Telangana: ప్రగతిపథంలో పరుగులు పెడుతున్న తెలంగాణ, సంక్షేమ పాలనతో ప్రజల మనసులు గెలుచుకుంటున్న సీఎం కేసీఆర్, అభివృద్ధి బాట వైపు పయనిస్తున్న అన్ని రంగాలు

దేశంలోనే సాగురంగంలో నవశకానికి తెలంగాణ నాంది పలికింది. అరుదైన నేలల సమాహారంగా, అన్నిరకాల పంటలకు అనువైన ప్రాంతంగా ఉన్న తెలంగాణను అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా ప్రభుత్వం (KCR Govt) తీర్చిదిద్దింది.

Telangana CM KCR | File Photo

Hyd, May 4: దేశంలోనే సాగురంగంలో నవశకానికి తెలంగాణ నాంది పలికింది. అరుదైన నేలల సమాహారంగా, అన్నిరకాల పంటలకు అనువైన ప్రాంతంగా ఉన్న తెలంగాణను అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా ప్రభుత్వం (KCR Govt) తీర్చిదిద్దింది. పంట వేసినప్పటి నుండి అమ్ముకోవడం దాకా అన్నదాతకు ప్రతి అడుగులో మార్గదర్శనంచేస్తూ.. ఎక్కడ ఏ పంట వేస్తే రైతు లాభాల బాట పడతారో సూచిస్తూ.. రైతులను సంపన్నం (KCR Govt put growth on fast Track) చేసింది.

కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయరంగానికి (made rapid strides in agriculture) సంబంధించి ఒక్కో సమస్యను పరిష్కరించుకొంటూ వస్తున్నది. సాగునీటి గండం తప్పింది. కరెంటు కష్టం తీరింది. ఉచితంగా కరెంట్‌ వస్తున్నది. పంటకు పెట్టుబడి సాయమూ ప్రభుత్వమే ఇస్తున్నది. రైతు కుటుంబానికి బీమాతో బతుకు భరోసానిస్తున్నది. పండిన పంటను తానే కొంటున్నది. రైతు కేంద్రీకృత పథకాలతో రాష్ట్ర వ్యవసాయరంగ దశ దిశను సీఎం కేసీఆర్‌ మార్చేశారు. రుణమాఫీ కింద ఇప్పటి వరకు 41 లక్షల మంది రైతులకు రూ.17 వేల కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది.రాష్ట్రంలో రూ.572.88 కోట్లతో 2,601 రైతు వేదికలను నిర్మించింది.

నిరుద్యోగుల‌కు కేసీఆర్ గుడ్‌న్యూస్, తెలంగాణలో 80 వేల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్, అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన

రైతులు పండిస్తున్న ప్రతి గింజను కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే. ప్రతి రైతుకు కచ్చితంగా మద్దతు ధర దక్కేలా చూసింది. కరోనాలో రైతులకు ఇబ్బంది కలుగకుండా ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యం కొనుగోలు చేసింది. గత ఏడేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయశాఖ ద్వారా రూ.83,989 కోట్లు ఖర్చు చేసింది. 2022-23 బడ్జెట్‌లో వ్యవసాయానికి కేటాయించిన నిధులు రూ. 24,254 కోట్లు. అనుబంధ రంగాలతో కలిపితే ఇది రూ.29,922 కోట్లు కేటాయించింది. ఇక గత ఏడేండ్లలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేసింది. రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి చేసింది. సుమారు 45 లక్షల ఎకరాలకు కాలేశ్వరం సాగు నీరు అందిస్తున్నది. అలాగే 43.26 లక్షల రైతులకు రూ.857.27 కోట్లతో 38.34 లక్షల క్వింటాళ్ల వివిధ రకాల పంటల విత్తనాలు రాయితీపై సరఫరా చేసింది. విత్తనాల నకిలీ, కల్తీకి పాల్పడే వారిపై పీడీ యాక్టు కింద జైలుకు పంపేలా చర్యలు తీసుకుంటోంది.

ప్రస్తుతం దేశానికి కేసీఆర్ లాంటి నాయకుడు కావాలి, బిజెపిది వైఫల్యాల చరిత్ర, టీఆర్ఎస్ వ్యవస్ధాపక దినోత్సవాల సందర్భంగా మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

ఆసరా పెన్షన్ స్కీమ్:

వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, కుటుంబంలో సంపాదించే వ్యక్తులు లేని వారి కోసం సాయంగా నిలించేందుకే తెలంగాణ ప్రభుత్వం ‘ఆసరా పెన్షన్ స్కీమ్’ను ప్రారంభించింది. చేనేత కార్మికులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, హెచ్ఐవీ ఎయిడ్స్ ఉన్న వారు కూడా ఈ పథకం నుంచి లబ్ది పొందుతున్నారు. ఎన్నికలలో గెలుపొందిన తర్వాత నవంబర్ 8, 2014లో తొలుత రూ.500 కోట్ల బడ్జెట్‌తో అమల్లోకి తెచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మహబూబ్‌నగర్ జిల్లాలోని కొత్తూరులో ఈ స్కీమ్ ప్రారంభించారు. ఆ తర్వాత ప్రతేడాది ఈ స్కీమ్ కోసం ప్రభుత్వం రూ.5,500 కోట్లను ఖర్చు చేస్తోంది.

రైతు బంధు:

తెలంగాణ ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు రైతు బంధు పథకం తీసుకువచ్చింది. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఎనిమిది విడతల్లో మొత్తం రూ.50వేల కోట్లు రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. తొలుత ఎకరా భూమి ఉన్న రైతుల ఖాతాలో, ఆ తర్వాత 2 ఎకరాలు.. ఆ తర్వాత 2 నుంచి 3 ఎకరాలు ఇలా విస్తీర్ణం చొప్పున రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు. రైతుబంధు పథకాన్ని ప్రపంచంలోని అత్యుత్తమ 20 పథకాల్లో ఒకటిగా రోమ్ లో 2018 నవంబర్ లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఎఫ్ఎఓ గుర్తించింది. రైతుబంధు గ్రూప్ బీమా పథకం తెలంగాణ ప్రభుత్వం రైతులకు అడగకుండానే అందించిన మరో వరం రైతు జీవిత బీమా పథకం. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని దాదాపు 58 లక్షల మంది రైతులకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తూ రూ.5 లక్షల బీమా కల్పించింది.

మతం, కులం పేరిట చిల్లర రాజకీయాలు, ఆల్వాల్ సభలో మండిపడిన తెలంగాణ సీఎం కేసీఆర్, మూడు మ‌ల్టీ సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రుల‌కు భూమి పూజలు

రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ల నుంచే రైతులకు రోజుకు 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించిన ప్రభుత్వం.. కరంటు కష్టాలను అధిగమించిన తర్వాత ఈ ఏడాది జనవరి ఒకటి అర్ధరాత్రి నుంచి రాష్ట్రంలోని 23 లక్షల పంపుసెట్లకు 24 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ప్రారంభించింది. దీనికోసం రూ.12,610 కోట్లను ఖర్చు చేస్తున్నది. రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సకాలంలో రాయితీపై పంపిణీ చేస్తున్నది.

కల్యాణ లక్ష్మీ:

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కళ్యాణ లక్ష్మి పథకం మరో కీలక మైలురాయిని దాటింది. కల్యాణలక్ష్మి/ షాదీ ముబారక్‌ పథకం లబ్దిదారుల కుటుంబాల సంఖ్య 10 లక్షలు దాటింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 10,56,239 మంది ఆడబిడ్డల వివాహాలకు సీఎం కేసీఆర్ ఈ ఆర్థిక సాయాన్ని అందించారు.తెలంగాణ రాష్ట్రం లోని నిరుపేద (దళిత, గిరిజన, బీసీ, ఓబీసీ కులాలకు చెందిన) యువతుల వివాహాల కోసం కళ్యాణలక్ష్మి పథకం పథకం కింద రూ.1,00,116 చొప్పున ఆర్థిక సాయం అందించే లక్ష్యంతో ప్రభుత్వం 2014, అక్టోబర్ 2న ప్రవేశపెట్టింది.

మార్చి 13, 2017న ప్రవేశపెట్టిన 2017-18 తెలంగాణ బడ్జెట్ లో ఈ పథకానికి ఆర్థిక సాయాన్ని రూ.51వేల నుండి రూ.75,116 లకు పెంచారు. మార్చి 19, 2018న ఆ మొత్తాన్ని రూ.1,00,116 పెంచారు. 18ఏళ్లు వయోపరిమితి ఉన్న బీసీ, ఓబీసీ యువతులకు ఈ పథకం వర్తిస్తుంది. గ్రామాల్లో ఆదాయం రూ.లక్షన్నర, పట్టణాల్లో రూ.2 లక్షల ఆదాయం ఉన్న వారు ఈ పథకానికి అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది.

చేతికి ఎముక లేదనడానికి ట్రేడ్‌మార్క్‌ సీఎం కేసీఆర్, న్యాయాధికారుల సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రిపై ప్రశంసలు కురిపించిన సీజేఐ ఎన్వీ రమణ

పేదింటి ఆడబిడ్డల పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు అప్పు చేయకూడదని, వారి ఇళ్లల్లో సంతోషం నింపేందుకు సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి/ షాదీ ముబారక్ పథకాన్ని తీసుకొచ్చారు. తొలుత ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యువతుల వివాహానికి రూ.51,000 వేల ఆర్థిక సాయాన్ని అందించేవారు. తర్వాతిరోజుల్లో పథకాన్ని బీసీలకు సైతం వర్తింపజేశారు. 2017లో ఈ మొత్తాన్ని 75,116కు పెంచిన తెలంగాణ ప్రభుత్వం.. మార్చి 19, 2018 నుంచి కల్యాణలక్ష్మి ఆర్థిక సాయాన్ని రూ.1,00116 లకు పెంచడం తెలిసిందే.

దళిత బంధు:

తెలంగాణ దళితబంధు పథకం అనేది దళితుల సాధికారత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన పథకం.అర్హులైన దళితులకు ఈ పథకంలో భాగంగా కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేయబడుతుంది. తమ అభివృద్ధిని తామే నిర్వచించుకునే దిశగా చైతన్యమై, ఉత్పత్తిలో భాగస్వాములైన నాడే దళితుల సాధికారతకు నిజమైన అర్థం లభిస్తుందన్న ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ పథకానికి రూపకల్పన చేసింది. పరిశ్రమలను, ఉపాధిని, వ్యాపారాన్ని ఎంచుకుని దళిత సమాజం వ్యాపార వర్గంగా అభివృద్ధి చెందడంకోసం ఈ పథకం ఉపయోగపడుతుంది.

2021, ఆగస్టు 5న యాదాద్రి భువనగిరి జిల్లా, తుర్కపల్లి మండలం, వాసాలమర్రి గ్రామంలోని 76 దళిత కుటుంబాలకు రూ. 7.60 కోట్ల నిధులను విడుదలజేయడం ద్వారా ఈ పథకం ప్రారంభించబడింది. దళితుల కోసం గతేడాది బడ్జెట్‌లో 'సీఎం దళిత్‌ ఎంపవర్‌మెంట్‌ స్కీం' పేరుతో వెయ్యి కోట్లు కేటాయించారు.మొదటగా హుజురాబాద్‌ నియోజకవర్గంలో పైలట్‌ ప్రాజెక్టుగా 2021, సెప్టెంబరు 14న రూ.10లక్షల చొప్పున 14,400 మంది లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమచేసింది. మూడు విడతల్లో కలిపి మొత్తంగా రూ.1,200 కోట్లను లబ్ధిదారులకు అందజేసారు.

పీయూష్ గోయ‌ల్ కాదు.. పీయూష్ గోల్ మాల్, మోదీని త‌రిమికొడుతామని సీఎం కేసీఆర్ హెచ్చరిక, ఇంటిగ్రేటెడ్ అగ్రిక‌ల్చ‌ర్ పాల‌సీ రూపొందించాలని కేంద్రానికి డిమాండ్

2022, ఫిబ్రవరి 19న కరీంనగర్‌ అంబేద్కర్‌ స్టేడియంలో హుజూరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన దళితబంధు లబ్ధిదారులలో 146 మంది లబ్ధిదారులకు రూ.15.30 కోట్ల విలువైన 63 యూనిట్లను (51 హార్వెస్టర్లు, 4 జేసీబీలు, 1 జేసీబీ అండ్‌ ట్రాక్టర్‌, 6 డీసీఎం వ్యాన్లు, 1 వరి నాటు యంత్రం) తెలంగాణ రాష్ట్ర ఎస్సీ సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, బీసీ సంక్షేమం-పౌర సరఫరాల శాఖామంత్రి గంగుల కమలాకర్‌ పంపిణీ చేశారు.

నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణం:

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ జూన్‌ 2, 2014న ప్రమాణం చేశారు. ‘నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణం’ అనే నినాదంతో పరిపాలన కొనసాగించారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆసరా, రైతుబంధు, కల్యాణ లక్ష్మీ, దళిత బంధు లాంటి వినూత్న సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారు. 2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఒంటిచేత్తో టీఆర్‌ఎస్‌ను అధికారంలోకి తీసుకొచ్చి రెండోసారి సీఎం పదవిని చేపట్టారు.

ఖబర్ధార్‌ మోదీ.. ఇది తెలంగాణ అడ్డా, నిన్ను తరిమికొట్టేందుకు తెలంగాణ పులిబిడ్డ‌ వస్తున్నాడు, ఏం చేస్కుంటావో చేసుకో. మీ సంస్కరణలను మేం అమలు చేయమని తేల్చి చెప్పిన సీఎం కేసీఆర్

దేశంలో గుణాత్మక మార్పు రావాలని ఫెడరల్‌ ఫ్రంట్‌కు స్వీకారం చుట్టిన కేసీఆర్‌... సెపెట్టంబర్‌ 6, 2018న అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు తెరలేపారు. ఒక్కడే రాష్ట్రమంతా తిరిగి ఒంటిచేత్తో విజయాన్ని సాధించాడు. ప్రజా కూటమి పేరిట కాంగ్రెస్‌, టీడీపీలు ముకుమ్మడిగా దాడి చేసినా.. ఓ వర్గం మీడియా చంద్రబాబుకు దన్నుగా నిలిచి తనపై విష ప్రచారానికి దిగినా.. మొక్కవోని దీక్షతో టీఆర్‌ఎస్‌ని అధికార పథంలో నిలిపారు. 119 స్థానాలకు పోటీ చేసి 88 స్థానాల్లో విజయ దుందుభి మోగించారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now