Telangana High Court: వలస కార్మికులంటే అంత చిన్నచూపా, వారి కోసం ఒక్కబోగీ కలపలేరా, మండిపడిన తెలంగాణ హైకోర్టు, విచారణకు హాజరుకావాలని దక్షిణ మధ్య రైల్వే డీఆర్‌ఎంకు ఆదేశాలు

తెలంగాణ హైకోర్టు (Telangana High Court) సోమవారం పలు కీలక అంశాలపై విచారణ చేపట్టింది. వలస కూలీలను తరలించడంలో (migrant-workers-transportation) అలసత్వం ప్రదర్శించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పెళ్లిళ్ల కోసం ప్రత్యేక బోగీలు సమకూర్చే రైల్వే ( Indian Railway) వలస కూలీల కోసం ఎందుకు ఎక్కువ ఏర్పాటు చేయలేదని ప్రశ్నించింది. బీహార్‌ తదితర రాష్ట్రాలకు వెళ్లేందుకు ఎదురుచూస్తున్న వలసకార్మికుల (Migrant Workers) కోసం ఒక్క బోగీ అదనంగా వేయడానికి రైల్వేశాఖకు కనికరం కలుగడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు దక్షిణ మధ్య రైల్వే డీఆర్‌ఎం మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

High Court of Telangana | (Photo-ANI)

Hyderabad, June 23: తెలంగాణ హైకోర్టు (Telangana High Court) సోమవారం పలు కీలక అంశాలపై విచారణ చేపట్టింది. వలస కూలీలను తరలించడంలో (migrant-workers-transportation) అలసత్వం ప్రదర్శించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పెళ్లిళ్ల కోసం ప్రత్యేక బోగీలు సమకూర్చే రైల్వే ( Indian Railway) వలస కూలీల కోసం ఎందుకు ఎక్కువ ఏర్పాటు చేయలేదని ప్రశ్నించింది. వలస కార్మికులు ఎందుకు నడిచి వెళుతున్నారు, వెంటనే శ్రామిక్‌ రైళ్లలో పంపేందుకు రైల్వే శాఖతో సంప్రదింపులు జరపండి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు

బీహార్‌ తదితర రాష్ట్రాలకు వెళ్లేందుకు ఎదురుచూస్తున్న వలసకార్మికుల (Migrant Workers) కోసం ఒక్క బోగీ అదనంగా వేయడానికి రైల్వేశాఖకు కనికరం కలుగడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు దక్షిణ మధ్య రైల్వే డీఆర్‌ఎం మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.  వలస కార్మికులకు వెంటనే ఉద్యోగాలు కల్పించండి, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటుక బట్టీల్లో పనిచేసే వలస కార్మికులను వారి రాష్ట్రాలకు పంపేలా ఉత్తర్వులు ఇవ్వాలని, లాక్‌డౌన్‌ వల్ల వారంతా ఇబ్బందులు పడుతున్నారని దాఖలైన మూడు పిల్స్‌ను సోమవారం మరోసారి విచారించింది. గూడ్స్‌ రైలుకు 70 బోగీలు ఉంటాయని, సాధారణ రైలుకు 24కి మించి బోగీలు ఉండకూడదని ఏ చట్టంలో ఉందో చెప్పాలని ప్రశ్నించింది. వలస కార్మికుల నుండి ఛార్జీలు వసూలు చేయకూడదు, వారికి ఆహారం, నీరు అందించాలి, రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసిన అత్యున్నత న్యాయస్థానం

సంక్షోభ సమయంలో కూడా రైల్వేశాఖ వలస కార్మికుల పట్ల మానవత్వం చూపడం లేదని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఉన్నతాధికారుల కుటుంబాలు వెళ్లడానికి, వివాహాలకు, ఇతర కార్యక్రమాలకు ప్రత్యేక బోగీలు కేటాయిస్తారని, వలసకార్మికుల కోసం ఎందుకు కేటాయించలేరని ప్రశ్నించింది. బీహార్‌కు చెందిన 45 మంది వలస కార్మికుల కోసం శ్రామిక్‌ రైలును రూ.10 లక్షలు ఖర్చు చేసి ప్రభుత్వం కూడా ఎలా నడపగలదని అడిగింది. అదే రైల్వే శాఖ ముందుకు వచ్చి సాధారణ ప్రయాణికుల రైలుకు ఒక్క బోగీ తగిలిస్తే సమస్య పరిష్కారం అయ్యేదనే ఆలోచన కూడా చేయట్లేదని ఆక్షేపించింది. వలస కార్మికులను ఆపలేం, వలస వెళ్తున్నవారిని అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిష‌న్‌ను కొట్టివేసిన అత్యున్నత న్యాయస్థానం

దీంతో పాటుగా సికింద్రాబాద్‌ సమీపంలోని మనోరంజన్‌ కాంప్లెక్స్‌ ఖాళీగా ఉన్నా కూడా.. ఖాళీగా లేదని జిల్లా కలెక్టర్‌ హైకోర్టుకు నివేదించడంపై ధర్మాసనం మండిపడింది. ఆ కాంప్లెక్స్‌లో వలస కార్మికులను ఉంచేందుకు వీలవుతుందేమో తెలపాలని కోరితే తమకే తప్పుడు వివరాలిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ కాంప్లెక్స్‌ను రిజిస్ట్రార్లు స్వయంగా పరిశీలించారని, మొత్తం కాంప్లెక్స్‌ ఖాళీగా ఉందని చెప్పింది. హౌసింగ్‌ బోర్డు అధీనంలోని 3 అంతస్తుల ఆ కాంప్లెక్‌ ఇప్పటికీ ఖాళీగానే ఉందని పేర్కొంది. అయినా కూడా ఖాళీగా లేదని కలెక్టర్‌ ఎలా చెబుతారని దుయ్యబట్టింది.

దీనిపై అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ.. సదరు కాంప్లెక్స్‌లో మరుగుదొడ్లు లేవని చెప్పారు. ప్రస్తుత వసతి కేంద్రంలో కొద్దిమందికి వసతి ఏర్పాట్లు సరిపోతాయని తెలిపారు. హౌసింగ్‌ బోర్డు నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేయలేదని, కోర్టులను తేలిగ్గా తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కలెక్టర్‌ను ఉద్దేశించి హెచ్చరించింది. దీనిపై పిటిషనర్‌ న్యాయవాది వసుధా నాగరాజ్‌ కల్పించుకుని.. మిగిలిన 45 మంది వలస కార్మికులను పంపితే సమస్య కొలిక్కి వస్తుందని, వసతి సమస్య ఉండదని చెప్పారు.

బీహార్‌కు చెందిన 170 మంది వలస కార్మికులు మిగిలిపోతే వారిని పలు సేవా సంస్థలు గమ్యస్థానాలకు పంపాయని, మిగిలిన 45 మందిలో 30 మందికే టికెట్లు లభించాయని చెప్పారు. రైల్వే శాఖ స్టాండింగ్‌ కౌన్సిల్‌ పుష్పేందర్‌ కౌర్‌ వాదనలు వినిపిస్తూ.. అత్యవసర కోటాలో రోజుకు 30 టికెట్లే లభ్యం అవుతాయని తెలిపారు.

విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలని హైకోర్టులో పిల్

ఇది ఇలా ఉండగా, లాక్‌డౌన్ సమయంలో తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ బిల్లులు సాధారణం కన్నా అధికంగా వచ్చాయనే ఆరోపణలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ కాలంలో విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలని హైకోర్టులో పిల్ దాఖలైంది. లాయర్ నరేశ్, సమీర్ దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి, ఎస్పీడీసీఎల్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అత్యధికంగా బిల్లులు కాగా, విద్యుత్ బిల్లులు సాధారణం కన్నా ఎక్కువగా వచ్చాయని హైకోర్టులో మరో పిల్ దాఖలైంది. స్లాబులు సవరించి బిల్లులు తగ్గించాలనే వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. విద్యుత్ బిల్లులపై ఫిర్యాదులు ఉంటే కమిటీని ఆశ్రయించాలని హైకోర్టు సూచించింది. ఫిర్యాదుల పరిష్కారానికి కమిటీ ఉండగా, తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు తెలిపింది. కమిటీకి 6767 ఫిర్యాదులు రాగా, ఇప్పటి వరకు 6678 పరిష్కరించినట్లు ఏజీ ప్రసాద్ తెలిపారు.

చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని దాఖలైన పిటిషన్‌పై విచారణ

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారించింది. పిటిషనర్ తరపున సీనియర్ కౌన్సిల్ మాచర్ల రంగయ్య వాదనలు వినిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 7 లక్షల మంది చేనేత కార్మికులు గత మూడు నెలలుగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే రూ. 200 కోట్ల చేనేత ముడి సరుకు కార్మికుల వద్ద ఉందని, దాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోర్టుకు తెలిపారు. కాగా, ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ పై రీప్లై కౌంటర్ వేస్తామన్న పిటిషన్ తరపు న్యాయవాది.. 10 రోజుల్లో పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని పిటిషనర్ కు హైకోర్టు ఆదేశం ఇచ్చింది. హైకోర్టు జులై 2కు తదుపరి విచారణను వాయిదా వేసింది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now