Hajipur And Samatha Cases: ఆ రెండు కేసుల్లో తుది తీర్పులు వాయిదా, అదిలాబాద్ అత్యాచారం కేసుపై ఈ నెల 30న తుది తీర్పు, హాజీపూర్ కేసుపై తుది తీర్పు ఫిబ్రవరి 6కు వాయిదా
ఈ కేసులపై ఎలాంటి తీర్పు వస్తుందోనని రాష్ట్ర ప్రజలు తీవ్ర ఉత్కంఠగా ఎదురు చూశారు. అయితే తీర్పును వాయిదా (Adjourned) వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. సమత అత్యాచారం, హత్య కేసులో తుదితీర్పు ఈ నెల 30వ తేదీకి వాయిదా పడగా, హాజీపూర్ వరుస హత్యల కేసు ఫిబ్రవరి 6కు వాయిదా పడింది.
Hyderabad, January 27: తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సమత హత్యాచారం, (Samatha Murder Case) హజీపూర్ హత్యల కేసుల్లో (Hajipur Rape-Murders Case) తుది తీర్పులు వాయిదా పడ్డాయి. ఈ కేసులపై ఎలాంటి తీర్పు వస్తుందోనని రాష్ట్ర ప్రజలు తీవ్ర ఉత్కంఠగా ఎదురు చూశారు. అయితే తీర్పును వాయిదా (Adjourned) వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. సమత అత్యాచారం, హత్య కేసులో తుదితీర్పు ఈ నెల 30వ తేదీకి వాయిదా పడగా, హాజీపూర్ వరుస హత్యల కేసు ఫిబ్రవరి 6కు వాయిదా పడింది.
కొమరంభీం జిల్లాలోని ఎల్లాపటార్ గ్రామంలో జరిగిన సమత అత్యాచారం, హత్య కేసులో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు నేడు తుదితీర్పు వెలువరించాల్సి ఉంది. అయితే న్యాయమూర్తి అనారోగ్యం కారణంగా సెలవులో ఉండటంతో వాయిదా వేసినట్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు. ముగ్గురు నిందితులు యువతిని గ్యాంగ్ రేప్ చేసి హత్య చేశారు.
3 ఏళ్ల పాపపై అత్యాచారం, ఆపై హత్య, నిందితుడికి మరణ శిక్ష విధించిన ఒడిషా కోర్టు
కేసు విచారణ కోసం డిసెంబర్ 11న ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై పోలీసులు డిసెంబర్ 14న 90 పేజీల చార్జ్ షీటును దాఖలు చేశారు. 40 మంది సాక్షుల్లో 20మందిని డిసెంబర్ 23 నుంచి 31 వరకు కోర్టు విచారించింది. నిందితుల తరపున వాదించడానికి న్యాయవాదులు ముందుకు రాకపోవడంతో కోర్టు న్యాయవాది రహీంను నియమించింది.
ప్రేమించాడు, కామ వాంఛను తీర్చుకున్నాడు, పెళ్లి చేసుకోమంటే జంప్
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాజీపూర్ వరుస హత్యలపై తుది తీర్పు కూడా ఫిబ్రవరి 6కు వాయిదా పడింది. ఈ ఉన్మాది హాజీపూర్‌లో బాలికలను దారుణంగా చంపేసి ఆపై అత్యాచారం చేశాడు. నల్గొండలోని ప్రత్యేక ఫోక్సో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు తీర్పు వెల్లడించనుంది. ఈ కేసుల్లో హాజీపూర్ నిందితుడు వరంగల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.
డాక్టర్ హత్యాచారం కేసులో నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన తెలంగాణ పోలీసులు
అక్టోబర్ 14 నుంచి హాజీపూర్ కేసులపై విచారణ జరుగుతుంది. ఈ కేసుల్లో 101 మంది సాక్షులను కోర్టు విచారించింది. నిందితుడిని కోర్టు ఎగ్జామిన్ చేసింది. అత్యాచారం, హత్యలపై ఇరు పక్షాల న్యాయవాదులు జడ్జీ ముందు వాదనలు వినిపించారు. జనవరి 17న తుది వాదనలు ముగిశాయి.