Telangana Minister KTR: తెలంగాణను మళ్లీ ఏపీలో కలిపేస్తారు, కేంద్రం తెలంగాణకు ఏం చేసిందో చెప్పే దమ్ముందా?, ప్రధాని మోదీ, బీజేపీపై విరుచుకుపడిన తెలంగాణ మంత్రి కేటీఆర్
వర్ని మండలంలో సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులకు మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
Hyd, Feb 16: తెలంగాణ కోసం ఏం అడిగినా ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదని మంత్రి కేటీఆర్ (Telangana Minister KTR) మండిపడ్డారు. వర్ని మండలంలో సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులకు మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాళేశ్వరం, పాలమూరుకు కేంద్రం జాతీయ హోదా ఇవ్వలేదని మండిపడ్డారు. బీజేపీ నేతలు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని తెలంగాణ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
విద్యార్థులు, యువకులను రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధిని పొందే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి బీజేపీ నేతలు (TS BJP) చేసిన మంచి ఏముందని ప్రశ్నించారు. ప్రధానిగా మోదీ (PM Modi) బాధ్యతలను చేపట్టి ఏడేళ్లవుతోందని... అయినా ఇప్పటి వరకు తెలంగాణకు (Telangana) ఆయన చేసిందేమీ లేదని అన్నారు. తెలంగాణ పుట్టుకను ప్రశ్నించిన బీజేపీకి రాష్ట్రంలో పుట్టగతులు ఉండవని చెప్పారు. తెలంగాణకు మోదీ ఎన్నో హామీలు ఇచ్చారని... ఇంతవరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని కేటీఆర్ దుయ్యబట్టారు. ఉపాధిహామీ పథకానికి 25 శాతం నిధులను తగ్గించారని అన్నారు. ప్రజల జీవితాలను మార్చమంటే... జీవిత బీమా సంస్థలను అమ్మేశారని విమర్శించారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని మళ్లీ ఏపీలో కలిపేస్తారని చెప్పారు. దేశం కోసం, ధర్మం కోసం అంటూ డైలాగులు చెప్పడం తప్ప దేశం కోసం బీజేపీ చేసిందేమీ లేదని అన్నారు. ఉత్తరప్రదేశ్ కు మాత్రమే మోదీ ప్రధాని అని ఎద్దేవా చేశారు. కుల,మతాలకు అతీతంగా టీఆర్‌ఎస్ అభివృద్ధి చేస్తోంది. కానీ కొందరు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. విషం నింపడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలంగాణకు కేంద్రం ఏం చేశారో చెప్పే దమ్ముందా.. నేను సవాల్ చేస్తున్నా ఇలా అడిగితే ఇష్ట మొచ్చినట్లు మాట్లాడుతున్నారు.
పక్కనే కర్ణాటకకు జాతీయ ప్రాజెక్టు ఇచ్చిన మోదీ.. తెలంగాణలో కాళేశ్వరం, పాలమూరుకు అడిగితే ఇవ్వలేదు. గిరిజన రిజర్వేషన్లు పెంచమంటే నాలుగేళ్లయినా దున్నపోతు మీద వాన పడ్డ చందంగా ఉంది. ఏం అడిగినా ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదు. ఉత్తరప్రదేశ్, ఉత్తర భారతానికి మాత్రమే మోదీ ప్రధాని అనుకుంటా’’ అంటూ మంత్రి కేటీఆర్ దుయ్యబట్టారు.
ఉత్తరప్రదేశ్, ఉత్తర భారతానికి మాత్రమే మోదీ ప్రధాని అనుకుంటా. డబ్బుల రాళ్లేసి ఊపుడు తప్ప ఏం చెయ్యడం లేదు. గిరిజనులకు, రైతులకు, దళితులకు కేటాయింపు లు లేవు. దేశం కోసం ధర్మం కోసం అంటారు తప్ప దేశానికి ఏం చేస్తారో చెప్పరు. ఎల్‌ఐసీకి రైతు బీమా అవకాశం మనం ఇస్తే.. మోదీ మాత్రం ప్రైవేట్ పరం చెయ్యాలని చూస్తున్నారు.