Telangana Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 13వందలకు పైగా జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, కొలువుల జాతరను కొనసాగిస్తున్న తెలంగాణ ప్రభుత్వం

ఇంటర్‌ విద్య కమిషనరేట్‌ పరిధిలో 1392 జూనియర్‌ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థుల దరఖాస్తులను ఈ నెల 16 నుంచి జనవరి 6 వరకు స్వీకరించనున్నట్టు టీఎస్‌పీఎస్‌సీ తాజా ప్రకటనలో పేర్కొంది.

TSPSC notifies 1,392 junior lecturer posts

Hyderabad, DEC 09: తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే పలు జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేసిన ప్రభుత్వం. తాజాగా జూనియర్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి నిర్ణయించింది. తాజాగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) జూనియర్‌ లెక్చరర్‌ (Junior Lecturer) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇంటర్‌ విద్య కమిషనరేట్‌ పరిధిలో 1392 జూనియర్‌ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థుల దరఖాస్తులను ఈ నెల 16 నుంచి జనవరి 6 వరకు స్వీకరించనున్నట్టు టీఎస్‌పీఎస్‌సీ తాజా ప్రకటనలో పేర్కొంది. మరోవైపు ఇంటర్‌ విద్య కమిషనరేట్‌లో 91 ఫిజికల్‌ డైరెక్టర్, 40 లైబ్రేరియన్‌ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్‌ వెలువడింది.

CM KCR On Jobs: నిరుద్యోగుల‌కు కేసీఆర్ గుడ్‌న్యూస్, తెలంగాణలో 80 వేల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్, అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన 

ఇప్పటికే భారీ ఎత్తున పోలీసు జాబ్స్ కోసం రాత పరీక్షలు పూర్తయ్యాయి. తాజాగా ఈవెంట్స్ కూడా మొదలయ్యాయి. ఈ నెలాఖరుకు ఆ ప్రక్రియ పూర్తయ్యే అవకాశముంది. దాంతో పాటూ పలు శాఖల్లో విడుదల చేసిన నోటిఫికేషన్లకు సంబంధించిన భర్తీ ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ ఆర్ధిక సంవత్సరం పూర్తయ్యేలోపు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తిచేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఎలాంటి అడ్డుంకులు లేకుండా నోటిఫికేషన్ల ప్రక్రియను సజావుగా నిర్వహిస్తోంది.



సంబంధిత వార్తలు

Aramgarh Flyover: హైదరాబాద్‌ నగరంలో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు, ఆరాంఘర్‌- జూపార్క్‌ ఫ్లై ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి

Anchor Forget CM Revanth Reddy Name: సీఎం రేవంత్‌రెడ్డి పేరు మర్చిపోయిన హీరో, కిరణ్‌కుమార్‌ అంటూ స్టేజి మీదకు ఆహ్వానించడంతో ఒక్కసారిగా గందరగోళం

CM Revanth Reddy: ఇది ఆర్ధిక సాయం కాదు…ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, సివిల్స్ ఇంటర్వ్యూలకు సెలక్ట్ అయిన అభ్యర్థులకు రూ. లక్ష ప్రోత్సాహం, సివిల్స్‌లో మనవాళ్లే రాణించాలన్న సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy On New Ration Cards: జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డులు..రైతు భరోసా, ఆదాయాన్ని పెంచి పేదలకు పంచుతామన్న సీఎం రేవంత్ రెడ్డి..ఆ భూములకు రైతు భరోసా వర్తించదు