Doctor's Day 2020: మా ప్రాణాల కోసం మీ ప్రాణాలు పణంగా..,కరోనాతో విపత్తులో ముందుండి పోరాడుతున్న డాక్టర్లకు జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు, ట్విట్టర్ ద్వారా విషెస్ తెలిపిన ప్రధాని మోదీ
National Doctor's Day 2020 (Photo-Twitter)

New Delhi, July 1: నేడు డాక్టర్స్‌ డే (Doctor's Day 2020) సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ ట్విట్టర్‌ (PM Modi) ద్వారా స్పందించారు. వైద్యులకు దేశం వందనం చేస్తుందన్నారు. కోవిడ్‌-19కు వ్యతిరేకంగా పోరాటంలో ముందంజలో ఉన్న వైద్యులకు యావత్ భారతదేశం నమస్కరిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ డేను పురస్కరించుకుని సీఏ కమ్యూనిటికి ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. ఆరోగ్యకరమైన, పారదర్శక ఆర్థిక వ్యవస్థను నిర్ధారించడంలో కష్టపడి పనిచేసే సీఏ కమ్యూనిటికి ప్రధాన పాత్ర ఉందన్నారు. దేశానికి వారి సేవలు ఎంతో విలువైనవని పేర్కొన్నారు. నేటి నుంచి అన్‌లాక్ 2.0, కొత్తగా ఓపెన్ అయ్యేవి ఏంటి? మూతపడేవి ఏంటి? జూలై 1 నుంచి 31 వరకు అమల్లోకి రానున్న అన్‌లాక్ 2.0, పూర్తి వివరాలు తెలుసుకోండి

డాక్టర్స్‌ డే (#NationalDoctorsDay) సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. కోవిడ్‌-19 మహమ్మారిపై యుద్ధంలో ముందుంజలో ఉండి పోరాడుతున్న ధైర్యవంతులైన వైద్యులకు తను వందనాలు సమర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ ఛాలెంజ్‌ సమయాల్లో దేశాన్ని సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంచడానికి వారి నిబద్ధత నిజంగా అసాధారణం అన్నారు. వారి దేశ భక్తికి, వారు చూపిస్తున్న త్యాగానికి దేశం నమస్కరిస్తుందని ఆయన పేర్కొన్నారు.

PM Modi Tweet

Home minister Amit shah Tweet

మన దేశంలో ఏటా జులై 1వ తేదీన జాతీయ వైద్య దినోత్సవం నిర్వహిస్తున్నాం. ప్రపంచంలోనే గొప్ప వైద్యుడిగా పేరొందిన పశ్చిమ బెంగాల్ రెండో ముఖ్యమంత్రి డాక్టర్ బీదన్ చంద్ర రాయ్ జ్ఞాపకార్థం ఈ ‘డాక్టర్స్ డే’ను నిర్వహిస్తున్నారు. అయితే, ఈ ఏడాది డాక్టర్ డే (#doctorsday2020) చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే.. చరిత్రలో ఎన్నడూలేని విధంగా ప్రతికూల పరిస్థితుల్లో సైతం తమ ప్రాణాలను లెక్క చేయకుండా వైద్యులు, వైద్య సిబ్బంది మనకు సేవలు అందిస్తున్నారు. కనిపించని వైరస్‌తో పోరాడుతూ.. ప్రజలకు ప్రాణదానం చేస్తున్నారు.

లాక్‌డౌన్, అన్‌లాక్‌లతో మనకైతే ఖాళీ దొరికిందేమో కాని వైద్యులకు మాత్రం పని భారం పెరిగిపోయింది. రోజు రోజుకు వందల సంఖ్యలో నమోదవుతున్న కేసులను పరిష్కరించేందుకు రేయింబవళ్లు డాక్టర్లు శ్రమిస్తున్నారు.

(National Doctor's Day 2020) డాక్టర్స్ డే కొటేషన్లు

1. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలందిస్తున్న వైద్యులకు డాక్టర్స్ డే శుభాకాంక్షలు

2. కరోనా విపత్తులో ముందుండి పోరాడుతున్న వైద్యులను గౌరవిద్దాం, వారికి సహకరిద్దాం. వైద్యులందరికీ జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు.

3. మా ప్రాణాల కోసం.. మీ ప్రాణాలను పణంగా పెట్టి కరోనాతో పోరాడుతున్న ప్రత్యక్ష దేవుళ్ల కు... జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు

4. కరోనా నేపథ్యంలో తమప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజలకు సేవ చేస్తున్న డాక్టర్లకు సెల్యూట్. వైద్యులందరికీ శుభాకాంక్షలు.

5. కుటుంబాలకు దూరంగా, ప్రాణాంతక కరోనాకు దగ్గరగా ఉంటూ విధి నిర్వహణ అన్నట్టుగా కాకుండా, సేవాభావంతో, సామాజిక బాధ్యతతో ప్రజలకు వైద్య సేవలు అందిస్తోన్న డాక్టర్లందరికీ జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు

6. కరోనా విజృంభిస్తున్నప్పటికీ తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా, అంకితభావంతో ప్రజలకు వైద్యసేవలందిస్తోన్న దేవుళ్ళకి జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు