New Delhi, FEB 01: 2023-24 ఆర్థిక సంవత్సరంకు సంబంధించి కేంద్ర బడ్జెట్ (Union Budget-2023) సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఆమెకు ఇది ఐదో బడ్జెట్ కాగా, 2024లో సార్వత్రిక ఎన్నికలు జరుగనుండగా మోదీ (Modi) సర్కార్ కు ఇదే చివరి, పూర్తి స్థాయి బడ్జెట్ కానుంది. అయితే ఈ బడ్జెట్ లో కేంద్రం అన్ని వర్గాలకు ఊరటనిచ్చే నిర్ణయాలు ప్రకటించనుంది. ఇవాళ ఉదయం 9 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్నారు. కేంద్ర బడ్జెట్ పై రాష్ట్రపతికి సమాచారం ఇవ్వనున్నారు. అక్కడి నుంచి ఉదయం 10 గంటలకు పార్లమెంట్ కు చేరుకుంటారు. ఉదయం 10:30 గంటలకు ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ (cabinet meet) కానుంది. ఈ సమావేశంలో కేంద్ర బడ్జెట్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపనుంది. అనంతరం 11 గంటలకు నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2023-24ను సభ ముందు ఉంచనుంది.
Delhi | Finance Minister Nirmala Sitharaman reaches Rashtrapati Bhavan to call on President Murmu
FM will then attend the Union Cabinet meeting, and then present Union Budget 2023-24. pic.twitter.com/hHDSZU7g3j
— ANI (@ANI) February 1, 2023
మోదీ సర్కార్ కు ఇదే పూర్తి స్థాయి బడ్జెట్ కావడం, 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో మౌళిక సదుపాయాల కల్పనకు భారీగా కేటాయింపులు ఉండొచ్చని విశ్లేషుకులు అంచనా వేస్తున్నారు. భారీ ప్రాజెక్టులు ప్రకటించడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌళిక వసతుల కల్పనపై దృష్టి సారించే అవకాశం ఉంది. వీటితోపాటు సంక్షేమ పథకాల అమలుకు సరైన అవరసమైనటువంటి నిధుల కేటాయింపు కూడా భారీగా పెంచే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ సారి బడ్జెట్ లో ఆదాయపు పన్ను భారాన్ని తగ్గించవచ్చని సగటు జీవి ఆశిస్తున్నాడు. 60 ఏళ్ల లోపు ఉన్న వారి వార్షిక ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని ఐదు లక్షలకు పెంచాలని సామాన్యులు కోరుకుంటున్నారు. ధరలు గణనీయంగా పెరిగినందున హోమ్ లోన్లపై విధించే పన్ను పరిమితులను సైతం సవరించాలని జనం కోరుకుంటున్నారు. సెక్షన్ 80సీ పరిమితిని రెండున్నర లక్షలకు, స్టాండర్టు రెడక్షన్ పరిమితిని ఏడాదికి లక్షకు పెంచాలని కోరుతున్నారు. ఇక సొంతింటి కలను నెరవేర్చాలని చూస్తున్నవారికి ఈ సారి బడ్జెట్ లో తీపి కబురు అందవచ్చని స్థారాస్తి నిపుణులు అంచనా వేస్తున్నారు.
#WATCH | Delhi: Union Finance Minister Nirmala Sitharaman all set to present the #UnionBudget2023 at 11am today.
This is the BJP government's last full Budget before the 2024 general elections. pic.twitter.com/8CFywfihvq
— ANI (@ANI) February 1, 2023
తొలిసారి ఇంటిని కొనుగులు చేసేవారికి ఎక్కువ ప్రోత్సహకాలు ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. రుణాలపై వడ్డీ రేటును తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని స్థరాస్తి రంగం వ్యాపారస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఒక వేళ నేరుగా వడ్డీ రేట్లను తగ్గించలేని పక్షంలో ఇతర విధానాల్లో ఉపశమనం కల్పించాలని కోరారు. ఇక ఈ బడ్జెట్ లో కేంద్రం పన్ను రాయితీలను మరింతగా పెంచుతుందని పారిశ్రామిక వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెటివ్ స్కీమ్ ను మరి కొంతకాలం పాటు పొడిగించాలని కోరుకుంటున్నారు. వంద శాతం ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని స్టార్టప్ లు ఆశిస్తున్నాయి.
Delhi | Finance Minister Nirmala Sitharaman all set to present the Union Budget 2023 at 11am today
This is the BJP government's last full Budget before the 2024 general elections. pic.twitter.com/m2NRMHW7Ut
— ANI (@ANI) February 1, 2023
దేశంలో పరిశ్రమల ఏర్పడక ముందు నుంచి ఉన్న మ్యానుఫ్యాక్షరింగ్ లు మరిన్ని ఇన్సెంటివ్ లను కోరుకుంటున్నారు. ఇక విద్యా రంగానికి గతేడాది బడ్జెట్ లో (Union Budget) లక్ష కోట్లు కేటాయించడంతో ఈ సారి కూడా భారీ అంచనాలు పెట్టుకుంది. డిజిటలైజేషన్ కు ప్రాధన్యమిస్తున్న మోదీ ప్రభుత్వం.. విద్యా రంగంలోనూ దానిని అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా గతేడాది ప్రకటించినట్లుగానే ఈ సారి కూడా మరికొన్ని డిజిటల్ యూనివర్సిటీలు, పీఎం విద్యా స్కీమ్ కు నిధులు పెంచే అవకాశం ఉంది.