Dharani Portal: కులం,ఆధార్ వివరాలు ఎందుకు అడుగుతున్నారు? సుప్రీం కోర్టు తీర్పులకు విరుద్ధంగా ఎందుకు వెళుతున్నారు? తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు, తదుపరి విచారణ నవంబర్ 20వ తేదీకి వాయిదా

వ్యవసాయేతర ఆస్తుల సమాచారం ఇవ్వాలంటూ ప్రజలను ఒత్తిడి చేయ రాదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని టీఎస్ హైకోర్టు (Telangana High Court) ఆదేశించింది. వ్యవసాయ భూముల వివరాల సేకరణకు సంబంధించి ఆధార్‌ నంబర్, కులం వివరాలు సేకరించొద్దని స్పష్టం చేసింది. ధరణి వెబ్‌సైట్‌ కోసం సమాచార సేకరణను ఈనెల 21వ తేదీ వరకూ నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

High Court of Telangana | (Photo-ANI)

Hyderabad,Nov 4: వ్యవసాయేతర ఆస్తుల సమాచారం ఇవ్వాలంటూ ప్రజలను ఒత్తిడి చేయ రాదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని టీఎస్ హైకోర్టు (Telangana High Court) ఆదేశించింది. వ్యవసాయ భూముల వివరాల సేకరణకు సంబంధించి ఆధార్‌ నంబర్, కులం వివరాలు సేకరించొద్దని స్పష్టం చేసింది. ధరణి వెబ్‌సైట్‌ కోసం సమాచార సేకరణను ఈనెల 21వ తేదీ వరకూ నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ‘‘సంక్షేమ పథకాల అమలుకు ఆధార్‌ సంఖ్యను మాత్రమే వినియోగించాలని పుట్టుస్వామి కేసులో సుప్రీం కోర్టు చెప్పింది. కానీ, ధరణి కోసం ఆధార్‌ సంఖ్యతోపాటు కులం వివరాలు సేకరిస్తున్నారు. ఇలా ఏ చట్టంలోనూ లేదు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. మనం ఎటువైపు పయనిస్తున్నాం!?’’ అని ధర్మాసనం ప్రశ్నించింది.

ఇప్పటికే సేకరించిన కోటి మంది ఆస్తులకు సంబంధించిన సమాచారాన్ని ఎవరికీ ఇవ్వొద్దని ఆదేశించింది. సమర్థమైన చట్టాలు రూపకల్పన చేయకపోతే ప్రజలకు శాపంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్త ర్వులు జారీ చేసింది.

డాక్టర్‌ రెడ్డీస్‌ లాబోరేటరీస్‌పై సైబర్‌ అటాక్, ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాల నిలిపివేత, ఔషధ తయారీ సంస్థలను లక్ష్యంగా చేసుకున్న హ్యాకర్లు

ప్రజల నుంచి ఆస్తులకు సం బంధించి ప్రభుత్వం (state government) చట్ట విరుద్ధంగా సమాచారం సేకరిస్తోందని, సుప్రీం కోర్టు తీర్పులకు (Supreme Court) విరుద్ధంగా ఆధార్, కులం వివరాలు తప్పనిసరిగా అడుగుతోందని న్యాయవాదులు ఐ.గోపాల్‌శర్మ, సాకేత్‌ కాశీ భట్లతో పాటు పలువురు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలను ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. ‘వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించి ప్రజల నుంచి సేకరించిన సమాచారానికి భద్రత ఎలా కల్పిస్తారు? ఏ స్థాయి అధికారి అధీనంలో ఈ సమాచారం ఉంటుంది? ఈ సమాచారాన్ని పరిశీలించే అధీకృత అధికారం ఎవరికి ఉంటుంది? సమాచారం బయటకు వెళ్లకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారు?

ఏ చట్టం ప్రకారం వ్యవసాయేతర ఆస్తుల వివరాలు సేకరిస్తున్నారు? ఏ నిబంధన ప్రకారం ఆధార్‌ నంబర్, కులం వివరాలు అడుగుతున్నారు? వ్యవసాయేతర ఆస్తులకు (non-agricultural assets) సంబంధించి యజమానితో పాటు ఇతర కుటుంబసభ్యుల ఆధార్‌ నంబర్లను ఎందుకు అడుగుతున్నారు? ఈ ప్రక్రియ ప్రజల వ్యక్తిగత విషయాల గోప్యతకు విఘాతం కలిగించేదిగా ఉంది.ఈ సమాచారాన్ని ఇతరులతో పాటు ప్రభుత్వం దుర్వినియోగం చేయదనే నమ్మకం ఏంటి?’అంటూ ధర్మాసనం ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించింది.

తెలంగాణలో ఇకపై అక్రమ రిజిస్ట్రేషన్లకు తావు లేదు, అన్ని భూరికార్డులు ఆన్‌లైన్‌లోనే'.. ధరణి పోర్టల్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

ప్రభుత్వం ఇటీవల తెచ్చిన కొత్త చట్టంలోనూ సేకరించిన సమాచార భద్రతకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటారో స్పష్టం చేయలేదని పేర్కొంది. ఏ అధీకృత అధికారి పర్యవేక్షణలో ఈ సమాచారం ఉంటుందో కూడా చట్టంలో లేదని అసహనం వ్యక్తం చేసింది. ఈ ప్రక్రియ మొత్తం లోపభూయిష్టంగా ఉందంటూ మండిపడింది. కాగా, ఈ వ్యవహారంపై 2 వారాల సమయం ఇస్తే పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేస్తామని అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ నివేదించారు.

ధరణి వెబ్‌ పోర్టల్‌లో నమోదు చేస్తున్న సమాచారం హ్యాకింగ్‌కు వీలు కాదనడానికి గ్యారంటీ ఏమిటని ధర్మాసనం నిలదీసింది. తదుపరి విచారణను ఈనెల 20వ తేదీకి వాయిదా వేసింది. ఈలోగా పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం తీసుకొస్తున్న ధరణిని పోలిన నాలుగు యాప్స్‌ గూగుల్‌ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఏది ప్రభుత్వం నిర్వహిస్తున్నదో తెలుసుకోవడం కష్టంగా ఉంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమాచారాన్నే హ్యాక్‌ చేసినట్లుగా పత్రికల్లో కథనాలు చూశాం. ప్రభుత్వం సేకరించిన సమాచారాన్ని హ్యాకర్స్, ఇతరులు తస్కరించరని గ్యారంటీ ఉందా అని ధర్మాసనం ప్రశ్నించింది.

 

2020లో తెచ్చిన చట్టంలో పేర్కొనకుండా, సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్ధంగా ఆధార్‌ వివరాలను ఎందుకు సేకరిస్తున్నారు. ఆస్తులకు సంబంధించిన సమాచారం ఇవ్వాలంటూ మా ఇంటికీ వచ్చి దరఖాస్తులు ఇచ్చారు. అయితే వచ్చిన వారు ప్రభుత్వ అధికారులేనా? వ్యవసాయ భూముల వివరాల సేకరణకు సంబంధించి ప్రభుత్వం తెచ్చిన పట్టాదారు పాస్‌బుక్, భూ హక్కుల చట్టం–2020 వ్యవసాయ భూములకు మాత్రమే. అలాంటప్పుడు వ్యవసాయేతర ఆస్తుల వివరాలు కోరడం చట్టబద్దం కాదు’అంటూ ధర్మాసనం తీవ్రంగా వ్యాఖ్యానించింది.

ధరణిలో ఆస్తులు రిజిస్ట్రేషన్‌ చేసుకోకకపోతే ఇంచు భూమి కూడా ఇతరులకు అమ్ముకోలేరంటూ ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లుగా పత్రికల్లో కథనాలు వచ్చాయని సీనియర్‌ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి నివేదించారు. వ్యవసాయేతర ఆస్తుల సేకరణ చట్ట విరుద్ధమని, ఆధార్, కులం వివరాలు అడగడం సుప్రీం కోర్టు తీర్పులకు విరుద్ధమని న్యాయవాది వివేక్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ అధీనంలో ఉన్న సమాచారాన్ని సమాచార హక్కు చట్టం కింద కోరిన వారికి ఇవ్వాల్సి ఉంటుందని మరో న్యాయవాది సుమన్‌ పేర్కొన్నారు.

భూ క్రయవిక్రయాల్లో మోసాలను అరికట్టేందుకు, మెరుగైన పాలన కోసమే ప్రజల నుంచి వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల వివరాలు సేకరిస్తున్నామని అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ నివేదించారు. డబుల్‌ బెడ్రూం ఇళ్ల కేటాయింపు తదితర సంక్షేమ పథకాల కోసమే వ్యవసాయేతర ఆస్తుల వివరాలు అడుగుతున్నామని పేర్కొన్నారు. అయితే ఎలాంటి ఆస్తులు లేని వారికే కదా డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇచ్చేది అంటూ ధర్మాసనం సందేహం వ్యక్తం చేసింది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Trouble For Sonu Sood: నటుడు సోనూ సూద్‌ పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్.. అరెస్టు చేసి తమ ముందు హాజరుపర్చాలన్న లుథియానా కోర్టు.. ఎందుకంటే??

HC on Vijay Mallya’s Plea: విజయ్ మాల్యా రుణ ఎగవేత కేసులో కీలక మలుపు, బ్యాంకులకు నోటీసులు జారీ చేసిన కర్ణాటక హైకోర్టు, చేసిన అప్పు కంటే ఎక్కువ మొత్తం రికవరీ చేశారని మాల్యా పిటిషన్

SC on Maha Kumbh 2025 Stampede: కుంభమేళా తొక్కిసలాట ఘటనపై సుప్రీం కీలక వ్యాఖ్యలు, దురదృష్టకరమంటూ పిల్‌ను తిరస్కరించిన అత్యున్నత ధర్మాసనం

Supreme Court: నేరం రుజువు కావాలంటే నిందితుడు బహిరంగంగా దూషించాలి.. నాలుగు గోడల మధ్య జరిగితే కేసు నిలబడదు.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Share Now