Telangana High Court: వలస కార్మికులు ఎందుకు నడిచి వెళుతున్నారు, వెంటనే శ్రామిక్‌ రైళ్లలో పంపేందుకు రైల్వే శాఖతో సంప్రదింపులు జరపండి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు
High Court of Telangana| Photo Credits: Wikimedia Commons

Hyderabad,June 3: తెలంగాణ రాష్ట్రంలో కరోనా లాక్‌డౌన్‌ (Telangana Lockdown)కారణంగా చిక్కుకుపోయిన వలస కార్మికులను శ్రామిక్‌ రైళ్లలో పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖతో (Indial Railway) సంప్రదింపులు చేసి చర్యలు తీసుకోవాలని హైకోర్టు (Telangana High Court) ఆదేశించింది. దీంతో పాటు వలస కార్మికులను ఇతర రాష్ట్రాలకు పంపేందుకు ఆయా రాష్ట్రాలతో సమన్వయం చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. వలస కార్మికులను ప్రభుత్వ ఖర్చులతోనే పంపాలని, సుప్రీంకోర్టు/కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. తెలంగాణలో కొత్తగా మరో 99 పాజిటివ్ కేసులు, మరో 4 కరోనా మరణాలు నమోదు, రాష్ట్రంలో 2891కు చేరువైన మొత్తం కోవిడ్-19 బాధితుల సంఖ్య, 92కి పెరిగిన మరణాలు

ఆపద సమయంలో వలస కార్మికుల తరలింపు, వారి సంక్షేమం కోసం ప్రభుత్వాలు నిర్దిష్ట విధానాన్ని ఖరారు చేయాల్సి ఉందని, తెలంగాణ ప్రభుత్వ (TS Govt) విధానాన్ని కూడా రూపొందించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇటుక బట్టీల్లో పనిచేసే కార్మికులపై, మేడ్చల్‌ రోడ్డులో మండుటెండలో నడిచి వెళ్లే వలస కార్మికులపై హైకోర్టులో ఎస్‌.జీవన్‌కుమార్‌, ప్రొఫెసర్‌ రమా శంకర్‌ నారాయణ వ్యాజ్యాలు ధాఖలు చేసిన సంగతి విదితమే. ఈ రెండు వ్యాజ్యాలను హైకోర్టు ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. వలస కార్మికుల గురించి హైకోర్టు నియమించిన అడ్వొకేట్‌ కమిషన్‌ కౌటూరు పవన్‌కుమార్‌ తమ నివేదికను ధర్మాసనానికి నివేదించారు.  గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 8909 తాజా కేసులు నమోదు, దేశంలో 2 లక్షల దాటిన కోవిడ్-19 కేసులు, 5815కు చేరిన మరణాల సంఖ్య

ఈ నివేదికలో మేడ్చల్‌ జాతీయ రహదారిలో వలస కార్మికులు నడుచుకుంటూ వెళ్తున్నారని కమిషన్ తెలిపింది. అలాగే ఇటుకబట్టీల్లో పనిచేసేవారు రాష్ట్రంలో లక్షన్నర మంది వరకు ఉండిపోయారని ని పిటిషనర్‌ న్యాయవాది వసుధా నాగరాజన్‌ తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. నిజంగానే ప్రభుత్వం వలస కార్మికులను వారి రాష్ట్రాలకు పంపి ఉంటే ఇప్పటికీ వారంతా రోడ్లపై, రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్లలో ఎందుకున్నారని ప్రశ్నించింది.

బస్సులను డిపోలకు పరిమితం చేయకుండా వలస కార్మికులను గమ్యస్థానాలకు పంపే ఏర్పాట్లను చేయాలని సూచన చేసింది. వలస కార్మికుల నుంచి టికెట్ల చార్జీలను వసూలు చేస్తే ప్రభుత్వమే చట్టాలను ఉల్లఘించినట్లు అవుతుందని హెచ్చరించింది. ఏజీ వాదనలు కొనసాగిస్తూ రాష్ట్రంలో 1,081 ఇటుక బట్టీల్లో పనిచేసే 53,145 మంది కార్మికుల్లో 23,332 మందిని ఇప్పటికే తరలించామన్నారు.వలస కార్మికుల కోసం ఆహారం, వసతి, వైద్యం వంటివి కల్పిస్తున్నామన్నారు.

కార్మికుల తరలింపు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనన్న ధర్మాసం.. అందుకు అనుగుణంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుని ఫలితాలను నివేదించాలని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. విచారణను 9వ తేదీకి వాయిదా వేసింది.