పిచ్చిగాళ్ల‌ను తరిమికొట్టాలని సీఎం పిలుపు

రంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌రేట్‌ను ప్రారంభించిన అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో (CM KCR Public Meeting) కేసీఆర్ ప్ర‌సంగించారు. ఇండియాలో దరిద్రపుగొట్టు వాతావరణం చూస్తున్నామని, మనకు పంటల తెలంగాణ కావాలా? మంటల తెలంగాణ కావాలా? అంటూ ప్రశ్నించారు.

CM KCR

Hyd, August 25: తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. రంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌రేట్‌ను ప్రారంభించిన అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో (CM KCR Public Meeting) కేసీఆర్ ప్ర‌సంగించారు. ఇండియాలో దరిద్రపుగొట్టు వాతావరణం చూస్తున్నామని, మనకు పంటల తెలంగాణ కావాలా? మంటల తెలంగాణ కావాలా? అంటూ ప్రశ్నించారు. ‘‘మౌనంగా భరిద్ధామా? పిడికిలి బిగిద్దామా?. మౌనంగా భరిస్తే మతచిచ్చు పెట్టే మంటలు వస్తాయి. తమిళనాడు, బెంగాల్‌, ఢిల్లీలో ప్రభుత్వాలను కూలగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. మనం నిద్రపోతే పెద్ద ప్రమాదానికి లోనవుతాం. నేను బతికుండగా తెలంగాణను ఆగం కానివ్వం’’ అంటూ కేసీఆర్‌ సభలో నిప్పులు చెరిగారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వాన్ని (BJP Govt) సాగ‌నంపాల‌ని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అప్పుడే ఈ దేశం, తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంద‌ని సీఎం స్ప‌ష్టం చేశారు.కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఒక్క మంచిప‌ని కూడా చేయ‌లేద‌ని విమ‌ర్శించారు. ద‌ళితుల‌కు, గిరిజ‌నుల‌కు, మ‌హిళ‌ల‌కు, బ‌ల‌హీన‌వ‌ర్గాల‌కోసం కేంద్రంలోని మోదీ స‌ర్కారు ఏమైనా చేసిందా? అని ప్ర‌శ్నించారు. బీజేపీ ఎనిమిదేళ్ల పాల‌న‌లో దేశంలో ఒక్క ప్రాజెక్టు కూడా క‌ట్ట‌లేద‌ని మండిప‌డ్డారు. ప్ర‌ధాని మోదీ పెద్ద‌పెద్ద మాట‌లు మాట్లాడుతున్నార‌ని విమ‌ర్శించారు.

ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్ట్, పాత కేసులకు సంబధించి మళ్లీ నోటీసులు ఇచ్చిన పోలీసులు, బీజేపీ రౌడీయిజం చేస్తే సహించేది లేదని తెలిపిన హోం మంత్రి మహమూద్‌ అలీ

తాను సీఎం అయినప్పుడే మోదీ ప్రధాని అయ్యార‌ని, కానీ తెలంగాణ లెక్క దేశంలో ఎక్క‌డా 24 గంట‌ల క‌రెంటు, మంచినీళ్లు ఇవ్వ‌డం లేద‌ని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌లో 24 గంట‌ల క‌రెంట్, ఇంటింటికీ మంచినీళ్లు ఇస్తుంటే.. దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఎందుకు ఇవ్వ‌లేక‌పోతున్నార‌ని సీఎం ప్ర‌శ్నించారు. ఇలాంటి ప్రధాని మనకు అవ‌స‌ర‌మా? అని అడిగారు. కేంద్రంలో ఉండే ప్రధాని కుట్రలు పన్ని తొమ్మిది రాష్ట్రాల్లో ప్రజలు ఎన్నుకున్న ప్ర‌భుత్వాల‌ను కూల‌గొట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని మండిప‌డ్డారు.

తమిళనాడులో మూడింట రెండో వంతు మెజార్టీతో గెలిచిన‌ స్టాలిన్ స‌ర్కారుతోపాటు ప‌శ్చిమ‌బెంగాల్‌లోని మమ‌తాబెన‌ర్జీ, ఢిల్లీలోని కేజ్రీవాల్ స‌ర్కారును కూల‌దోసేందుకు మోదీ అప్ర‌జాస్వామికంగా య‌త్నిస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. ఇది ప్రజాస్వామ్యమా? అని ప్ర‌శ్నించారు. దీన్ని ఇట్లే భరిస్తే తాను చెప్పిన‌ట్టు మతపిచ్చి మంటలే వస్తాయ‌ని సీఎం కేసీఆర్ ఆందోళ‌న వ్య‌క్తంచేశారు.

కృష్ణా జ‌లాల్లో తెలంగాణ వాటా తేల్చ‌మంటే మోదీకి చేత‌కాదని కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ఉల్టా ప‌ల్టా మాట్లాడుతారు. రంగారెడ్డి, వికారాబాద్, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, న‌ల్ల‌గొండ జిల్లాల‌కు నీళ్లు రావాలి. 100 ద‌ర‌ఖాస్తులు ఇస్తే ఉలుకుప‌లుకు లేదు. సుప్రీంకోర్టులో కేసు విత్ డ్రా చేసుకుంటే నీళ్లు ఇస్తామ‌ని, ట్రిబ్యున‌ల్‌కు సిఫార‌సు చేస్తామ‌న్నారు కానీ స్పంద‌న లేదు. ఏడాది అయిపోయింద‌ని కేసీఆర్ గుర్తు చేశారు.

హైదరాబాద్‌లో చుక్కలనంటుతున్న వినాయక విగ్రహాల ధరలు, రెండేళ్లతో పోలిస్తే భారీగా పెరిగిన ధరలు, ఎంత పెరిగాయి? ఎందుకు పెరిగాయో తెలుసా?

రాబోయే రోజుల్లో జాతీయ రాజ‌కీయాల్లో కూడా తెలంగాణ ఉద్విగ్న‌మైన పాత్ర‌ను పోషించాలి. జాతీయ రాజ‌కీయాల్లో పిడికిలి ఎత్తాలి. మన రాష్ట్రం కూడా బంగారు తెలంగాణగా త‌యార‌వుతుంది. జాతీయ రాజ‌కీయాల్లో ఉజ్వ‌ల‌మైన పాత్ర నిర్వ‌హించి మ‌త‌పిచ్చిగాళ్ల‌ను, ర‌క్త పిశాచుల‌ను, అప్ర‌జాస్వామిక ప‌ద్ధుత‌ల్లో విప‌క్ష పార్టీల ప్ర‌భుత్వాల‌ను కూల‌గొట్టే వారికి క‌చ్చితంగా ఈ దేశంలో స్థానం లేద‌ని నిరూపించేట‌టువంటి మ‌హాయ‌జ్ఞంలో తెలంగాణ భాగ‌స్వామ్యం కావాలి. మీ అంద‌రి అనుమ‌తితో ఆ ప‌నికి నేను జెండా ఎత్తుతాను అని మ‌న‌వి చేస్తున్నానని కేసీఆర్ పేర్కొన్నారు.

రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాలు మీ కండ్ల ముందే ఉన్నాయని ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలిపారు. రంగారెడ్డి జిల్లాకు కొత్త‌గా చ‌క్క‌టి స‌మీకృత ప‌రిపాల‌న భ‌వనాన్ని నిర్మించి ప్రారంభించ‌నందుకు అంద‌రికీ హృద‌య‌పూర్వ‌కంగా అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాన‌ని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ కోసం ఉద్య‌మం జ‌రిగే స‌మ‌యంలో రంగారెడ్డి జిల్లాలో అనేక ర‌కాల త‌ప్పుడు ప్ర‌చారాలు చేశారు. భూములు ధ‌ర‌లు ప‌డిపోతాయ‌ని, రాష్ట్రం వ‌స్తే లాభం ఉండ‌ద‌ని చెప్పారు. మన‌కు క‌రెంట్, మంచినీరు ఇవ్వ‌ని వారు మ‌న‌ల్ని గోల్ మాల్ చేసే ప్ర‌య‌త్నం చేశారు. ప‌ట్టుద‌ల‌తో 14 ఏండ్లు పోరాడితే చాలా త్యాగాల త‌ర్వాత రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కొత్త జిల్లాల‌ను సాధించుకున్నామ‌ని కేసీఆర్ తెలిపారు.

మీ గ్రామాల్లో అంద‌రితో చ‌ర్చ పెట్టాలి. ఒక్క‌టే ఒక్క మాట మ‌నవి చేస్తున్నా. ఏ స‌మ‌యంలో గానీ, పురాణం, చ‌రిత్ర చ‌దివినా.. ప్ర‌జ‌ల‌ను చైత‌న్యం చేసే మేధావులు, యువ‌త నిద్రాణ‌మై ఉంటారో.. వాళ్లు చాలా బాధ‌లు అనుభ‌విస్తారు. మ‌న సొంత చ‌రిత్ర‌నే మ‌న‌కు మంచి ఉదాహ‌ర‌ణ‌. స్వ‌తంత్ర భార‌త‌దేశంలో హైద‌రాబాద్ స్టేట్‌గా ఉన్నాం. ఆ త‌ద‌నంత‌రం నాటి నాయ‌క‌త్వం ఏమ‌రుపాటుగా ఉంటే మ‌నం ఏపీలో భాగ‌మ‌య్యాం. అనేక బాధ‌లు ప‌డ్డాం. ఉద్య‌మ స‌మ‌యంలో అనేక స‌భ‌ల ద్వారా తెలంగాణ ప్ర‌జ‌ల‌ను చైత‌న్యం చేశాం. ఏపీ నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు 1969లో జ‌రిగిన ఉద్య‌మంలో 400 మంది పిల్ల‌లు బ‌ల‌య్యారు. మ‌లిద‌శ ఉద్య‌మంలో అనేక మంది చ‌నిపోయారు. అహింసా ప‌ద్ధ‌తిలో ముందుకు పోయిప్ప‌టికీ అనేక బాధ‌లు అనుభ‌వించాం.

బ‌య‌ట‌ప‌డ్డ త‌ర్వాత ఇక్క‌డ జ‌రుగుతున్న విష‌యాలు, క‌లుగుతున్న స‌దుపాయాలు మీ కండ్ల ముందే ఉన్నాయి. మీరంద‌రూ వాటిని చూస్తున్నారు. ఇవాళ ఇండియాలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ ప‌థ‌కాలు, రైతుల ప‌థ‌కాలు అమ‌ల‌వుతున్నాయి. రైతుబీమా స‌దుపాయం యావ‌త్ ప్ర‌పంచంలోనే ఎక్క‌డా లేదు. ఓ గుంట ఉన్న రైతు చ‌నిపోయినా వారం ప‌ది రోజుల్లో రూ. 5 ల‌క్ష‌లు బీమా కింద జ‌మ అవుతున్నాయి. వేరే చోట రైతులు చాలా బాధ‌లు ప‌డుతున్నారు. కానీ తెలంగాణ రైతులకు ఆ బాధ‌లు లేవు. పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేశాం. ద‌ళారీ వ్య‌వ‌స్థ‌కు స్వ‌స్తి ప‌లికాం. డ‌బ్బులు రెండు మూడు రోజుల్లోనే జ‌మ అవుతున్నాయి. ఆ విధంగానే రైతుబంధు డ‌బ్బులు మీ ఖాతాల్లో జ‌మ అవుతున్నాయి. రైతుల అప్పులు చేయకుండా పంట‌లు పండిస్తున్నారు. 24 గంట‌లు వ్య‌వ‌సాయానికి ఉచితంగా క‌రెంట్ ఇస్తున్నాం. ఈ విష‌యాలు కొత్త‌వి కావ‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

ఒక ఇల్లు కట్టాలంటే చాలా స‌మ‌యం ఏర్ప‌డుతుంది. రాష్ట్రం ఏర్ప‌డాలంటే చాలా సంవ‌త్స‌రాలు ప‌డుతుంది. ప్రాజెక్టు క‌ట్టాలంటే చాలా స‌మ‌యం ప‌డుతుంది. మూఢ‌న‌మ్మ‌కాలు, పిచ్చితో, ఉన్మాదంతో వాట‌న్నింటిని రెండు మూడు రోజుల్లో కూల‌గొట్టొచ్చు. ఎంత క‌ష్ట‌మైత‌ది. శిథిల‌మైపోతది. 58 ఏండ్లు తెలంగాణ కోసం కొట్లాడం. తెలంగాణ ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాలి. బెంగ‌ళూరు సిటీ సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరొందింది. అక్క‌డి ప్ర‌భుత్వాలు చాలా క‌ష్ట‌ప‌డి ఒక వాతావ‌ర‌ణాన్ని నిర్మాణం చేశారు. 30 ల‌క్ష‌ల మందికి ఐటీలో ప్ర‌త్య‌క్షంగా ఉద్యోగాలు దొర‌కుతున్నాయి. ఈ సంవ‌త్స‌రం మ‌న కంటే త‌క్కువ ఉద్యోగాల క‌ల్ప‌న జ‌రిగింది. తెలంగాణ ఒక ల‌క్షా 55 వేల ఉద్యోగాలు ఇచ్చింది. కానీ బెంగ‌ళూరులో ఈ ఏడాది ఏడెనిమిది వేల ఉద్యోగాలు త‌గ్గిపోయాయి. అక్క‌డ వాతావ‌ర‌ణాన్ని కలుషితం చేశారు. అలాంటి వాతావ‌ర‌ణం తెలంగాణ‌లో, హైద‌రాబాద్‌లో రావాలా? మ‌న పిల్ల‌ల‌కు ఉద్యోగాలు రాకుండా పోవాలా? ఆలోచించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కేసీఆర్ ప్ర‌శ్నించారు.

రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగిస్తున్న బీజేపీ నాయకుల‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ విరుచుకుప‌డ్డారు. మ‌న ఐక్య‌త దెబ్బ‌తిన్న‌నాడు, మ‌త శ‌క్తుల పిచ్చికి లోన‌యిన్ప‌పుడు, మ‌నం చెదిరిపోయిన్నాడు మ‌ళ్లీ పాత తెలంగాణ‌లాగా త‌యార‌వుతాం. బ‌తుకులు ఆగం అవుతాయి. వీళ్లు ఎక్క‌డా ఉద్ద‌రించింది లేదు. కుట్ర‌ల‌కు కాలు దువ్వుతున్నారు. స్వార్థ‌, నీచ‌, మ‌త‌పిచ్చిగాళ్ల‌ను మ‌నం ఎక్క‌డిక‌క్క‌డ త‌రిమికొట్టాలి. అప్ర‌మ‌త్తంగా ఉండాలి. మోస‌పోతే గోస ప‌డుతామ‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

మ‌త‌పిచ్చికి లోనైతే ఒక వంద సంవ‌త్స‌రాలు తెలంగాణ‌, భార‌త‌దేశం ఆగ‌మైత‌ది. ఒక్క‌సారి దెబ్బ‌తింటే.. విభ‌జ‌న వ‌స్తే స‌మాజానికి మంచిది కాదు అని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రేమ‌తో, గౌర‌వంతో, అనురాగంతో బ‌తికే స‌మాజం బాగుప‌డుత‌ది. కానీ క‌ర్ఫ్యూల‌తో, లాఠీఛార్జీల‌తో, కోపంతో, అస‌హ్యాంతో ఏ స‌మాజం కూడా పురోగ‌మించిన దాఖ‌లాలు లేవు. అలాంటి దానికి మ‌న రాష్ట్రం బ‌లికావొద్ద‌ని, ఆకుప‌చ్చ‌గా అల‌రాడుతున్న తెలంగాణ అద్భుతంగా ముందుకు పోవాలి. శాంతియుత తెలంగాణ‌కు న‌డుం క‌ట్టాలి. దానికోసం మ‌నంద‌రం ముందుకు పోవాలి. మ‌న రాష్ట్రాన్ని కాపాడుకోవ‌డంలో మ‌నం ముందంజ‌లో ఉండాలి. రంగారెడ్డి జిల్లా ప్ర‌జ‌లు చైత‌న్య‌వంతులు కాబ‌ట్టి అగ్ర‌భాగాన ఉండాలని కేసీఆర్ కోరారు.



సంబంధిత వార్తలు

Nara Devansh Set A Record In Chess: నారా దేవాన్ష్ టాలెంట్ కు ప్ర‌పంచం ఫిదా, 9 ఏళ్ల వ‌య‌స్సులోనే స‌రికొత్త రికార్డు సృష్టించిన నారావారి వార‌సుడు

CM Revanth Reddy: సర్వమత సమ్మేళనంం తెలంగాణ, మత విద్వేషాలు రెచ్చగోడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి, క్రిస్టియన్ల సంక్షేమం- అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామన్న సీఎం

Pawan Kalyan Welcome Film Industry To AP: ఏపీలో షూటింగ్స్ చేయండి! సినీ ఇండస్ట్రీకి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆహ్వానం, అల్లు అర్జున్ పై రేవంత్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ప్రాధాన్య‌త సంత‌రించుకున్న కామెంట్స్

Allu Arjun on Sandhya Theater Row: అందుకే శ్రీ‌తేజ్ ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్ల‌లేదు, నేను ఆ రోజు అస్స‌లు రోడ్ షో చేయ‌లేదు, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై స్పందించిన అల్లు అర్జున్

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif