Mumbai, July 1: మహారాష్ట్ర రాజధాని ముంబైలో మళ్లీ 144 సెక్షన్ (Section 144 in Mumbai) విధించారు. బుధవారం నుంచి ఇది అమలులోకి వచ్చినట్లు ముంబై పోలీస్ కమిషనర్ ప్రణయ అశోక్ తెలిపారు. ఈ నేపథ్యంలో బహిరంగ, మతపరమైన ప్రదేశాల్లో ఎక్కువ మంది గుమిగూడి ఉండకూడదని చెప్పారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమలులో ఉంటుందని తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా కేసుల్లో ఢిల్లీని దాటేసిన తమిళనాడు, దేశంలో తాజాగా రికార్డు స్థాయిలో 507 మంది మృతి, 5 లక్షల 85 వేలు దాటిన కోవిడ్-19 కేసులు
దేశంలో కరోనా కేసుల పరంగా మహారాష్ట్ర (Coronavirus Cases in Maharashtra) తొలిస్థానంలో కొనసాగుతున్నది. ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు 1.7 లక్షల మంది కరోనా బారినపడగా 7,610 మంది మరణించారు. మహారాష్ట్రలో 4810 మంది పోలీసులకు కరోనా సోకింది. వారిలో 59 మంది చనిపోయారు.
ఇదిలా ఉంటే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో స్థానిక రైళ్లు (Mumbai Local Trains) ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా నేటినుంచి అన్‌లాక్-2 (Unlock-2) అమల్లోకి రావడంతో ముంబైలో 350 లోకల్ రైళ్లను రైల్వేశాఖ నడుపుతున్నది. అయితే వీటిలో ప్రయాణించేందుకు అత్యవసర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే మహారాష్ట్ర సర్కార్ (Maharashtra Govt) అనుమతించింది. సాధారణ ప్రయాణికులకు వీటిలో ప్రయాణించే అవకాశం ప్రస్తుస్తానికి లేదని ప్రటించింది. మా ప్రాణాల కోసం మీ ప్రాణాలు పణంగా..,కరోనాతో విపత్తులో ముందుండి పోరాడుతున్న డాక్టర్లకు జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు, ట్విట్టర్ ద్వారా విషెస్ తెలిపిన ప్రధాని మోదీ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉద్యోగులు, ఐటీ, జీఎస్టీ, పోస్టల్, జాతీయ బ్యాంకులు, ముంబై పోర్టు ట్రస్ట్, న్యాయ, రాజ్‌భవన్ ఉద్యోగులు ఎంపికచేసిన సబర్బన్ రైళ్లలో ప్రయాణించవచ్చని ప్రభుత్వం వెల్లడించింది. అత్వసర సేవల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన వారి కోసమే ఈ రైళ్లు నడుపుతున్నట్లు సెంట్రల్ రైల్వే పేర్కొంది. అవసరాలకు అనుగుణంగా రైళ్ల సంఖ్యను పెంచుతామని, ప్రయాణికులు భౌతిక దూరం నిబంధనలను పాటించాలని తెలిపింది.
దేశంలో కరోనా కేసుల్లో (Coronavirus) ముంబై ముందు స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో వినాయక ఉత్సవాలు (Vinayaka Festival) నిర్వహించకూడదని ముంబైలోని (Mumbai) ప్రముఖ లాల్‌బగ్చా రాజ సార్వజనిక్ గణేషోత్సవ మండలి నిర్ణయించింది. వైరస్ విజృంభణ వల్ల వినాయక చతుర్థి వేడుకలను రద్దు చేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ఇందుకు బదులుగా కోవిడ్‌తో చనిపోయినవారి కుటుంబ సభ్యులకు అండగా నిలిచేందుకు ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు ఉత్సవ మండలి సెక్రటరీ సుధీర్ సాల్వీ మీడియాకు తెలిపారు. దీంతోపాటు వైరస్ బారిన పడిన రోగుల కోసం రక్తదానం, ప్లాస్మా దానం క్యాంపులను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ముఖ్యమంత్రి సహాయనిధికి 25 లక్షల రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించారు.
కాగా 1934 నుంచి లాల్‌బగ్చా మండలి క్రమం తప్పకుండా గణేశుడిని ప్రతిష్టిస్తూ వేడుకలు నిర్వహిస్తోంది. కానీ ఈ యేడాది ఉపద్రవంలా వచ్చిపడ్డ కరోనా మహమ్మారి వల్ల విగ్రహ ప్రతిష్టతో సహా ఎలాంటి వేడుకలు నిర్వహించబోమని స్పష్టం చేసింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే చూడా ఈసారి గణేశుడి ప్రతిమలు నాలుగు అడుగుల కన్నా ఎక్కువ ఎత్తులో ఉండవద్దని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది వినాయక చతుర్థి వేడుకలు సాదాసీదాగా జరుపుకోవాలని, పందిళ్లలో సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.