Corona Free Districts in TS: 11 జిల్లాలు కరోనా రహితం, తెలంగాణలో మే 7 వరకు లాక్‌డౌన్, మే 8 నాటికి కరోనారహిత రాష్ట్రం, ఆశాభావం వ్యక్తం చేసిన ఐటీ మంత్రి కేటీఆర్

కరోనా ఫ్రీ జిల్లాలను ఓ సారి పరిశీలిస్తే.. సిద్దిపేట, మహబూబాబాద్‌, మంచిర్యాల, యాదాద్రి భువనగిరి, నారాయణపేట, వనపర్తి, పెద్దపల్లి, వరంగల్‌ రూరల్‌, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌కర్నూల్‌, ములుగు జిల్లాల్లో కరోనా యాక్టివ్‌ కేసులు లేకుండా ఉన్నాయి.

TRS Party working president, Telangana IT Minister KTR | Photo: Twitter

Hyderabad, April 30: రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ యాక్టివ్‌ కేసులు లేకుండా ఉన్న జిల్లాలు (Corona Free Districts in TS) 11గా ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. కరోనా ఫ్రీ జిల్లాలను ఓ సారి పరిశీలిస్తే.. సిద్దిపేట, మహబూబాబాద్‌, మంచిర్యాల, యాదాద్రి భువనగిరి, నారాయణపేట, వనపర్తి, పెద్దపల్లి, వరంగల్‌ రూరల్‌, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌కర్నూల్‌, ములుగు జిల్లాల్లో కరోనా యాక్టివ్‌ కేసులు లేకుండా ఉన్నాయి. మే 4 నుంచి లాక్‌డౌన్‌కు సంబంధించిన కొత్త మార్గదర్శకాలు అమలు, మరిన్ని సడలింపులు లభించే చాన్స్, సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు వలస కూలీలు, విద్యార్థులకు ఇప్పటికే అనుమతి

అందులో వనపర్తి, వరంగల్‌ రూరల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. సిద్దిపేట, మహబూబాబాద్, మంచిర్యాల, నారాయణపేట్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌కర్నూలు, ములుగు జిల్లాలకు చెందిన వారెవరూ ఆసుపత్రుల్లో చికిత్స పొందడం లేదు. ఈ 8 జిల్లాలకు చెందిన పాజిటివ్‌ కేసులున్న వారందరికీ వ్యాధి నయమై వెళ్లిపోయారు.

ఈ నేపధ్యంలోనే ఈ జిల్లాలన్నింటినీ ప్రభుత్వం కరోనా రహిత జిల్లాలుగా ప్రకటిం చినట్లు ప్రజారోగ్య డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు బుధవారం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1016 మంది బాధితులు కరోనా వైరస్‌ (Telangana Coronavirus) బారిన పడ్డారు. కరోనా నుంచి కోలుకుని నిన్న 35 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. నిన్న డిశ్చార్జ్‌ అయిన వారిలో 13 మంది చిన్నారులు ఉన్నారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో 10 మందికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ప్రజల ఆహార అవసరాలకు సరిపోయే, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను రైతులు పండించాలి! ఏ పంటలు సాగుచేస్తే రైతులకు లాభమో మే 5 లోగా నివేదిక ఇవ్వాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

10 మందిలో ఒకరు వెంటిలేటర్‌పై ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. కరోనా నుంచి కోలుకున్న 23 రోజుల బాబుకు నెగిటివ్‌ రావడంతో వైద్యులు డిశ్చార్జ్‌ చేశారు.ఇప్పటి వరకు ఈ వైరస్ బారిన పడి 25 మంది మరణించారు.కొత్తగా 7 పాజిటివ్‌ కేసులు నమోద య్యాయని అందులో వెల్లడించారు. అవన్నీ జీహెచ్‌ఎంసీ పరిధిలోనివేనని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం 'రైస్ బౌల్ ఆఫ్ ఇండియా' గా మారుతోందన్న సీఎం కేసీఆర్, వ్యవసాయం లాభదాయకంగా మార్చేలా సమగ్ర వ్యూహాన్ని ఖరారు చేయాలని అధికారులకు ఆదేశం

గత వారంతో పోలిస్తే రాష్ట్రంలో పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నాయని అధికారులు అంటున్నారు. వారం రోజులుగా కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆదివారం 11 కేసులు మాత్రమే నమోదు కాగా, సోమవారం రెండు కేసులు మాత్రమే నమోదయ్యాయి. నిన్న ఆరు కేసులు నమోదు కాగా, బుధవారం ఏడు కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. గాంధీ ఆస్పత్రిలో ఇకనుంచి ప్లాస్మా థెరపీ, కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్, 32 మంది ప్లాస్మా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారంటూ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ లేఖ

తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ (Telangana Lockdown) అమలు తీరు, వైరస్‌ వ్యాప్తి నియం త్రణకు సర్కారు తీసుకుంటున్న చర్యలపై అధ్యయనం చేసేందు కు వచ్చిన కేంద్ర బృందం ఐదో రోజు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలను సందర్శించింది. బీఆర్కేఆర్‌ భవన్‌లో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో భేటీ అయింది. అనంతరం ఆ బృందం ఎస్‌ఆర్‌ నగర్‌లోని ఆయుర్వేద ఆస్పత్రిని, కూకట్‌పల్లిలోని కంటైన్మెంట్‌ జోన్లో రెండు ప్రాంతాలను పరిశీలించింది. 3 రోజుల రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర బృందం మే 2 వరకు రాష్ట్రంలోనే పర్యటించనుందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా మే 8 నాటికి తెలంగాణ (Telangana) కరోనారహిత రాష్ట్రంగా మారగలదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారక రామారావు ఆశాభావం వ్యక్తంచేశారు. మూడు నాలుగు రోజులుగా రాష్ట్రంలో సింగిల్‌ డిజిట్‌లో మాత్రమే కేసులు నమోదవుతున్నాయని ఆయన తెలిపారు.రాష్ట్రంలో మే 7 వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుందని, ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారందరూ అప్పటికి డిశ్చార్జి అవుతారని అంచనా వేస్తున్నామని చెప్పారు.