Inter Exam Schedule: ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్.. మార్చి 18న పది పరీక్షలు షురూ.. ఒకట్రెండు రోజుల్లో పరీక్షల షెడ్యూల్
2024 ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు పరీక్షలను నిర్వహిస్తారు. ప్రీ ఫైనల్ ఎగ్జామ్ జనవరిలో, ఫిబ్రవరి 1న ప్రాక్టికల్స్ ఉంటాయి. ఇంటర్మీడియట్ బోర్డు రూపొందించిన ఈ ప్రతిపాదనలకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
Hyderabad, Dec 28: ఇంటర్మీడియట్ (Inter) వార్షిక పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. 2024 ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు పరీక్షలను నిర్వహిస్తారు. ప్రీ ఫైనల్ ఎగ్జామ్ (Exam) జనవరిలో, ఫిబ్రవరి 1న ప్రాక్టికల్స్(Practicals) ఉంటాయి. ఇంటర్మీడియట్ బోర్డు రూపొందించిన ఈ ప్రతిపాదనలకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పరీక్షల షెడ్యూల్‌ను ఒకట్రెండు రోజుల్లో ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేయనున్నది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహిస్తారు.
మార్చి 18 నుంచి ఎస్సెస్సీ పరీక్షలు!
పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ పైనా అధికారులు కసరత్తు చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. మార్చి 18 నుంచి నిర్వహించే అవకాశాలున్నాయి. మొత్తం ఏడు రోజులపాటు పరీక్షలను నిర్వహించనుండగా, మార్చి నాలుగు వారంలో పరీక్షలు ముగియనున్నాయి.