Telangana Corona Cases: తెలంగాణలో నానాటికీ తీవ్రమవుతున్న కరోనా కేసులు, హైదరాబాద్, రంగారెడ్డిల్లో ఆందోళనకరస్థాయిలో కేసులు నమోదు. వైద్యాధికారులను అలర్ట్ చేసిన ప్రభుత్వం, దేశలోనూ అదే పరిస్థితి

మళ్లీ చాపకింద నీరులా వైరస్ వ్యాపిస్తోంది. దేశంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తెలంగాణలోనూ కొవిడ్ కొత్త కేసుల సంఖ్య (New Covid cases) వేగంగా పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్రంలో మరోసారి కరోనా కొత్త కేసుల సంఖ్య రెండు వందలు (279) దాటింది.

COVID Representative image

Hyderabad, June 18; తెలంగాణ (Telangana) రాష్ట్రంలో కరోనావైరస్ (Corona Virus) మహమ్మారి కల్లోలం కొనసాగుతోంది. మళ్లీ చాపకింద నీరులా వైరస్ వ్యాపిస్తోంది. దేశంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తెలంగాణలోనూ కొవిడ్ కొత్త కేసుల సంఖ్య (New Covid cases) వేగంగా పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్రంలో మరోసారి కరోనా కొత్త కేసుల సంఖ్య రెండు వందలు (279) దాటింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 27వేల 841 కరోనా పరీక్షలు (Covid Test) నిర్వహించగా.. కొత్తగా 279 కొవిడ్ కేసులు వచ్చాయి. అత్యధికంగా హైదరాబాద్ లో 172 కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 62, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 20 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 24గంటల వ్యవధిలో మరో 119 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఊరట కలిగించే విషయమేంటంటే.. కొత్తగా కొవిడ్ మరణాలేవీ (No Covid Deaths)సంభవించలేదు.

తెలంగాణలో ఇప్పటిదాకా 7లక్షల 95వేల 572 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 7లక్షల 89వేల 980 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 1,781 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా వల్ల రాష్ట్రంలో నేటివరకు 4వేల 111 మంది మరణించారు. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ శుక్రవారం రాత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఈ నెల 13న 126 కరోనా కేసులు రాగా, 14న ఒక్కసారిగా డబుల్ సెంచరీ మార్కుని(219) అందుకున్నాయి. ఈ నెల 15న 205 కరోనా కేసులు వచ్చాయి. ఈ నెల 16న 285 కొవిడ్ కేసులు వచ్చాయి. 300లకు చేరువగా కొవిడ్ కేసులు నమోదవడం టెన్షన్ పెడుతోంది.

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. ఫోర్త్ వేవ్ భయాలను తలుచుకుని ప్రజలు వణికిపోతున్నారు. కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచిస్తున్నారు. మాస్కు ధరించాలని, భౌతికదూరం పాటించాలని చెబుతున్నారు.

Covid in TS: తెలంగాణలో మెల్లిగా పెరుగుతున్న కేసులు, నిన్న 205 కేసులు కాగా కొత్తగా 285 మందికి కరోనా పాజిటివ్, రాష్ట్రంలో కొత్తగా ఎలాంటి మరణాలు లేవని తెలిపిన ఆరోగ్యశాఖ  

అటు దేశంలోనూ కరోనావైరస్ క్రమంగా వ్యాపిస్తోంది. వరుసగా రెండో రోజు 12 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో బాధితుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది.

గురువారం 5.19 లక్షల మందికి పైగా కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 12వేల 847 మందికి వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. కరోనా పాజిటివిటీ రేటు రెండు శాతంపైనే కొనసాగుతోంది. మహారాష్ట్ర (4,255), కేరళ (3,419), ఢిల్లీ (1,323), కర్నాటక (833), తమిళనాడు, హరియానా, ఉత్తరప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఢిల్లీలో 10 రోజుల వ్యవధిలో 7వేలకు పైగా కేసులువచ్చాయి. జూన్‌ 7న 1.92 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు జూన్‌ 15 నాటికి 7.01 శాతానికి ఎగబాకింది. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 4.32 కోట్ల మందికి పైగా కరోనా బారినపడ్డారు.

IMD Alert For Telengana: తెలంగాణకు అతిభారీ వర్ష సూచన, రానున్న మూడు రోజుల పాటూ భారీ వర్షాలు కురిసే అవకాశం, పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసిన ఐఎండీ  

యాక్టివ్ కేసులు రోజురోజుకూ గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం వాటి సంఖ్య 63వేల 063కి చేరింది. దీంతో మొత్తం కేసుల్లో బాధితుల వాటా 0.15 శాతానికి పెరిగింది. ఒక్కరోజు వ్యవధిలో మరో 7వేల 985 మంది కోలుకోగా.. రికవరీ రేటు 98.64 శాతానికి తగ్గిపోయింది. 24 గంటల వ్యవధిలో మరో 14 మంది కొవిడ్ తో మరణించారు. నిన్న 15.27 లక్షల మంది టీకా తీసుకోగా.. మొత్తంగా 195.8 కోట్లకుపైగా డోసులు పంపిణీ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.