Telangana Hajipur rape-murders case Nalgonda fast track court to give final judgement Today (photo-PTI)

Nalgonda,January 27: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హాజీపూర్ వరుస హత్యల కేసులో(Hajipur Rape-murders case) తీర్పు రాబోతోంది. హాజీపూర్ కేసులో నల్గొండ ఫాస్ట్‌ కోర్టు ఇవాళ తుదితీర్పు (Hajipur Judgement) వెలువరించబోతుంది. అభం శుభం తెలియని బాలికలను అపహరించి వారిని చంపేసి ఆ తరువాత వారిపై అత్యాచారానికి తెగబడిన నిందితుడు శ్రీనివాస్‌ రెడ్డికి (Srinivas Reddy) కోర్టు ఏం శిక్ష విధిస్తుందోనని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

ఈ హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్‌ రెడ్డి కేసులో ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు (Nalgonda fast track court) విచారణను ముగించింది. పోలీసులు ఈ వరుస అత్యాచారం , హత్యల కేసు నుంచి నిందితుడు శ్రీనివాస్‌ రెడ్డి తప్పించుకునే వీలులేకుండా పక్కా ఆదారాలను కోర్టు ముందు పెట్టారు.

ఎన్‌కౌంటర్ పట్ల ఆనందం వ్యక్తం చేసిన దిశ కుటుంబ సభ్యులు

ఉన్నతాదికారులు ప్రతీ విచారణకు హాజరై మరీ..దగ్గరుండి ట్రయల్స్‌లో పాల్గొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న నలగొండ ఫాస్ట్‌ కోర్టు... ఇవాళ తుది తీర్పును వెలువరించనుంది.

3 ఏళ్ల పాపపై అత్యాచారం, ఆపై హత్య, నిందితుడికి మరణ శిక్ష విధించిన ఒడిషా కోర్టు

ఇదిలా ఉంటే బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన బాలికల అత్యాచారం, హత్య ఘటనలో నిందితుడు శ్రీనివాసరెడ్డిని ఉరి తీయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. 2019 అక్టోబర్ 14 నుంచి హాజీపూర్ కేసులపై విచారణ జరిగింది.

ప్రేమించాడు, కామ వాంఛను తీర్చుకున్నాడు, పెళ్లి చేసుకోమంటే జంప్

ఈ కేసులో మొత్తం 300 మందిని సాక్షులుగా పేర్కొనగా... 101 మందిని ప్రశ్నించారు. ఈ ఏడాది జనవరి 6 నుంచి మొదలైన ప్రాసిక్యూషన్, డిఫెన్స్ వాదోపవాదాల ప్రక్రియ 17న ముగిసింది. దీంతో న్యాయస్థానం తీర్పును 2020, జనవరి 27వ తేదీ సోమవారానికి వాయిదా వేసింది. నేడు తుది తీర్పును ఇవ్వనుంది.

మృగాళ్ల వేటలో మరో మహిళ మృతి, చికిత్స పొందుతూ మరణించిన ఉన్నావ్ బాధితురాలు

ఇప్పటికే నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష ఖరారు కావడంతో.. హాజీపూర్ నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి కూడా ఉరిశిక్ష విధించాలని అన్నివర్గాల నుంచి డిమాండ్ వినిపిస్తుంది. ఒకవేళ నిందితుడికి ఉరిశిక్ష విధించినట్లయితే నల్లగొండ(Nalgonda) జిల్లా కోర్టులో ఉరిశిక్ష విధించబడిన తొలి కేసుగా రికార్డుల్లోకి ఎక్కనుంది.

ఎయిడ్స్ ఉందని చెప్పినా వదలని కామాంధులు

విచారణ సమయంలో శ్రీనివాసరెడ్డిని జడ్జి పలు ప్రశ్నలు అడుగగా సమాధానమివ్వకుండా మౌనం వహించాడు. తనకేం తెలియదని తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. అయితే పోలీసులు సేకరించిన ఆధారాలు పక్కాగా ఉండటంతో అతడి ఆటలు సాగలేదు.

డాక్టర్ హత్యాచారం కేసులో నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన తెలంగాణ పోలీసులు

మరో వైపు సమత అత్యాచారం కేసులో కూడా ఇవాళే తుది తీర్పు రానుంది. నవంబర్ 24 , 2019న తేదిన లింగాపూర్ మండలం ఎల్లపటార్ శివారులో సమత అత్యాచారం, హత్య జరిగింది. గ్రామాల్లో సంచరిస్తూ బెలూన్లు అమ్ముకుంటూ జీవనం సాగించే బాధితురాలు ఒంటరిగా ఉండటం గమనించి ముగ్గురు వ్యక్తులు అపహరించారు.

చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి సామూహిక హత్యాచారం హత్య చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు రేపిన ఈ కేసు విచారణను తీవ్రంగా పరిగణించిన పోలీసులు 20 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేశారు. డిసెంబర్ 14న ఛార్జ్‌ షీట్‌ దాఖలు చేశారు. ఇప్పుడీ కేసు విచారణ పూర్తయి తుది తీర్పు ఇవాళ రానుండటంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది.