Telangana Election Results 2023: ఇప్పటివరకు గెలిచిన అభ్యర్థులు వీళ్లే, మూడుకు చేరిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపు సంఖ్య, చార్మినార్‌లో ఎంఐఎం అభ్యర్థి ఘన విజయం, కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
ఆ పార్టీ అభ్యర్థి మీర్ జుల్ఫికర్ అలీ గెలిచారు. మలక్ పేట, చాంద్రాయణగుట్ట, బహుదూర్ పురా నియోజకవర్గాల్లోనూ ఎంఐఎం అభ్యర్థులు ముందంజలో ఉన్నారు
Assembly Election 2023 Results Live News Updates: తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాల్లో దూసుకెళ్తోంది. తొలి రౌండ్ నుంచి కాంగ్రెస్ తన సత్తా చాటుతోంది. తెలంగాణలో చాలా చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇప్పటివరకు 65 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఖమ్మం ఆశ్వారావుపేటలో, భద్రాద్రి కొత్తగూడెం ఇల్లెందు, రామగుండంలో కాంగ్రెస్ విజయం సాధించింది.
భద్రాద్రి కొత్తగూడెంలో ఆ పార్టీ అభ్యర్థి కోరం కనకయ్య గెలుపొందారు. సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ (BRS) అభ్యర్థి బానోతు హరిప్రియానాయక్‌పై 25వేలకు పైగా మెజారిటీతో ఆయన విజయం సాధించారు. 2014లో హరిప్రియపైనే గెలిచిన కనకయ్య.. 2018లో ఓటమి పాలయ్యారు. మళ్లీ ఇప్పుడు ఆమెపైనే జయకేతనం ఎగురవేశారు. అలాగే ఖమ్మం ఆశ్వారావుపేటలో కాంగ్రెస్ విజయం నమోదు చేసింది. 28,358 ఓట్లతో ఆది నారాయణ గెలుపు బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుపై గెలుపొందారు.
ఇక రామగుండంలో కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్‌పై ఆయన గెలుపొందారు. మరోవైపు చార్మినార్‌లో ఎంఐఎం విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి మీర్ జుల్ఫికర్ అలీ గెలిచారు. మలక్ పేట, చాంద్రాయణగుట్ట, బహుదూర్ పురా నియోజకవర్గాల్లోనూ ఎంఐఎం అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. అదే సమయంలో మూడు సిట్టింగ్ స్థానాల్లో ఎంఐఎం వెనుకంజలో ఉండడం ఆ పార్టీ నాయకత్వాన్ని కలవరపెడుతోంది.