IPL Auction 2025 Live

TG Weather Update: చలితో గజగజలాడుతున్న తెలంగాణ.. సంగారెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లాల్లో 9 డిగ్రీల కంటే తక్కువకు పడిపోయిన ఉష్ణోగ్రతలు.. అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరిక

రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతుండగా.. ఉదయం పొగమంచు ఊపిరి ఆడనివ్వటం లేదు. సంగారెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లాల్లో 9 డిగ్రీల కంటే దిగువకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.

Cold Wave, representational image. (Photo Credits:IANS)

Hyderabad, Nov 25: చలితో యావత్తు తెలంగాణ (Telangana) గజగజలాడుతున్నది. రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతుండగా.. ఉదయం పొగమంచు ఊపిరి ఆడనివ్వటం లేదు. సంగారెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లాల్లో 9 డిగ్రీల కంటే దిగువకు ఉష్ణోగ్రతలు (Temperatures) పడిపోతున్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. భద్రాచలం, హకీంపేట, ఖమ్మం, రామగుండం, పటాన్‌ చెరు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల కన్నా తక్కువగా నమోదవుతున్నట్టు తెలిపారు. హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో 14 డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో పిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. ఎల్లుండి నుంచి ఏపీలో భారీ వర్షాలు.. మూడు రోజుల పాటు సముద్రంలో అలజడి.. మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని అధికారుల హెచ్చరికలు

వానలు లేనట్టే

హిందూ మహాసముద్రం, దక్షిణ అండమాన్‌ సముద్రంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కగా  భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు. తెలంగాణకు మాత్రం వర్ష సూచన లేదని, పొడి వాతావరణం ఉంటుందని చెప్పారు.

తొలిరోజు ఐపీఎల్ ఆక్ష‌న్ లో ఏ జ‌ట్లు ఏ ప్లేయ‌ర్ ను కొనుగోలు చేశాయంటే? ఫుల్ లిస్ట్ ఇదుగోండి



సంబంధిత వార్తలు

TG Weather Update: చలితో గజగజలాడుతున్న తెలంగాణ.. సంగారెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లాల్లో 9 డిగ్రీల కంటే తక్కువకు పడిపోయిన ఉష్ణోగ్రతలు.. అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరిక

Rains in AP: బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. ఎల్లుండి నుంచి ఏపీలో భారీ వర్షాలు.. మూడు రోజుల పాటు సముద్రంలో అలజడి.. మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని అధికారుల హెచ్చరికలు

Rains in AP: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపటికల్లా వాయుగుండంగా మారే అవకాశం.. అల్పపీడనం ప్రభావంతో నేటి నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు

Heavy Rains in AP: బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం.. వచ్చే వారం ఏపీలో దంచికొట్టనున్న వానలు.. ఐఎండీ అంచనా.. ఉత్తరం నుంచి వీచే గాలుల ప్రభావంతో కోస్తాంధ్రలో పెరగనున్న చలి తీవ్రత