Talking Bird Sita Returns: పండు ఇవ్వలేనదని అలిగి పారిపోయిన చిలక, నాలుగు రోజుల పాటూ చెట్లవెంట తిరిగిన కుటుంబ సభ్యులు, సితాఫలం కోసం వెళ్లి స్కూల్లో మకాం పెట్టిన ఆఫ్రికన్ చిలక

అందుకే దినికి ‘ది ఐన్‌స్టీన్స్ ఆఫ్ ది బర్డ్ వరల్డ్’ అనే పేరుంది. ఈ పక్షులు తరచుగా, సందర్భానుసారంగా మాట్లాడతాయని దీంతో మన భావోద్వేగాలను చాలా వరకు పట్టించుకుంటాయని అంటున్నారు నిపుణులు.

Hyderabad, SEP 08: అలక అనేది మనుషులే చేస్తారా? పక్షులకు,జంతువులకు అలగటం చేతకాదా? అనే అనుమానం మీకెప్పుడన్నా వచ్చిందా? వచ్చి ఉంటే కనుక ఈ చిలుకమ్మను చూస్తే ఆ డౌట్ క్లియర్ అయిపోతుంది. సాధారణంగా అడిగింది కొనివ్వలేదనో..తల్లిదండ్రులు తిట్టారనో లేదా కొట్టారని పిల్లలు అలిగి ఇళ్లు వదిలిపోవడం గురించి విన్నాం. కానీ ఓ చిలుకమ్మ (Parrot) తాను అడిగిన పండు యజమాని తీసుకురాలేదని అలిగి ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఇదేదో గమ్మత్తుగా ఉందే చిలకమ్మ అలిగిందా? అదికూడా పండు కోసం అని ఆశ్చర్యపడుతున్నారా? ఈ కొంటె చిలుకమ్మ గురించి తెలుసుకోవాలంటే సూర్యాపేట జిల్లా వెళ్లాల్సిందే. సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్‌లోని (Huzurnager) టీచర్స్‌ కాలనీ చెందిన పిల్లుట్ల రంజిత్ కుమార్ నాలుగేళ్ల క్రితం బెంగళూరు నుంచి ఆఫ్రికన్ గ్రే చిలుకను కొనుక్కొచ్చారు. చక్కగా ముద్దుముద్దుగా మాటలు కూడా చెబుతుందా చిలుకమ్మ. దానికి దాన్ని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు రంజిత్ (Ranjith) కుటుంబం. ఆ చిలుకకు ‘సీత’ (Sita) అని చక్కటి పేరు కూడా పెట్టుకున్నారు. ‘సీతా’అని పిలిస్తే చాలు హా అంటూ చక్కగా పలుకుతు సమాధానం కూడా చెబుతుందా చిలుకమ్మ.రంజిత్ కుటుంబంలో ‘సీత’ ఓ సంబరాల సంతోషమైపోయింది. దాంతో చక్కగా కబుర్లు చెబుతుంటారు. దానికి సీత చక్కగా సమాధాలిస్తుంటుంది. అలా సీత వల్ల రంజిత్ కుటుంబం ఆ చుట్టుపక్కలవారికి చక్కటి చెలిమిగా మారిపోయింది.

Bird Flu: దేశంలో బర్డ్ ఫ్లూ వ్యాధి పంజా, గుడ్లు లేదా చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వస్తుందా, బర్డ్ ఫ్లూ వస్తే ఎలాంటి లక్షలు కనిపిస్తాయి, ఇది ఎలా స్ప్రెడ్ అవుతుందో ఓ సారి చూద్దాం 

చిలుకతో రోజు కొంచెం సేపు మాట్లాడితే కాని వాళ్లు రోజు గడవదు. అచ్చం మనిషిలానే చిలుక మాట్లాడటంతో చుట్టుపక్క వాళ్లు కూడా ప్రత్యేకమైన శ్రధ్ద ఈ కుటుంబం, చిలుక పై కూడా పెడుతూ ఉంటారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 3 ఉదయం సీత అనే ఈ చిలుక తనకు సీతాఫలం కావాలని అడిగింది. సాయంత్రం తీసుకొస్తాను సీతమ్మ అంటూ సమాధానం చెప్పి బయటకు వెళ్లిపోయాడు రంజిత్. కానీ తీసుకురాలేదు. దీంతో ‘సీత’కు కోపమొచ్చింది. అలిగింది. అలిగిన చిలుకమ్మ ఊరికనే ఉందా నా అలక సంగతి వీరికి తెలియాలి అనుకుందో ఏమోగానీ..తుర్రున ఎగిరిపోయింది. సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్‌లోని టీచర్స్‌ కాలనీలోని తన ఇంటి నుంచి పారిపోయింది.

Bird flu in US: అమెరికాలో మనిషికి సోకిన బర్డ్‌ ఫ్లూ, యుఎస్‌లో తొలి కేసు ఇదేనని వెల్లడించిన సీడీసీ, ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందించినట్టు అధికారులు వెల్లడి 

చిట్టి చిలుకమ్మ సీత కనిపించకపోవటంతో రంజిత్ కుటుంబానికి దిగులువేసింది. చుట్టుపక్కల అంతా వెతికారు. చెట్టు పుట్టా అంతా వేయి కళ్లతో వెతికారు. కానీ సీత జాడ కనిపించలేదు.దీంతోరంజిత్ కుటుంబం దిగాలు పడిపోయింది. సీత కనిపించకపోవడంతో చుట్టుపక్కల వారిని అడిగారు. సీత గురించి తెలిసినవారంతా ఔనా సీతమ్మ కనిపించట్లేదా? అంటూ వారు కూడా వెతికారు. కానీ ఎక్కడా సీత కనిపించలేదు. దీంతో రంజిత్ కుటుంబం చిలుక తప్పిపోయిందని స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.చిలుక ఆచూకీ లేకపోవడంతో కుటుంబసభ్యులు తిండి తిప్పలు మాని చిలుక కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఇంటి నుంచి పారిపోయిన చిలుక ఆచూకీ నాలుగు రోజులు తరువాత తెలిసింది. ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్‌లో ఈ చిలుక ఉండటంతో స్కూల్ స్టూడేంట్స్ గమనించి స్కూల్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఆ చిలుక గురించి తెలుసుకున్న స్థానికులు రంజిత్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో అక్కడకు రెక్కలు కట్టుకుని వాలిపోయారు. చిలుక (సీత)ను హత్తుకొని కన్నీటి పర్యంతం అయ్యారు. అయితే స్కూల్ ఆవరణలో ఆడుకుంటున్న పిల్లలను ఈ చిలుకే పలకరించడంతో తన ఆచూకీ తెలిసింది అంటున్నారు స్కూల్ టీచర్స్. పిల్లలు తమ వద్దకు వచ్చి అక్కడ ఒక బర్డ్ మాట్లాడుతుంది రండి అని తీసుకొని వెళ్లారని చెబుతున్నారు టీచర్స్.

ఆఫ్రికన్ గ్రే చిలుకలు (African gray parrots) విపరీతమైన తెలివితేటలు కలిగి ఉంటాయి. అందుకే దినికి ‘ది ఐన్‌స్టీన్స్ ఆఫ్ ది బర్డ్ వరల్డ్’ అనే పేరుంది. ఈ పక్షులు తరచుగా, సందర్భానుసారంగా మాట్లాడతాయని దీంతో మన భావోద్వేగాలను చాలా వరకు పట్టించుకుంటాయని అంటున్నారు నిపుణులు. ఆఫ్రికన్ గ్రే చిలుకలు 50 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం జీవించగలవని రంజిత్ తెలిపారు. ప్రస్తుతం మా చిలుకకు మంచి తోడు చూస్తున్నామని త్వరలో దాన్ని ఒక ఇంటిదాన్ని చేస్తామని అంటున్నారు చిలుక యజమాని.



సంబంధిత వార్తలు

MP Kiran Kumar Reddy: అల్లు అర్జున్‌పై ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్, బన్నీ రియల్ హీరో కాదు, స్క్రిప్ట్ తీసుకొచ్చి చదివారని ఆగ్రహం వ్యక్తం చేసిన భువనగిరి ఎంపీ

MP Chamala Kiran Kumar Reddy: కేసీఆర్ ఇంట్లో ట్రయాంగిల్ ఫైట్, అరెస్ట్‌తో కేటీఆర్ హీరో కావాలనుకుంటున్నారు...కాంగ్రెస్ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్

Telangana Congress: కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం తగదు...ఇదే కొనసాగితే ప్రజలు బుద్దిచెప్పడం ఖాయమని వెల్లడి

BRS Vinod Kumar: కమీషన్లు అన్నం పెట్టవు..వేల టీఎంసీల నీళ్లు వెళ్లినా మేడిగడ్డ ప్రాజెక్టుకు ఏం కాలేదు..సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఫైర్