Mumbai. Feb 22: భారతదేశంలో బర్డ్ ఫ్లూ వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తోంది. మహారాష్ట్రలో (Bird Flu Scare In Maharashtra) థానే జిల్లాలోని షాహాపూర్ తహసీల్దార్ పరిధిలోని వెహ్లులి గ్రామంలోని కోళ్ల ఫారంలో 100 కోళ్లు ఆకస్మికంగా మృతి చెందాయి. బర్డ్ ప్లూతో కోళ్లు మరణించాయనే భయంతో వ్యాధి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని థానే జిల్లా కలెక్టర్ రాజేష్ జె నర్వేకర్ జిల్లా పశుసంవర్థకశాఖ అధికారులను ఆదేశించారు. మరణించిన కోళ్ల యొక్క నమూనాలను పరీక్ష కోసం పూణే ప్రయోగశాలకు పంపించారు. బర్డ్ ప్లూ ప్రబలకుండా నియంత్రించడానికి 25వేల కోళ్లను చంపాలని జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
తాజాగా H591 బర్డ్ ఫ్లూ మహారాష్ట్ర మరియు బీహార్ (Bird Flu Scare) లో కలకలం రేపుతోంది. పౌల్ట్రీ ఫార్మ్స్ లో పక్షులు ఈ వైరస్ బారిన పడి చనిపోయాయి. పౌల్ట్రీ రీసెర్చ్ ఫామ్ ఇన్ పాట్నా ప్రకారం 3859 పక్షులు ఉండగా… 787 పక్షులు మృతి చెందాయి. షాహాపూర్ దగ్గర 100 పక్షులు చనిపోయాయి. అయితే పూణే లో చేసిన రీసెర్చ్ ప్రకారం H591 ఇన్ఫ్లుఎంజా తో పక్షులు చనిపోయినట్లు తెలిసింది. అయితే అసలు బర్డ్ ఫ్లూ అంటే ఏమిటి..?, చికెన్ మరియు గుడ్లు తినచ్చా తినకూడదా..? ఇలాంటి ముఖ్యమైన విషయాలను ఇప్పుడు చూద్దాం.
బర్డ్ ఫ్లూ అంటే ఏమిటి..?
బర్డ్ ఫ్లూ (Bird Flu Scare In Bihar) లేదా ఇన్ఫ్లుఎంజా అనేది విపరీతంగా సోకుతుంది. ఇది పెంపుడు పక్షులుకి మరియు వైల్డ్ పక్షులకు కూడా సోకే అవకాశం ఉంది. ఇన్ఫెక్ట్ అయినా పక్షులు ద్వారా ఇది ఇంటస్టైన్స్ మరియు రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తుంది. కోళ్లు, బాతులు, టర్కీలకు ఈ వైరస్ వ్యాపిస్తుంది. మొట్టమొదటిసారి 1996లో బర్డ్ ఫ్లూ కేసులు చైనాలో వచ్చాయి. భారతదేశంలో అయితే మొట్ట మొదటిసారి 2006లో మహారాష్ట్రలో వచ్చాయి.
ఇది ఎలా స్ప్రెడ్ అవుతుంది…?
ఇది పక్షుల ద్వారానే సోకుతుంది. ఇన్ఫెక్ట్ అయిన పక్షుల విసర్జన నుంచి ఈ వైరస్ అనేది సోకుతుంది. ఎక్కువ సేపు ఇది వాతావరణంలో ఉంటుంది. సులువుగా స్ప్రెడ్ అవుతుంది. పక్షుల నుండి మనుషులకి సోకుతుంది. ఎవరైతే పక్షులకి దగ్గరగా ఉంటారో వాళ్లకి కూడా సోకే అవకాశం ఉంది. కనుక ఏదైనా పక్షి ఇన్ఫెక్ట్ అయ్యి దగ్గరగా వుండే మనుషుల్లో కూడా రెస్పిరేటరీ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా పౌల్ట్రీల్లో పనిచేసేవారికి ఈ వైరస్ సోకే ముప్పు ఎక్కువగా ఉంటుంది.సాధారణంగా బర్డ్ ఫ్లూ మనుషుల్లో ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. అయితే, ఏదో ఒకరోజు ఈ వైరస్ కూడా జన్యు పరివర్తన చెంది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే సామర్థ్యాన్ని సాధించొచ్చని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హెచ్5ఎన్1 లాంటి ఏవియెన్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్ సోకిన పక్షులకు దగ్గరగా వెళ్లినప్పుడు మిగతా పక్షులకు ఈ వైరస్ సోకుతుంది. ఈ వైరస్ సోకి మరణించిన పక్షుల మృతదేహాలకు దగ్గరగా వెళ్లినప్పుడు కూడా బతికుండే పక్షులకు ఈ వైరస్ సంక్రమిస్తుంది. పక్షుల రెట్టల నుంచి కళ్లు, నోటి నుంచి వెలువడే ద్రవాల వరకు... అన్నింటిలోనూ ఈ వైరస్ జాడలు ఉంటాయి. కొన్ని పక్షుల్లో అసలు ఎలాంటి లక్షణాలూ కనిపించవు. అయితే వీటి వల్ల ఇతర పక్షులకు వైరస్ వ్యాపించే ముప్పు ఉంటుంది. వలస పక్షుల వల్ల ఇవి ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తుంటాయి.
గుడ్లు లేదా చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వస్తుందా..?
చికెన్ లేదా గుడ్లు తింటే ఈ వైరస్ వస్తుందా లేదా అనేది ఇంకా తెలియదు. కానీ సైంటిస్టులు 70 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత తో దీనిని తీసుకోవడం మంచిదని చెప్పారు. శుభ్రంగా వండితే వైరస్ చనిపోతుంది. కాబట్టి ఎలాంటి ఆందోళనా అవసరం లేదు. అదే గుడ్లు అయితే ఫ్రెష్ గా ఉండే గుడ్లను మాత్రమే వండుకోండి. ఇలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ప్రజలు భయపడాల్సిన పనిలేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఇన్ఫెక్షన్ మనకు సోకకుండా అడ్డుకోవచ్చని వివరిస్తున్నారు.
బర్డ్ ఫ్లూలో చాలా రకాలు ఉంటాయి. వీటిలో చాలావరకు మనుషులపై ఎలాంటి ప్రభావం చూపలేవు. అయితే, ఈ వైరస్‌లలో కొన్ని మనుషులకు సోకే అవకాశముంటుంది.అయితే, భారత్‌లో ప్రస్తుతం మనుషులకు ఈ వైరస్ సోకినట్లు ఎలాంటి కేసులూ నిర్ధారణ కాలేదు. అయితే, పౌల్ట్రీల్లో పనిచేసేవారు, పక్షులతో ఎక్కువసేపు దగ్గరగా గడిపేవారు పీపీఈ కిట్లు ధరించాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. మరోవైపు బర్డ్ ఫ్లూ కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో పక్షులను స్థానిక ప్రభుత్వాలు వధిస్తున్నాయి. మిగతా పక్షులతోపాటు మనుషులకు ఈ వైరస్ సోకకుండా చర్యలు తీసుకుంటున్నాయి.
బర్డ్ ఫ్లూ వస్తే కనిపించే లక్షణాలు
జ్వరం, దగ్గు, తలనొప్పి, కండరాల నొప్పులు, జలుబు, వణుకు లాంటి లక్షణాలతో మనుషుల్లో బర్డ్ ఫ్లూ మొదలవుతుంది. సాధారణ ఫ్లూ లక్షణాలే బర్డ్ ఫ్లూ సోకినప్పుడూ కనిపిస్తాయి. వైరస్ సోకిన మూడు నుంచి ఐదు రోజుల తర్వాత ఈ లక్షణాలు ఒక్కసారిగా కనిపిస్తాయి. లక్షణాలు తగ్గేందుకు యాంటీవైరల్ ఔషధాలను వైద్యులు సూచిస్తారు. పారాసిటమాల్ లాంటి నొప్పి నివారిణులను కూడా ఇస్తుంటారు.