Union Budget 2023: తెలంగాణపై మోదీ ప్రభుత్వం కరుణ చూపుతుందా, బడ్జెట్లో తెలంగాణకు నిధులు ఎలా ఉండబోతున్నాయి, యూనియన్ బడ్జెట్‌పై కేసీఆర్ సర్కారు పెట్టుకున్న ఆశలు ఇవే..

ఇప్పటికే కేంద్ర పన్నుల్లో వాటా తగ్గుదల, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి, అమల్లోకి రాని నీతి ఆయోగ్, ఆర్థిక సంఘాల సిఫారసుల విషయంలో కేంద్రం ఏం చేస్తుందన్న దానిపై చర్చ జరుగుతోంది.

KCR (Credits: TS CMO)

Hyd, Feb 1: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్‌ ( union budget 2023) కేటాయింపులు ఎలా ఉంటాయోననే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. ఇప్పటికే కేంద్ర పన్నుల్లో వాటా తగ్గుదల, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి, అమల్లోకి రాని నీతి ఆయోగ్, ఆర్థిక సంఘాల సిఫారసుల విషయంలో కేంద్రం ఏం చేస్తుందన్న దానిపై చర్చ జరుగుతోంది.

కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఒకదానికి జాతీయ హోదాతో పాటు రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ, ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు వంటి రాష్ట్ర విభజన హామీల విషయంలో కేంద్రం ఈ ఏడాదైనా సానుకూలంగా స్పందిస్తుందా అన్నదానిపై చర్చ జరుగుతోంది. అప్పులపై పరిమితులు, గ్రాంట్ల బకాయిలు, పన్నుల్లో వాటాల తగ్గింపు, సిఫారసులు అమలుకాని కారణంగా రాష్ట్రానికి ఇప్పటివరకు దాదాపు రూ.లక్ష కోట్లకుపైగా నష్టం జరిగిందని ప్రభుత్వ వర్గాలు (KCR government) చెప్తున్నాయి.

రాయలసీమలో వెనుబడిన జిల్లాలకు బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తుందా, కేంద్ర బడ్జెట్‌పై ఏపీ ప్రభుత్వం గంపెడాశలు, జగన్ ప్రభుత్వం ఆశలు ఇవే..

2022-23లో కేంద్ర పన్నుల వాటాగా తెలంగాణకు రూ. 18 వేల కోట్లకు పైగా అందుతాయని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ( అంచనా వేసింది. కేంద్రం దీన్ని 12,407 కోట్లకు కుదించింది. డిసెంబర్‌ వరకు 8,381 కోట్లు మాత్ర మే ఇచ్చింది. ఇంకా 4,026 కోట్లు ఇవ్వాల్సి ఉన్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 2 నెలల్లోగా ఆ నిధులు రావాల్సి ఉన్నది. ఈ బడ్జెట్ లో (Union Budget 2023-24) ఆ నిధులు ఉంటాయా లేదా అనేదానిపై ఆసక్తి నెలకొని ఉంది.

వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిమిత్తం గత రెండేండ్లలో 900 కోట్లు అందాల్సి ఉన్నది. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ కోసం రాష్ట్రానికి రూ.25,555 కోట్లు అందించాలని నీతి ఆయోగ్‌ సిఫార్సు చేసి కేంద్రం నుంచి ఇంకా స్పందన రాలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద కేంద్రం నుంచి రాష్ట్రానికి 41,001 కోట్లు వస్తాయని ప్రభుత్వం బడ్జెట్‌లో అంచనా వేసింది. కానీ, డిసెంబర్‌ చివరి నాటికి 7,770 కోట్లు మాత్ర మే వచ్చాయి. ఇంకా రూ.33,231 కోట్లు రావాల్సి ఉన్నది. అంటే, గత 9 నెలల్లో తెలంగాణకు వచ్చిన గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ నిధులు 18% మాత్రమే. వీటిపై బడ్జెట్లో చర్చ ఉంటుందా అనేది చూడాలి.

చివరి బడ్జెట్‌ పై ఈ వర్గాల్లో ఉత్కంఠ, ఇంతకీ బడ్జెట్‌కు ముందు ఏం చేస్తారో తెలుసా? ఈ సారి బడ్జెట్‌లో ఈ రంగాలకు ఊరట లభించే ఛాన్స్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి తెలంగాణకు రూ.52,167 కోట్ల రుణాలు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో అంచనా వేయగా.. డిసెంబర్‌ వరకు రూ.29,008 కోట్లు మాత్రమే అందాయి. ఈ నేపథ్యంలో నిర్మలా సీతారామన్‌ తెలంగాణపై ఎటువంటి కరణ చూపనుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న మేరకు కేంద్రం నుంచి రావాల్సినవి

►పన్నుల్లో వాటా తగ్గింపు కారణంగా రెవెన్యూ నష్టం: రూ.33,712 కోట్లు

►నీతి ఆయోగ్‌ మిషన్‌ భగీరథ సిఫారసులు: రూ.19,205 కోట్లు

►నీతి ఆయోగ్‌ మిషన్‌ కాకతీయ సిఫారసులు: రూ.5 వేల కోట్లు

►ఏపీ నుంచి ఇప్పించాల్సిన విద్యుత్‌ బకాయిలు: రూ.17,828 కోట్లు

►ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితుల కారణంగా 2022–23లో అప్పుల నష్టం: రూ.15,303 కోట్లు

►ఆంక్షలు అమలు చేయలేదంటూ జీఎస్‌డీపీలో 5 శాతం రుణ పరిమితితో నష్టం: రూ.6,104 కోట్లు

►15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన గ్రాంట్లు: రూ.5,374 కోట్లు

►వెనుకబడిన జిల్లాలకు నిధుల బకాయిలు: రూ.1,350 కోట్లు

►14వ ఆర్థిక సంఘం సిఫారసుల బకాయిలు: రూ.817 కోట్లు

►15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన ప్రత్యేక నిధులు: రూ.723 కోట్లు

►ఏపీకి పొరపాటుగా బదిలీ అయిన సీసీఎస్‌ పథకాల నిధులు: రూ.495 కోట్లు

►2020–21లో పౌష్టికాహార పంపిణీ కోసం ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన నిధులు: రూ.171 కోట్లు



సంబంధిత వార్తలు

CM Chandrababu Polavaram Visit Updates: పోలవరం, అమరావతి రాష్ట్రానికి రెండు కళ్లు, 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని తెలిపిన సీఎం చంద్రబాబు

Cold Wave in Telugu States: తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి, ఉదయాన్నే బయటకు వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిక

Telangana Congress: కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం తగదు...ఇదే కొనసాగితే ప్రజలు బుద్దిచెప్పడం ఖాయమని వెల్లడి

Man Chops Off His Fingers: పని ఒత్తిడా? లేక పని చేయడం ఇష్టంలేకనో... మొత్తానికి పని నుంచి తప్పించుకోవదానికి కత్తితో చేతులు నరుక్కున్న వ్యక్తి.. గుజరాత్‌ లోని సూరత్ లో ఘటన (వీడియో)