Hyd, August 25: బీజేపీ సస్పెండ్ ఎమ్మెల్యే రాజాసింగ్.. మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు (Prophet Remark Row) చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మజ్లీస్ నేతల ఫిర్యాదు మేరకు కేసులు నమోదయ్యాయి. దీంతో, పోలీసులు రాజాసింగ్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం, కోర్టు రాజాసింగ్‌కు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన బయటకు వచ్చారు. వేటు పడింది, ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్ వేటు, పార్టీలోని అన్ని బాధ్యతల నుంచి రాజాసింగ్‌ను తొలగిస్తున్నట్లు బీజేపీ ప్రకటన
అయితే మళ్లీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై షాహినాయత్ గంజ్‌లోని ఆయన ఇంట్లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజాసింగ్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఎమ్మెల్యే ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాజాసింగ్ ఇంటి చుట్టూ భారీగా పోలీసులను మోహరించారు.
ఇక పోలీసులు మరోసారి రాజాసింగ్‌కు నోటీసులు పంపించారు. పాత కేసులకు (Telangana Police serves notices) సంబంధించి రెండు కేసుల్లో 41(A) సీఆర్పీసీ నోటీసులు అందజేశారు. ఫిబ్రవరి, ఏప్రిల్ నెలకు సంబంధించి రాజాసింగ్‌కు (BJP Suspended MLA Raja Singh) పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు మంగళ్‌హట్, షాహినాయత్‌గంజ్ పోలీసులు రెండు నోటీసులు ఇచ్చారు. మంగళ్‌హట్ పీఎస్‌లో 68/2022 క్రైమ్ నంబర్ కేసులో, షాహినాయత్‌గంజ్ పీఎస్‌లో క్రైమ్ 71/2022లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
ఈ సందర్భంగా పోలీసుల నోటీసులపై రాజాసింగ్ స్పందించారు. ఇక, రాజాసింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నన్ను మళ్లీ అరెస్ట్ చేయడానికి పోలీసులు కుట్ర చేస్తున్నారు. పాత కేసులకు సంబంధించి 41(A) సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారు. ఏప్రిల్ ఘటనకు సంబంధించి ఇప్పుడు నోటీసులు ఇవ్వడమేంటి’’ అని ప్రశ్నించారు.
ఇక పాతబస్తీలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
ముస్లిం నేతల ఆందోళన నేపథ్యంలో పోలీసు బలగాలు పాతబస్తీలో మోహరించాయి. కాగా, రాజాసింగ్ వ్యాఖ్యలపై తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ స్పందించారు. హోం మంత్రి మహమూద్ అలీ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘శాంతియుత వాతావరణాన్ని బీజేపీ కలుషితం చేస్తోంది. రాజాసింగ్ వ్యాఖ్యలతో శాంతిభద్రతల సమస్య ఏర్పడింది. బీజేపీ రౌడీయిజం చేస్తే సహించేది లేదు. బీజేపీ అయినా.. ఎంఐఎం అయినా తప్పు చేస్తే ఎవరినీ వదిలేది లేదు’’ అంటూ కామెంట్స్ చేశారు.