Inter Spot Valuation in TS: 20 రోజుల్లో ఇంటర్ ఫలితాలు, స్పాట్ వాల్యూయేషన్‌కు పచ్చజెండా ఊపిన తెలంగాణ హైకోర్టు, జాగ్రత్తలు పాటించాలని ఆదేశం

కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్ నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ సమాధాన పత్రాల మూల్యాంకనం ఆగిపోయింది. ఇప్పుడు ఇంటర్ సమాధాన పత్రాల మూల్యాంకనానికి తెలంగాణ హైకోర్టు పచ్చజెండా ఊపింది. లాక్‌డౌన్‌లో ఇంటర్ మూల్యాంకనంపై (Inter spot valuation) సామాజిక కార్యకర్త ఓంప్రకాష్ వేసిన పిటిషన్ ను అత్యవసరంగా విచారణ చేపట్టిన హైకోర్టు, భౌతిక దూరం, మాస్కులు, శానిటైజేషన్ వంటి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

High Court of Telangana | (Photo-ANI)

Hyderabad, May 13: తెలంగాణ రాష్ట్రంలో (Telangana) ఇంటర్మీడియట్‌ పరీక్షల సమాధాన పత్రాల మూల్యాంకనానికి హైకోర్టు (Telangana High Court) అనుమతిచ్చింది. కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్ నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ సమాధాన పత్రాల మూల్యాంకనం ఆగిపోయింది. ఇప్పుడు ఇంటర్ సమాధాన పత్రాల మూల్యాంకనానికి తెలంగాణ హైకోర్టు పచ్చజెండా ఊపింది. లాక్‌డౌన్‌లో ఇంటర్ మూల్యాంకనంపై (Inter spot valuation) సామాజిక కార్యకర్త ఓంప్రకాష్ వేసిన పిటిషన్ ను అత్యవసరంగా విచారణ చేపట్టిన హైకోర్టు, భౌతిక దూరం, మాస్కులు, శానిటైజేషన్ వంటి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.  కొత్త హాల్ టికెట్లు ఉండవు, తెలంగాణలో పాత హాల్ టికెట్లతోనే పదవతరగతి పరీక్షలు, క్లారిటీ ఇచ్చిన ఎస్ఎస్‌సీ బోర్డు, హైకోర్టు అనుమతి కోసం వెయిటింగ్

స్పాట్‌ వాల్యుయేషన్‌ చేపట్టాలని ఇంటర్‌బోర్డు నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తూ సిద్దిపేటకు చెందిన కే ఓంప్రకాశ్‌ దాఖలుచేసిన పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. ఇంటర్‌ ఎగ్జామ్స్‌పై ఆధారపడి ఇతర పోటీ పరీక్షలు ఉన్నాయని, ఇంటర్‌ ఫలితాలు వెలువడితేనే ఆయా పరీక్షలకు విద్యార్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా పిటిషనర్‌ వాదనలను తోసిపుచ్చిన హైకోర్టు.. స్పాట్‌ వాల్యుయేషన్‌ కోసం జాగ్రత్తలు పాటించాలని ఇంటర్‌బోర్డును ఆదేశించింది. తదుపరి విచారణను 3 వారాలపాటు వాయిదా వేసింది. జూలై ఒకటి నుంచి జూలై 15 వరకూ సిబిఎస్ఇ 10, 12వ తరగతి పరీక్షలు, తేదీలను ప్రకటించిన కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్

అబిడ్స్‌లోని మహబూబియా ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో స్పాట్‌ వాల్యూయేషన్‌ ఏర్పాటు చేశారు. తొలిరోజు 4,350 మంది అధ్యాపకులు (ఎగ్జామినర్లు) హాజరైనట్టు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. తొలిరోజు ఇంగ్లిష్‌, గణితం, సివిక్స్‌ సబ్జెక్టుల పేపర్లు దిద్దినట్టు అధికారులు తెలిపారు. ఒక్కో గదిలో పది నుంచి 15 మంది లెక్చరర్లకు వసతి కల్పించారు. జవాబు పత్రాలతో పాటు ఆయా స్పాట్‌ వాల్యూయేషన్‌ గదులను పూర్తిగా శానిటైజ్‌ చేశారు.

లెక్చరర్లు మాస్క్‌లు ధరించి..భౌతిక దూరం పాటిస్తూ పేపర్లను దిద్దారు. ఒక్కో లెక్చర్‌ 45 పేపర్ల చొప్పున మూల్యాంకనం చేస్తున్నారు. బుధవారం నుంచి ఇదే అబిడ్స్‌లోని సెయింట్‌జార్జ్, సుజాత జూనియర్‌ కాలేజీ కేంద్రాల్లోనూ ఈ ప్రక్రియను చేపట్టనున్నట్లు హైదరాబాద్‌ జిల్లా ఇంటర్మీడియట్‌ బోర్డ్‌ ఆఫీసర్‌ జయప్రద బాయి తెలిపారు. అన్ని సవ్యంగా జరిగితే..20 రోజుల్లో జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తవుతుందని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో టెన్త్‌ పరీక్షలను హైకోర్టు మధ్యలో నిలిపివేసినందున తిరిగి ప్రారంభించేందుకు అనుమతి కోసం రెండురోజుల్లో అధికారులు అఫిడవిట్‌ దాఖలు చేయనున్నారు. అందుకోసం జిల్లాలవారీగా పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్ల నివేదికలను సిద్ధంచేశారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif