Telangana CM KCR Yadadri Tour: ఐదు నెలల తర్వాత యాదాద్రిలో సీఎం కేసీఆర్, అభివృద్ధి పనులను గురించి ఆరా తీసిన తెలంగాణ ముఖ్యమంత్రి, రూ.1200 కోట్లతో పునః నిర్మాణ పనులు
ప్రధానాలయంతో పాటు కొండపైన, కొండకింద జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. హెలికాప్టర్‌లో ఉదయం 11.30 గంటల సమయంలో యాదగిరిగుట్టకు చేరుకున్న సీఎం కేసీఆర్ (Telangana CM KCR Yadadri Tour) ముందుగా స్వామివారి పూజలో పాల్గొన్నారు.
Hyderabad, Mar 4: తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు యాదాద్రికి చేరుకున్నారు. ప్రధానాలయంతో పాటు కొండపైన, కొండకింద జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. హెలికాప్టర్‌లో ఉదయం 11.30 గంటల సమయంలో యాదగిరిగుట్టకు చేరుకున్న సీఎం కేసీఆర్ (Telangana CM KCR Yadadri Tour) ముందుగా స్వామివారి పూజలో పాల్గొన్నారు. అనంతరం దేవాలయ అధికారులతో సీఎం (Telangana CM KCR) సమావేశం నిర్వహించారురు. యాదాద్రి ఆలయ (Yadadri Temple) పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. యాదాద్రి ప్రధాన ఆలయ పునర్నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి.
పంచనారసింహ క్షేత్రం యాదగిరిగుట్టలో ఆలయ అభివృద్ధి పనులు ఏ మేరకు జరిగాయని అధికారులను ఆరా తీశారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ప్రత్యేకంగా తయారు చేయించిన క్యూ లైన్లులను పరిశీలించారు. బంగారు వర్ణంలో తయారు చేయబడిన క్యూలైన్ గ్రిల్స్‌పై శంకుచక్రాలు, గోవిందా నామాలు, ముఖ మండపం, ఐరావతం బొమ్మలు, అల్లికలను ప్రత్యేకంగా పరిశీలించిన సీఎం కేసీఆర్ క్యూలైన్లపై పలు సూచనలు చేశారు.
గతేడాది సెప్టెంబర్ 13న యాదాద్రికి వచ్చిన సీఎం కేసీఆర్, ఐదు నెలల అనంతరం మళ్లీ క్షేత్రంలో పర్యటించారు. లక్ష్మీనృసింహస్వామి ప్రధాన ఆలయం పునః ప్రారంభం ఘనంగా నిర్వహించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఉన్నారు. రూ.1200 కోట్లతో పునః నిర్మాణ పనులు 2016, అక్టోబర్‌లో శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు సుమారు రూ.850 కోట్లు వెచ్చించినట్లు యాడా అధికారులు పేర్కొన్నారు. పూర్తిగా కృష్ణశిలతో నిర్మించిన ఆలయం అద్భుత గోపురాలు, ప్రాకారాలు, దశావతారాలు, ఆళ్వారులు, శిల్పాలతో అలరాలుతోంది.
ఆ అంకుల్ నచ్చాడు..అందుకే ఆయనతో వెళ్లిపోతున్నా, హయత్‌నగర్‌లో ఓ మైనర్ బాలిక నిర్వాకం, యాదయ్య అంకుల్ నచ్చాడు.. నా ఇష్టప్రకారమే వెళ్తున్నా అంటూ సోదరుడికి మెసేజ్, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
యాదాద్రి ప్రధాన ఆలయం వద్ద అత్యంత సుందరంగా.. అద్భుతంగా ఏడు గోపురాలను మలిచారు. నాలుగు దిక్కుల నాలుగు పంచతల గోపురాలను నిర్మించారు. ఒక్కొక్క పంచతల గోపురం ఎత్తు 57 అడుగులు, పశ్చిమం వైపు 85 అడుగుల ఎత్తుతో మహారాజ గోపురాన్ని నిర్మించారు. తూర్పు గోపురం నుంచి ముఖమండపానికి వెళ్లేదారిలో 30.8 అడుగుల ఎత్తులో త్రితల గోపురం ఉంటుంది. ఇక్కడి నుంచి గర్భగుడిలోకి మార్గం ఉంటుంది. గర్భగుడి నుంచి స్వామివారిని దర్శనం చేసుకొని పశ్చిమ గోపురం నుంచి బయటకు రావాల్సి ఉంటుంది. సరిగ్గా గర్భాలయంపైన విమాన గోపురం ఉంటుంది.
స్వామివారి ప్రధానాలయం రెండో అంతర్ ప్రాకారాల వద్ద నాలుగు వైపులా నాలుగు మండపాలను నిర్మించారు. తూర్పు-దక్షిణ భాగంలో రామానుజకూటం ఉంటుంది. స్వామివారి కైంకర్యాల కోసం ఏర్పాటు చేసిన మండపం ఇది. నైరుతివైపు యాగశాల, వాయవ్యంలో అద్దాల మండపం నిర్మించారు. ఈశాన్యం వైపు నిత్యకల్యాణ మండపాన్ని ఏర్పాటుచేశారు. రెండో బాహ్య ప్రాకారం వద్ద నాలుగు దిక్కుల్లో అష్టభుజి మండపాలను నిర్మించారు. స్వామివారి గర్భగుడి ఎదురుగా ఉండే ముఖమండపాన్ని 150 మందికిపైగా కూర్చునేలా తీర్చిదిద్దారు.