తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు మ‌హారాష్ట్ర ప‌ర్య‌ట‌న ఖ‌రారు అయింది. ఈ నెల 20వ తేదీన మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ థాకరేతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. మ‌హారాష్ట్ర సీఎం ఆహ్వానం మేర‌కు 20న కేసీఆర్ ముంబ‌యికి వెళ్ల‌నున్నారు. బుధ‌వారం ఉద‌యం సీఎం కేసీఆర్‌కు ఉద్ధ‌వ్ థాకరే ఫోన్ చేసి.. బీజేపీకి వ్య‌తిరేకంగా కేసీఆర్ చేస్తున్న పోరాటానికి ఆయ‌న సంపూర్ణ మ‌ద్ద‌తు తెలిపారు.ఇందులో భాగంగామిమ్మల్ని ముంబ‌యికి ఆహ్వానిస్తున్నాను. మీరు మా ఆతిథ్యాన్ని తీసుకోండి. అదే సందర్భంలో ఈ దిశగా భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకుందాం’ అని తెలిపారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)