Tirumala Brahmotsavalu: నేటి నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు... రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు.. ప్రైవేటు వాహనాలపై ఆంక్షలు

ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం సాయంత్రం నుంచి ప్రారంభమయ్యే నవాహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను కన్నులపండుగగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లను పూర్తి చేసింది.

Tirumala Brahmotsavam Credits: Twitter

Tirumala, Oct 4: కలియుగ ప్రత్యక్ష దైవం, ఆ దేవదేవుడు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు (Tirumala Brahmotsavalu) నేటి నుంచి అంగరంగవైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం సాయంత్రం నుంచి ప్రారంభమయ్యే నవాహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను కన్నులపండుగగా నిర్వహించేందుకు టీటీడీ (TTD) ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ రోజు సాయంత్రం 5.45 గంటలకు మీన లగ్నంలో నిర్వహించే ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు రాత్రి వాహన సేవలు మొదలయి తొమ్మిది రోజుల పాటు వివిధ వాహన సేవలపై మలయప్ప స్వామి ఊరేగింపు చేయనున్నారు. 12వ తేదీన చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

దేశంలో రైతుల కోసం కేంద్ర కేబినెట్ కీల‌క నిర్ణ‌యాలు, రెండు ప‌థ‌కాల కోసం ఏకంగా ల‌క్ష కోట్ల‌కు పైగా ఖ‌ర్చు, ఆహార భ‌ద్ర‌త కొన‌సాగించేందుకు నిర్ణ‌యాలు

నేడు శ్రీవారికి పట్టువస్త్రాలు

బ్రహ్మోత్సవాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున నేడు శ్రీవారికి ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత చర్యలను చేపట్టారు. ఇక బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రైవేటు వాహనాలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఇప్పటికే ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలు నిలిపివేసినట్లు ప్రకటించారు.

జన్వాడ ఫాంహౌస్ అక్రమ నిర్మాణం కాదా?, దానిని కూల్చాలా వద్దా? అని ప్రశ్నించిన సీఎం రేవంత్ రెడ్డి..పేదలను రక్షణ కవచాలుగా పెట్టుకుని నాటాకాలా అని ఆగ్రహం 

ప్రైవేటు వాహనాలను ఎక్కడివరకు అనుమతులు అంటే?



సంబంధిత వార్తలు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif