CM KCR Review: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేసీఆర్ సమీక్ష, రూ.1500 నగదు ఇచ్చే కార్యక్రమం మే నెల నుంచి కొనసాగదు, సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ సీఎం

అప్పుల కిస్తీలను విధిగా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆసరా పెన్షన్లను యధావిధిగా అందించాలని నిర్ణయం తీసుకున్నారు. మే నెలలోకూడా పేదలకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ సడలింపుల కారణంగా కార్మికులు, కూలీలకు మళ్లీ పని దొరకుతోందని కేసీఆర్ తెలిపారు. రూ.1500 నగదు ఇచ్చే కార్యక్రమం మే నెల నుంచి కొనసాగదని ప్రకటించారు. ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం, ఆలిండియా సర్వీసుల వేతనాల్లో 60 శాతం, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం, పెన్షన్లలో 25 శాతం కోతలను మే నెలలో కూడా కొనసాగించాలని కేసీఆర్‌ అధికారులకు ఆదేశించారు.

Telangana CM KCR | Photo: CMO

Hyderabad, May 27: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం ప్రగతి భవన్‌లో సమీక్ష(TS CM KCR Review) నిర్వహించారు. ఆదాయం బాగా తగ్గిపోయిన నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, ఇతర సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణలో కరోనా పరీక్షల తీరుపై అసంతృప్తి వ్యక్తంచేసిన హైకోర్టు, జూన్ 4లోగా దీనిపై పూర్తి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు

ధాన్యం సేకరణలో తెలంగాణల నుంచి సేకరించిన ధాన్యమే దేశంలోనే అత్యధికమని ఎఫ్‌సీఐ (FCI) ప్రకటించడంతో సీఎం కేసీఆర్ రైతులకు అభినందనలు తెలిపారు. దేశానికి తిండి పెట్టే స్థాయికి తెలంగాణ ఎదగడం గర్వంగా ఉందన్నారు. ఇదంతా రాష్ట్రంలో పెరిగిన సాగునీటి లభ్యత, ఉచిత విద్యుత్ ను వినియోగించుకొని రైతులు తమ వృత్తి నైపుణ్యంతో పంటలు పండించారని సీఎం వారిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.

దేశానికి కావాల్సిన ఆహారం అందించడంలో తెలంగాణ రాష్ట్రం (Telangana) నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచిందని భారత ఆహార సంస్థ సిఎండి డివి ప్రసాద్ ప్రకటించారు. 2020 యాసంగిలో తాము సేకరించిన మొత్తం ధాన్యంలో 63 శాతం కేవలం తెలంగాణ రాష్ట్రం నుంచి, మిగతా అన్ని రాష్ట్రాల నుంచి కలిపి 37 శాతం సేకరించినట్లు ఆయన తెలిపారు. దేశ వ్యాప్తంగా ఎఫ్.సి.ఐ. ఈ యాసంగిలో ఇప్పటిదాకా 83.01 లక్షల టన్నులు సేకరించగా, అందులో తెలంగాణ రాష్ట్రం నుంచే 52.23 లక్షల టన్నులు సేకరించినట్లు స్పష్టం చేశారు. తెలంగాణలో కరోనా నియంత్రణపై గుడ్ న్యూస్, ఒక్క రోజే 120 మంది డిశ్చార్జ్, తాజాగా 71 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 1991కి చేరిన మొత్తం కేసుల సంఖ్య

ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అప్పుల కిస్తీలను విధిగా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆసరా పెన్షన్లను యధావిధిగా అందించాలని నిర్ణయం తీసుకున్నారు. మే నెలలోకూడా పేదలకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ సడలింపుల కారణంగా కార్మికులు, కూలీలకు మళ్లీ పని దొరకుతోందని కేసీఆర్ తెలిపారు. రూ.1500 నగదు ఇచ్చే కార్యక్రమం మే నెల నుంచి కొనసాగదని ప్రకటించారు. ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం, ఆలిండియా సర్వీసుల వేతనాల్లో 60 శాతం, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం, పెన్షన్లలో 25 శాతం కోతలను మే నెలలో కూడా కొనసాగించాలని కేసీఆర్‌ అధికారులకు ఆదేశించారు.

లాక్‌డౌన్‌తో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం పడిపోయిందని కేసీఆర్‌ (Telangana CM KCR)ఆవేదన వ్యక్తం చేశారు. మే నెలలో కేంద్రానికి వెళ్లే పన్నుల్లో రాష్ట్ర వాటాగా రావాల్సిన... రూ.982 కోట్లతో కలిపి కేవలం 3,100 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయని తెలిపారు. లాక్‌డౌన్ నిబంధనల్లో కొన్ని సడలింపులు ఇచ్చినా ఆదాయం పెరగలేదని, రిజిస్ట్రేషన్లు, రవాణా తదితర రంగాల్లో ఆదాయం పెద్దగా రాలేదన్నారు. రాష్ట్రం ఏడాదికి రూ.37,400 కోట్లను అప్పులకు కిస్తీలుగా చెల్లించాలని, అప్పులను రీ షెడ్యూల్ చేయాలని కేంద్రాన్ని కోరితే స్పందించలేదని విమర్శించారు. దీంతో కిస్తీలు తప్పక కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంచినా కేంద్రం విధించిన అనేక షరతుల కారణంగా అదనపు రుణాలను సమకూర్చుకునే పరిస్థితి లేదని కేసీఆర్ చెప్పారు.