Bird Flu Spreading: 25వేల కోళ్లను చంపిన అధికారులు, చాపకిందనీరులా బర్డ్ ఫ్లూ, మహరాష్ట్రలో విస్తరిస్తున్న మహమ్మారి, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు రంగంలోకి నిపుణులు, అలర్టయిన ప్రజలు
Bird Flu (Photo Credits: IANS|File)

Mumbai, Feb 20: మహారాష్ట్రలో (Maharashtra) మరో వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్న మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ (Bird Flu) రూపంలో మరో గండం ఎదురైంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూను (Bird Flu) గుర్తించారు. ఈ వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోందని వైద్యాధికారులు చెప్తున్నారు. మహారాష్ట్రలోని పాల్గర్, థానే జిల్లాల్లో ఇటీవల బర్డ్ ఫ్లూ సోకి వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. మృతి చెందిన కోళ్ల అవశేషాలను పరీక్షించిన వైద్యాధికారులు.. ఏవియన్ ఇన్ఫ్లుఎంజా కారణంగా అవి మృతి చెందినట్లు నిర్ధారించారు. మొదట థానే జిల్లాలోని (Thane) వెహ్లోలి గ్రామంలో ఉన్న ఓ పౌల్ట్రీ ఫారంలో (Poultry) 100కు పైగా కోళ్లు మృత్యువాత పడినట్లు గుర్తించిన స్థానిక అధికారులు, విషయాన్నీ జిల్లా పశువైద్యాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.

Bird Flu Fear in Telangana: తెలంగాణలో మిస్టరీ వ్యాధి, రెండు గంటల్లో నాలుగు వేల కోళ్లు మృతి, కాల్వ శ్రీరాంపూర్‌లో నాటు కోళ్లు అకస్మాత్తుగా మృతిపై జిల్లాలో కలకలం, బర్డ్ ఫ్లూ సోకిందనే అనుమానాలు

కోళ్ల మృతిపై సమీక్ష జరుగుతన్న సమయంలోనే పాల్గర్ జిల్లాలోనూ వందల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో సమస్య తీవ్రతను గుర్తించిన పశుసంవర్ధకశాఖ అధికారులు..విస్తృత పరీక్షలు నిర్వహించారు. ఈ రెండు జిల్లాలతో పాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో H5N1 ఏవియన్ ఇన్ఫ్లుఎంజా (Influenza) వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు తేల్చారు. ఈక్రమంలో మిగతా ప్రాంతాలకు ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకున్నట్లు పాల్‌ఘర్‌ జిల్లా పశువైద్యాధికారి డాక్టర్‌ ప్రశాంత్‌ కాంబ్లే తెలిపారు.

Bird Flu Scare: ముంచుకొస్తున్న బర్డ్ ఫ్లూ వైరస్ ముప్పు, నాలుగు రాష్ట్రాల్లో హైఅలర్ట్, నాన్ వెజ్ అమ్మకాలు, ఎగుమతులపై హిమాచల్ ప్రదేశ్‌లో నిషేధం, ఇన్‌ఫెక్షన్‌తో వేల సంఖ్యలో పక్షులు మృతి

వైరస్ ను గుర్తించిన పౌల్ట్రీ ఫారంల నుంచి కిలోమీటర్ పరిధిలోని ఇతర ఫారంలలోని కోళ్లను పూడ్చిపెట్టాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు. దీంతో ఒక్క థానే జిల్లాలోనే 25,000 కోళ్లను పూడ్చిపెట్టారు యజమానులు. ఇక H5N1 ఏవియన్ ఇన్ఫ్లుఎంజా వైరస్ వ్యాప్తిపై మహారాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ.. వైరస్ వ్యాప్తి ప్రస్తుతం అదుపులోనే ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించింది. ఇంతవరకు కోళ్ల నుంచి మనుషులకు ఈ వైరస్ సోకిన దాఖలాలు లేవని స్పష్టం చేశారు.