Lockdown Extended In TS: తెలంగాణలో మరో నెల రోజులు లాక్‌డౌన్ పొడిగింపు, ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ సర్కారు, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కంటైన్‌మెంట్ జోన్లలో ఈ నెల 31 వరకు లాక్‌డౌన్ (Lockdown) అమల్లో ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపారు. వైద్యం, అత్యవసర విధుల్లో పాల్గొనేవారికి కర్ఫ్యూ నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఆస్పత్రులు, మందుల దుకాణాలు మినహా మిగిలిన అన్ని వాణిజ్య సముదాయాలు రాత్రి 9.30 వరకు తమ కార్యకలాపాలను ముగించాలని పేర్కొంది.
Hyderabad, July 1: తెలంగాణ రాష్ట్రంలో మరో నెలరోజులపాటు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ (Lockdown Extended In TS) ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కంటైన్‌మెంట్ జోన్లలో ఈ నెల 31 వరకు లాక్‌డౌన్ (Lockdown) అమల్లో ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణలో మరో 945 పాజిటివ్ కేసులు, రాష్ట్రంలో 16 వేలు దాటిన మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య, 260కి పెరిగిన కరోనా మరణాలు
రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపారు. వైద్యం, అత్యవసర విధుల్లో పాల్గొనేవారికి కర్ఫ్యూ నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఆస్పత్రులు, మందుల దుకాణాలు మినహా మిగిలిన అన్ని వాణిజ్య సముదాయాలు రాత్రి 9.30 వరకు తమ కార్యకలాపాలను ముగించాలని పేర్కొంది. ముంబైలో మళ్లీ 144 సెక్షన్, మహారాష్ట్రలో కొనసాగుతున్న కరోనా కల్లోలం, ప్రారంభమైన స్థానిక రైళ్లు, కోవిడ్-19 నేపథ్యంలో అక్కడ వినాయక ఉత్సవాలు రద్దు
కేంద్రం విధించిన అన్‌లాక్ 2.0 నిబంధనలు తక్షణం అమలులోకి వస్తాయని పేర్కొంది. కాగా, పాజిటివ్ కేసులు (Telangana coronavirus) భారీ సంఖ్యలో నమోదవుతుండటంతో కంటైన్మెంట్ జోన్లు, బఫర్ జోన్లలో లాక్ డౌన్, రూల్స్ కఠినంగా అమలు చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం నాటికి తెలంగాణలో 16,339 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 260 మంది కోవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం తెలంగాణలో 945 కొత్త కేసులు నమోదు కాగా.. జీహెచ్ఎంసీ పరిధిలోనే 869 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 29, సంగారెడ్డి జిల్లాలో 21, మేడ్చల్ జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి.
ప్రభుత్వం తీరుపై తెలంగాణ హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం
ఇదిలా ఉంటే కరోనా నిర్ధారణ పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం తీరుపై తెలంగాణ హైకోర్టు (Telangana Highcourt) మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. టెస్టులు చేయకుండా పౌరుల జీవించే హక్కును కాలరాసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని బుధవారం మండిపడింది. కరోనా వ్యాప్తి కట్టడి, వైద్య సిబ్బందికి పీపీఈ కిట్ల అందజేత తదితర అంశాల్లో గతంలో ఇచ్చిన ఆదేశాలను ఎందుకు పట్టించుకోవడం లేదని సర్కారును ప్రశ్నించింది.
మే 23 నుంచి జూన్ 23 వరకు ఎన్ని కరోనా టెస్టులు చేశారు? ప్రైమరీ, సెంకడరీ కాంటాక్ట్స్ శాంపిల్స్ ఎన్ని తీసుకున్నారు? జూన్ 26న టెస్టులు ఎందుకు అపేయాల్సి వచ్చింది? భారత వైద్య పరిశోధనా మండలి మార్గదర్శకాల ప్రకారం లక్షణాలు ఉన్నవారికి, లేని వారికి ఎన్ని పరీక్షలు నిర్వహించారో తెలపాలని ప్రభుత్వాన్ని అదేశించింది.
అదే విధంగా రాష్ట్రంలో కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్ర బృందం.. ఎక్కడెక్కడ పర్యటించిందన్న అంశానికి సంబంధించి ఈనెల 17న పూర్తి వివరాలు అందజేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అంతేగాక డాక్టర్లు, పారమెడికల్ సిబ్బందికి ఏప్రిల్ 21, జూన్ 8 , జూన్ 18 రోజున ఎన్నెన్ని పీపీఈ కిట్లు ఇచ్చారో తెలపాలని ఆదేశించింది.
తదుపరి విచారణలో భాగంగా జూలై 17న న్యాయస్థానం ప్రభుత్వ వివరాలపై సంతృప్తి చెందక పోతే.. జూలై 20న చీఫ్ సెక్రెటరీ, ప్రిన్సిపల్ సెక్రెటరీ హెల్త్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, హెల్త్ కమిషనర్ కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. నివేదికలు సమర్పించకపోతే.. కోర్టు ధిక్కరణగా భావిస్తామని హెచ్చరించింది. కరోనా పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై దాఖలైన పిటిషన్‌ను బుధవారం విచారించిన కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.