Salaries Hike For Sanitation Workers: సఫాయి కార్మికులకు మేడే బొనాంజా, లక్ష మంది కార్మికులకు జీతం పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం.. పారిశుధ్య కార్మికులకు (Sanitation Workers) తీపి కబురు చెప్పింది. వారి జీతాలు పెంచింది. రాష్ట్రంలో పారిశుధ్య కార్మికుల (Sanitation Workers) వేతనం వెయ్యి రూపాయల చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన వేతనాలు తక్షణమే అమల్లోకి వస్తాయని సీఎం కేసీఆర్ చెప్పారు.

KCR (Credits: TS CMO)

Hyderabad, May 01: మే డే రోజున.. తెలంగాణ ప్రభుత్వం.. పారిశుధ్య కార్మికులకు (Sanitation Workers) తీపి కబురు చెప్పింది. వారి జీతాలు పెంచింది. రాష్ట్రంలో పారిశుధ్య కార్మికుల (Sanitation Workers) వేతనం వెయ్యి రూపాయల చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన వేతనాలు తక్షణమే అమల్లోకి వస్తాయని సీఎం కేసీఆర్ చెప్పారు. 'సఫాయన్న నీకు సలాం’ నినాదంతో పారిశుధ్య కార్మికులను కృషిని గుర్తిస్తున్నామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు.  సర్కారు నిర్ణయంతో జీహెచ్‌ఎంసీ, జలమండలి, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న 1,06,474 మంది కార్మికులకు లబ్ధి జరుగనున్నది. ప్రస్తుతం జీతం అందుకుంటున్న పారిశుద్ధ్య కార్మికులందరికీ నెల నెలా పెరిగిన వేతనం అదనంగా జీతంతో పాటు కలిపి అందనున్నది.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ (CM KCR) మాట్లాడుతూ.. ‘సఫాయన్న నీకు సలాం అన్న’ అనే నినాదంతో పారిశుద్ధ్య కార్మికుల కృషిని, త్యాగాలను తెలంగాణ (Telangana) రాష్ట్ర ఏర్పాటు నుండి గుర్తిస్తూ వారి సంక్షేమానికి, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తున్నదని సీఎం అన్నారు. రాష్ట్రంలో కష్టించి పనిచేసే ప్రతీ ఒక్క కార్మికుని సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. త్వరలోనే రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికుల జీతాలు కూడా పెంచాలని నిర్ణయించామని, ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్థిక శాఖను ఆదేశించినట్లు వెల్లడించారు. తెలంగాKCRపల్లెలు, పట్టణాలు గుణాత్మక అభివృద్ధిని సాధించడంలో పారిశుధ్య కార్మికుల శ్రమ గొప్పదన్నారు.

Rains In Hyderabad: భారీ వర్షంతో భాగ్యనగరం అతలాకుతలం.. రోడ్లపైకి చేరిన నీరు... భారీగా నిలిచిన ట్రాఫిక్.. ఈదురుగాలులతో విరిగిపడిన చెట్లు.. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన వైనం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న జీహెచ్ఎంసీ 

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన పల్లెలు, పట్టణాలకు అవార్డులు రావడం వెనుక వారి కృషి దాగి ఉన్నదని పేర్కొన్నారు. పల్లెలు, పట్టణాల్లో నాటి, నేటి పరిస్థితులకు ఎంతో స్పష్టమైన తేడా ఉన్నదని సీఎం అన్నారు. కార్మికుల కష్టసుఖాలను తెలుసుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ వారి జీతాలను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వారికి అండగా నిలబడిందని అన్నారు. తద్వారా పారిశుధ్య కార్మికులు కూడా అదే కృతజ్ఞత భావంతో మనస్ఫూర్తిగా పని చేస్తూ, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావడంపై ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు.