Telugu States Lockdown 5.0: తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు పరుగులు పెట్టనున్న బస్సులు, అంతరాష్ట్ర రాకపోకలపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోని ఏపీ ప్రభుత్వం

ఇతర ప్రాంతాల్లో జూన్‌ 7వ తేదీవరకు లాక్‌డౌన్‌ (Lockdown 5.0) అమలులో ఉంటుందని తెలిపారు. రాత్రిపూట రాష్ట్రమంతటా కర్ఫ్యూ కొనసాగుతుందని చెప్పారు. లాక్‌డౌన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీచేసిన తాజా ఆదేశాల నేపథ్యంలో ఆదివారం ప్రగతిభవన్‌లో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితర ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ చర్చించారు.

inter-state transport and travel

Hyderabad, June 1: తెలంగాణ రాష్ట్రంలోని కంటైన్మెంట్‌ జోన్లలో జూన్‌ 30వ తేదీ వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు (TS CM KCR) ప్రకటించారు. ఇతర ప్రాంతాల్లో జూన్‌ 7వ తేదీవరకు లాక్‌డౌన్‌ (Lockdown 5.0) అమలులో ఉంటుందని తెలిపారు. రాత్రిపూట రాష్ట్రమంతటా కర్ఫ్యూ కొనసాగుతుందని చెప్పారు. లాక్‌డౌన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీచేసిన తాజా ఆదేశాల నేపథ్యంలో ఆదివారం ప్రగతిభవన్‌లో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితర ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ చర్చించారు.  జూన్‌ 30 వరకూ లాక్‌డౌన్‌ పొడిగింపు, లాక్‌డౌన్‌ 5.0 మార్గదర్శకాలు, అనుమతించేవి, అనుమతించనవి ఓ సారి తెలుసుకోండి

కంటైన్మెంట్‌ జోన్లు (containment zones) మినహా ఇతర ప్రాంతాల్లో కేంద్రం సూచించిన సడలింపులు అమలుచేయాలని నిర్ణయించారు. కంటైన్మెంట్‌ జోన్లలో కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ అమలుచేయాలని, రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 9 నుం చి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూను కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. రాత్రి 8 గంటల వరకు దుకాణాలు తెరిచి ఉంచాలని చెప్పారు. అంతర్రాష్ట్ర రాకపోకలపై నియంత్రణ అవసరం లేదని చెప్పారు.

ప్రస్తుతం రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6గంటల వరకురాష్ట్రంలో కర్ఫ్యూ అమల్లో ఉంది. కేవలం అత్యవసర వైద్య సేవల కోసమే ప్రజలను బయటకు వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. తాజా ఉత్తర్వుల ప్రకారం కర్ఫ్యూను ప్రభుత్వం సడలించింది. ఇకపై రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మాత్రమే జన సంచారంపై ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. రాత్రి 8 గంటల వరకు దుకా ణాలు, వ్యాపార సముదాయాలను తెరిచి ఉంచుకోవచ్చు. ఆస్పత్రులు, మందుల దుకాణాలకు ఆంక్షల నుంచి మినహాయింపునిచ్చారు. దేశంలో కరోనా కల్లోలం, ఆసియాలో అగ్రస్థానంలోకి భారత్, దేశ వ్యాప్తంగా 2 లక్షలకు చేరువలో కోవిడ్-19 కేసులు, మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపిన ప్రధాని మోదీ

ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి ప్రజల రాకపోకలపై (inter-state transport and travel) ఉన్న ఆంక్షల ను ఎత్తేశారు. ఇకపై ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి వచ్చేందుకు అనుమతి అవసరం ఉండదు. కంటైన్మెంట్‌ జోన్లలో మాత్రం ఇప్పటివరకు అమలు చేసిన లాక్‌డౌన్‌ నిబంధనలనే యథాతథంగా అమలు చేయనున్నారు. కేంద్రం లాక్‌డౌన్‌ 5.0 మార్గదర్శకాలను జారీ చేయడంతో రాష్ట్రంలో అమలు చేయాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్‌ ఆదివారం సమీక్షిం చారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం జూన్‌ 8 నుంచి కంటైన్మెంట్‌ జోన్లు మినహా రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఎత్తేసే అవకాశాలున్నాయి. ఇందుకు సంబం ధించి జూన్‌ తొలివారంలో మార్గదర్శకాలు విడుదల కావొచ్చని తెలిసింది. ప్రజలకు తీపి కబురు, జూన్ 10న తెలుగు రాష్ట్రాలను తాకనున్న నైరుతి రుతుపవనాలు, రెండు రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడే అవకాశం

హైదరాబాద్‌ మినహా మిగతా జిల్లాల్లో ప్రారంభమైన ఆర్టీసీ బస్సులు ఇకపై ఇతర రాష్ట్రాలకు వెళ్లనున్నాయి. అంతర్రాష్ట్ర రాకపోకలపై ఉన్న ఆంక్షలను హోం శాఖ ఎత్తివేయడంతో రాష్ట్రాల మధ్య బస్సు సేవలు ప్రారంభంకానున్నాయి. కరోనా కేసుల విషయంలో పలు రాష్ట్రాల్లో తేడాలు ఉండటంతో ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఆయా రాష్ట్రాల సమన్వయంతో బస్సులు నడిపించాల్సి ఉంటుందని, ఇతరరాష్ట్రాలకు బస్సులు ప్రారంభించాలా వద్దా అనే అంశంపై త్వరలో స్పష్టత రానున్నదని అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పష్టంచేస్తున్నారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 400 నుంచి 500 వరకు అంతర్రాష్ట్ర బస్సులు నడుస్తుంటాయి.

ఇంకా నిర్ణయం తీసుకోని ఏపీ ప్రభుత్వం

ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాకపోకలపై పాత షరతులు కొనసాగుతాయని ఏపీ పోలీసులు స్పష్టం చేశారు. కరోనా వైరస్ కేసులు పెరుగుతూ ఉండడంతో ప్రభుత్వం (AP Govt) ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కరోనా వైరస్ ప్రభావం తక్కువ ఉన్న రాష్ట్రాలు, ఎక్కువ ఉన్న రాష్ట్రాల నుంచి వస్తోన్న ప్రయాణికులను విభజించి క్వారంటైన్‌కు తరలిస్తామంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాన్ని డీజీపీ గౌతమ్ సవాంగ్ మీడియాకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకునే వరకు అంతరాష్ట్ర రాకపోకలపై కండీషన్స్ కొనసాగుతాయని ఆయన తెలిపారు. ఒకవేళ తప్పదు అని అనుకుంటే స్పందన పోర్టల్ ద్వారా ఆప్లై చేసి.. ఈ పాస్ తీసుకోవాలని సూచనలు చేశారు.

కరోనా వైరస్ ప్రభావం తక్కువ ఉన్న రాష్ట్రాల నుంచి వస్తోన్న ప్రయాణికులు విధిగా హోం క్వారంటైన్‌లో ఉండాలని తెలిపారు. వైరస్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి వస్తోన్న వారు ఏడురోజులు ఇన్‌స్టిట్యూషనరల్ క్వారంటైన్‌లో ఉండాలని ఆయన స్పష్టం చేశారు. పరీక్షలు చేసే సమయంలో నెగిటివ్ వస్తే ఏడు రోజులు హోం క్వారంటైన్ తప్పనిసరి అని, పాజిటివ్ వస్తే కోవిడ్ ఆస్పత్రికి తరలిస్తామని తెలిపారు.