Heavy rains. (Photo Credits: PTI)

Hyderabad, June 16:  నైరుతి రుతుపవనాలు (Monsoon) తెలంగాణవ్యాప్తంగా విస్తరించాయి. రాష్ట్రంలో ప్రవేశించిన మూడు రోజుల్లోనే విస్తరించడంతో వర్షాలు (Rians) కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు (Heavy rains) కురిశాయి. అత్యధికంగా నిర్మల్‌ జిల్లా (Nirmal) ముధోల్‌ 13.28 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది. వరంగల్‌ జిల్లా నెక్కొండలో (Nekkonda) 12.75, భద్రాది కొత్తగూడెం జిల్లా మండలపల్లిలో 12.28, జగిత్యాల జిల్లా కొల్వాయిలో 11.90, మంచిర్యాల జిల్లా కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో 11.13 వర్షపాతం నమోదైంది.  జయశంకర్‌ జిల్లా ముత్తారం మహదేవ్‌పూర్‌లో 10.10, పెద్దపల్లి జిల్లా మల్యాలపల్లిలో 10 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. రుతుపవనాలు చురుగ్గా ఉండడంతో రాబోయే మూడు రోజుల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేసింది. ఉపరితల ద్రోణి విదర్భ నుంచి తెలంగాణ మీదుగా రాయలసీమ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతుందని పేర్కొన్నది.

Covid in TS: తెలంగాణలో మెల్లిగా పెరుగుతున్న కేసులు, నిన్న 205 కేసులు కాగా కొత్తగా 285 మందికి కరోనా పాజిటివ్, రాష్ట్రంలో కొత్తగా ఎలాంటి మరణాలు లేవని తెలిపిన ఆరోగ్యశాఖ  

శుక్రవారం నాడు పెద్దపల్లి (Peddapalli), జయశంకర్‌ భూపాల్‌పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. శనివారం జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.

Liquor Destroyed in AP: ఈ సారి ఒంగోలులో.., రూ.2.14 కోట్ల విలువైన మద్యంను రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేసిన పోలీసులు, వివరాలను వెల్లడించిన ఎస్పీ మలికాగర్గ్‌  

ఆదివారం మంచిర్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాల్‌పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్‌-మల్కాజిగిరి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాని తెలిపింది. ఈ మూడు రోజులు రాష్ట్రంలో చాలా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వచ్చే అవకాశాలున్నాయి.