New Delhi, June 9: కరోనావైరస్ లాక్‌డౌన్ దెబ్బకు ఉపాధి కోల్పోయిన వలస కార్మికులకు వెంటనే ఉపాధి అవకాశాలు కల్పించాలని సుప్రీంకోర్టు (Supreme Court) ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. వలస కార్మికులను గుర్తించి వారి నైపుణ్యాలకు తగిన విధంగా ఉద్యోగాలు (Employment) కల్పించేలా ప్రణాళిక రూపొందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు దాదాపు కోటిమందికి పైగా వారి స్వగ్రామంలోనే పని కల్పించేందు (Employment to Migrants) ఓ జాబితా తయారుచేయాలని అన్ని రాష్ర్ట ప్రభుత్వాలకు సూచించింది. వలస కార్మికుల నుండి ఛార్జీలు వసూలు చేయకూడదు, వారికి ఆహారం, నీరు అందించాలి, రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసిన అత్యున్నత న్యాయస్థానం
లాక్‌డౌన్ కారణంగా చాలామంది ఉపాధి కోల్పోయారని, ముఖ్యంగా వలస కార్మికులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారని దేశ అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే వలసదారులను గుర్తించి వారికి ఉద్యోగాలు కల్పించడానికి అందుబాటులో ఉన్న పథకాలకు సంబంధించిన సమాచారాన్ని జులై 8లోపు అఫిడవిట్ ద్వారా కోర్టులో సమర్పించాలని అన్ని రాష్ట్రాలను కోరింది. అంతేకాకుండా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలను 15 రోజుల్లోగా వారి స్వగ్రామాలకు చేర్చాలని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. వలస కూలీలకు ఉచితంగా కండోమ్‌లు, అవాంఛిత గర్భధారణను నిరోధించేందుకు కీలక నిర్ణయం తీసుకున్న బీహార్ ప్రభుత్వం
వలస కార్మికులను తరలించడానికి రైలు సదుపాయం కల్పించాలని ఏ రాష్ర్టమైనా కోరినా 24 గంటల్లోపు అందించేలా రైల్వే శాఖ బాధ్యత వహించాలని కోరింది. స్వస్థలాలకు వెళ్లేందుకు లాక్‌డౌన్ నిబందనలు ఉల్లంఘించినందుకు వలస కూలీలపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాల్సిందిగా రాష్ట్రాలను కోరింది. అవసరమైన చోట వలసదారులకు కౌన్సెలింగ్ ఇవ్వాల్సిందిగా సూచించింది.
కాలినడకన వెళ్ళిన వలసదారులపై, కొన్ని సైకిళ్ల ద్వారా వచ్చిన అన్ని క్రిమినల్ కేసులను రద్దు చేయడానికి కూడా సుప్రీం కోర్టు మొగ్గు చూపింది. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు అన్ని ఫిర్యాదులను ఉపసంహరించుకోవాలని మరియు వలస కార్మికులపై విచారణ చేయాలని పరిగణించాలని పేర్కొంది. అవసరమైన చోట రాష్ట్రాలు వలసదారులకు కౌన్సెలింగ్ ఇవ్వాలి. జూలై 8 న కోర్టు ఈ విషయాన్ని తీసుకుంటుంది, దీని ద్వారా రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు వలస కార్మికుల కోసం ప్రస్తుతం ఉన్న పథకాలు, ఉపాధి కల్పన మొదలైన వాటిపై నివేదికలను సమర్పించాలని సుప్రీంకోర్టు తెలిపింది.