DSC Exam Dates in Telangana: తెలంగాణలో జులై 17 నుంచి 31 వరకు డీఎస్సీ పరీక్షలు, టెట్ నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, పూర్తి వివరాలు ఇవిగో..
డీఎస్సీకి ముందే టెట్‌ను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్‌కు ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నత విద్యాశాఖ త్వరలో టెట్ నోటిఫికేషన్ ను జారీ చేయనుంది.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష-TET నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డీఎస్సీకి ముందే టెట్‌ను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్‌కు ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నత విద్యాశాఖ త్వరలో టెట్ నోటిఫికేషన్ ను జారీ చేయనుంది. సాధ్యమైనంత ఎక్కువమందికి డీఎస్సీ రాసే అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. తాజా నిర్ణయంతో రాష్ట్రంలో దాదాపు మూడు లక్షల మందికి ఊరట లభించే అవకాశం ఉంది. తెలంగాణలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల, ఈనెల 18 నుంచి ఏప్రిల్ 2వరకు పదో తరగతి పరీక్షలు, పూర్తి వివరాలు ఇవిగో..
తెలంగాణలో ఇప్పటికే మెగా డీఎస్సీ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు ఆన్ లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ప్రజా ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన ఉంటుందనడానికి ఇదే నిదర్శనమని కాంగ్రెస్ పేర్కొంది. ప్రజలు, నిరుద్యోగుల ఆలోచనలను కాంగ్రెస్ ప్రభుత్వం వింటోందని మరోసారి రుజువైందని ట్వీట్ చేసింది.
ఇక తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ (TS DSC) పరీక్ష తేదీలను విద్యాశాఖ ప్రకటించింది. జులై 17 నుంచి 31 వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 29న సీఎం రేవంత్ రెడ్డి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం ఉద్యోగాల్లో 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా.. 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు; స్పెషల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి 220 స్కూల్ అసిస్టెంట్, 796 ఎస్జీటీ పోస్టులు చొప్పున భర్తీ చేయనున్నారు.