Technology
Ashiss Kumar Dash: ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాస్.. 2027 ఏప్రిల్ 1 నుంచి సలీల్ పరేఖ్ స్థానంలో బాధ్యతలు..
Team LatestlyAshish Kumar Dash: భారతదేశపు రెండో అతిపెద్ద ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ లో కీలక నాయకత్వ మార్పు చోటుచేసుకుంది. సంస్థ తదుపరి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా ఆశిష్ కుమార్ దాస్ నియమితులయ్యారు. ప్రస్తుత సీఈవో సలీల్ పరేఖ్ పదవీకాలం ముగిసిన అనంతరం.. 2027 ఏప్రిల్ 1 నుంచి ఆశిష్ కుమార్ దాస్ పూర్తిస్థాయిలో సీఈవోగా బాధ్యతలు స్వీకరిస్తారు.
LinkedIn Jobs Report: ఉపాధి అవకాశాల్లో దూసుకుపోతున్న విశాఖపట్నం.. లింక్డ్‌ఇన్ జాబితాలో అగ్రస్థానం.. టాప్ టెన్ నాన్-మెట్రో నగరాలు ఇవే..
Team Latestlyఉద్యోగం, ఉపాధి అనగానే నిరుద్యోగులకు ముందుగా బెంగళూరు, ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్ వంటి టైర్-1 మెట్రో నగరాలే గుర్తుకువస్తాయి. అయితే ఇటీవలి కాలంలో నాన్-మెట్రో నగరాలు కూడా వేగంగా ఎదుగుతూ, ప్రతిభకు తగ్గ ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాయి. ఈ అంశాన్ని ప్రముఖ ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ వేదిక 'లింక్డ్‌ఇన్' తాజాగా వెల్లడించింది.
Data Privacy Rules: మూడేళ్లు వాడకపోతే యూజర్ డేటా డిలీట్, అమల్లోకి వచ్చిన కీలక నిబంధనలు గురించి తెలుసుకోండి, డేటా డిలీట్ చేసే ముందు యూజర్‌కు 48 గంటల నోటీసు
Team Latestlyడిజిటల్ యుగంలో వ్యక్తిగత సమాచార భద్రతకు పెరుగుతున్న ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని, భారత ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దేశ చరిత్రలో తొలి సమగ్ర డిజిటల్ గోప్యతా చట్టంగా పేరుగాంచిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (DPDP) యాక్ట్’ కింద కేంద్ర ప్రభుత్వము కొత్త నిబంధనలను అధికారికంగా నోటిఫై చేసింది
AI Love Story in Japan: టెక్నాలజీ హద్దులు దాటింది, తన సొంత AI భాగస్వామిని వివాహం చేసుకున్న జపాన్ మహిళ, కృత్రిమ మేధస్సుతో పెళ్లి వీడియో వైరల్
Team Latestlyకృత్రిమ మేధస్సు (AI) ప్రభావం వేగంగా పెరుగుతున్న ఈ యుగంలో, జపాన్‌కు చెందిన ఒక మహిళ తన AI వ్యక్తిత్వాన్ని వివాహం చేసుకోవడం అంతర్జాతీయంగా సంచలనంగా మారింది. 32 ఏళ్ల కానో అనే ఈ మహిళ తనకు ఎంతో సన్నిహితంగా మారిన ChatGPT ఆధారిత చాట్‌బాట్ వ్యక్తిత్వాన్ని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ ప్రత్యేక వివాహ వేడుక జపాన్‌లోని ఒకాయమా నగరంలో ఈ వేసవిలో ఘనంగా జరిగింది.
ISRO Chandrayaan 2: చంద్రయాన్-2 నుంచి కొత్త డేటా ఉత్పత్తి, చంద్రుడి ధ్రువ ప్రాంతాలపై మరింత లోతైన అధ్యయనం
Team Latestlyచంద్రుని ధ్రువ ప్రాంతాలపై మరింత లోతుగా అవగాహన పెంచే లక్ష్యంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కీలక ముందడుగు వేసింది. చంద్రయాన్-2 ఉపగ్రహం ద్వారా చంద్ర కక్ష్య నుండి సేకరించిన సమాచారంపై ఆధారపడి అధునాతన డేటా ఉత్పత్తులను అభివృద్ధి చేస్తున్నట్లు ఇస్రో వెల్లడించింది.
PAN Aadhaar Linking: పాన్ కార్డుదారులకు చివరి హెచ్చరిక.. ఈ తేదీలోగా ఆధార్‌తో లింక్ చేయండి, లేదంటే బ్యాంకింగ్ సేవలు అన్నీ నిలిచిపోయే ప్రమాదం, ఇతర ఆదాయాలపై వడ్డీ కట్
Team Latestlyదేశవ్యాప్తంగా కోట్లాది మంది పాన్ కార్డుదారులకు ఇది అత్యంత కీలకమైన హెచ్చరికను జారి చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికీ మీ పర్మినెంట్ అకౌంట్ నంబర్ (PAN)ను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయకుంటే నష్టపోతారని హెచ్చరించింది. వెంటనే అప్రమత్తం అవ్వాలని తెలిపింది.
Digital Arrest Scam Alert: ఆ కాల్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎత్తకండి, డిజిటల్ అరెస్ట్ స్కాంలపై ఎన్పీసీఐ హెచ్చరిక, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కి ఫిర్యాదు చేయాలని వెల్లడి
Team Latestlyదేశవ్యాప్తంగా సైబర్ మోసాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తాజా ప్రకటనతో ప్రజలకు ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో జరుగుతున్న కొత్త తరహా మోసాలు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని NPCI స్పష్టం చేసింది.
Amazon Layoffs: అమెజాన్‌లో భారీగా ఉద్యోగాల తొలగింపులు, సీనియర్ స్థాయి అధికారులతో కలిపి దాదాపు 14 వేల మంది బయటకు, ఏఐ రాకతో ఉద్యోగులకు దినదిన గండం
Team Latestlyఅమెజాన్‌లో భారీగా ఉద్యోగాల తొలగింపులు ప్రారంభమైనట్లు సమాచారం. ఈ సారి సీనియర్ స్థాయి అధికారులను కూడా కలుపుకొని దాదాపు 14 వేల మంది ఉద్యోగులు ప్రభావితమయ్యారని నివేదికలు చెబుతున్నాయి.
US Work Permit Auto-Renewal Ends: అమెరికాలో వేలాది మంది భారతీయ ఉద్యోగులపై ట్రంప్ మరో పిడుగు.. వర్క్ పర్మిట్ల ఆటోమేటిక్ రెన్యువల్స్ రద్దు, పూర్తి వివరాలు ఇవిగో..
Team Latestlyవలసదారులపై కఠిన విధానాలు అమలుచేస్తోన్నఅగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కారు తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వలస కార్మికుల ఉపాధి అధికారం పత్రాల (Employment Authorization Documents - EAD) ఆటోమేటిక్ పొడిగింపును ఇకపై కొనసాగించబోమని అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ (DHS) ప్రకటించింది.
SC on Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ మోసాలు.. అన్ని రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు, కేసులను సీబీఐకి బదిలీ చేయాలనుకుంటున్నట్లు వెల్లడి
Team Latestlyనకిలీ కోర్టు ఆదేశాలు, పోలీసు, న్యాయ అధికారుల పేర్లను వాడి ప్రజలను మోసం చేసే డిజిటల్ అరెస్ట్ స్కామ్ కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశంపై కోర్టు స్వయంగా (సుమోటోగా) దృష్టి సారించి,అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది.
UPI Milestone: 5 కోట్లకు పైగా వినియోగదారులతో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన యూపీఐ, 65 మిలియన్ల వ్యాపారులతో దూసుకుపోతున్న డిజిటల్ చెల్లింపు దిగ్గజం
Team Latestlyభారతదేశంలో UPI (Unified Payments Interface) డిజిటల్ చెల్లింపు వేదిక 5 కోట్లకు పైగా వినియోగదారులు, 65 మిలియన్ల వ్యాపారులతో దూసుకుపోతోంది. ఈ వేదిక MSMEలు, చిన్న వ్యాపారాలకు వృద్ధి అవకాశాలను అందిస్తోంది. NPCI, BCG కలిసి గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2025లో విడుదల చేసిన నివేదిక ప్రకారం.. UPI ప్రపంచ రియల్-టైమ్ చెల్లింపులలో సుమారుగా 50 శాతం వాటా కలిగి ఉంది.
Realme 15x 5G Launched in India: రియల్‌మీ 15x 5G భారత మార్కెట్లో విడుదల, 7,000mAh బ్యాటరీతో పాటు 50MP సోనీ AI వెనుక కెమెరా, 50MP AI ఫ్రంట్ కెమెరా, ధర ఎంతంటే..
Team Latestlyప్రముఖ చైనా దిగ్గజం రియల్ మీ తన తాజా స్మార్ట్ ఫోన్ రియల్‌మీ 15x 5G ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది 7,000mAh బ్యాటరీతో వస్తుంది, అది 60W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది. కెమెరా వ్యవస్థలో 50MP సోనీ AI వెనుక కెమెరా, 50MP AI ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ కెమెరాలు వినియోగదారుకు స్పష్టమైన, ప్రొఫెషనల్-క్వాలిటీ ఫోటోలు, సెల్ఫీలు అందించేలా డిజైన్ చేశారు.
Agni-Prime Missile: అగ్ని-ప్రైమ్ క్షిపణి ప్రయోగం సక్సెస్, రైలు నుంచే శత్రు దేశాలపై గురి పెట్టి ముచ్చెమటలు పట్టించనున్న మిస్సైల్, వీడియో ఇదిగో..
Team Latestlyభారత రక్షణ రంగంలో మరో మిస్సైల్ చేరింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా రైలు ఆధారిత మొబైల్ లాంచర్ నుంచి అగ్ని-ప్రైమ్ మధ్యంతర శ్రేణి క్షిపణిని రక్షణ రంగం విజయవంతంగా పరీక్షించింది. ఈ చారిత్రక ప్రయోగం విజయంతో.. ఇలాంటి అత్యాధునిక సామర్థ్యం కలిగిన కొన్ని దేశాల సరసన ఇండియా సగర్వంగా నిలిచింది. ఈ విషయాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం అధికారికంగా ప్రకటించారు.
Jio and Airtel: రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ కంపెనీలు బిగ్ షాక్, రూ. 246 ప్లాన్ ఎందుకు తొలగించారో చెప్పాలని ట్రాయ్ ఆదేశాలు
Team Latestlyభారత టెలికాం నియంత్రణ సంస్థ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) Reliance Jio, Bharti Airtelకు చౌకైన రూ. 249 మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌లను తొలగించడం పై వివరణాత్మక సమాచారం కోరినట్లు తాజాగా సమాచారం వెల్లడి అయింది. గత కొన్ని రోజులుగా జియో 28 రోజుల చెల్లుబాటు గల రూ. 249 ప్లాన్‌ను నిలిపివేసింది.
ITR Filing 2025 Deadline: ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ తేదీ గడువును పొడిగించండి, కేంద్రాన్ని కోరుతున్న పలువురు సీఏలు, మరి ఐటీఆర్ ఫైలింగ్ 2025 గడువును కేంద్రం పొడిగిస్తుందా ?
Team Latestlyకేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు తేదీని 2025 తేదీని పొడిగిస్తుందా? లేదా అనే దానిపై క్లారిటీ లేదు.అయితే సెప్టెంబర్ 15 గడువు దగ్గర పడుతున్నందున దేశవ్యాప్తంగా చార్టర్డ్ అకౌంటెంట్లు 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ దాఖలు చేయడానికి పొడిగింపును డిమాండ్ చేస్తున్నందున ఈ ప్రశ్న తలెత్తుతుంది.
Telangana Liberation Day 2025: తెలంగాణ విమోచన దినోత్సవం, సెప్టెంబర్ 17కి ముందు ఏం జరిగిందో ఎవరికైనా తెలుసా.. తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన రోజు..
Team Latestlyసెప్టెంబర్ 17 అనేది తెలంగాణ చరిత్రలో ఒక ప్రత్యేకమైన రోజు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా, తెలంగాణ ప్రజలు నిజాం పాలన కఠినత్వం, రజాకార్ల దౌర్జన్యం, స్వేచ్ఛ కోసం ఎదురుచూస్తున్న రోజులు గడుపుతున్నారు. ఆ కష్టకాలంలో తెలంగాణ ప్రజల పోరాటం ఫలితంగా, 1948 సెప్టెంబర్ 17 న తెలంగాణ నిజాం కబంద హస్తాల నుంచి విముక్తి పొందింది.
ISRO Future Missions: 2040 నాటికి చంద్రుడిపై భారత్ జెండా ఎగరడమే భారత్ లక్ష్యం, ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ కీలక వ్యాఖ్యలు, ఇండియా 9 ప్రపంచ రికార్డులను నెలకొల్సిందని వెల్లడి
Team Latestlyభారతదేశం ఇప్పటి వరకు 9 ముఖ్యమైన ప్రపంచ రికార్డులను సాధించిందని, త్వరలో 8–10 కొత్త రికార్డులను సాధించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ తెలిపారు.
X Down? ఎక్స్ డౌన్.. ట్రై రీలోడింగ్ ఎర్రర్ వస్తుందంటూ సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్న నెటిజన్లు
Hazarath Reddyఎలోన్ మస్క్ యొక్క X (ట్విట్టర్) కొన్ని సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి, ఎందుకంటే కొంతమంది వినియోగదారులకు "సమ్థింగ్ వెంట్ రాంగ్. ట్రై రీలోడింగ్" ఎర్రర్ కనిపించడం ప్రారంభించింది. తమ స్క్రీన్‌ను లోడ్ చేయలేని వినియోగదారులకు X వెబ్ వెర్షన్ అందుబాటులో లేదు.
Gold Prices Hike: బంగారం ధర పెరగడమే కానీ తగ్గేదే లేదు! రాబోయే రోజుల్లో రికార్డుస్థాయికి గోల్డ్ రేటు చేరుతుందంటున్న నిపుణులు
VNSపెట్టుబడిదారులకే కాదు.. కేంద్ర బ్యాంకులకు కూడా బంగారం ముఖ్యమైన సంపదగా మారిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సీఈవో డేవిడ్ టైట్ అన్నారు. మనీకంట్రోల్ వెబ్ సైట్ నిర్వహిస్తున్న ‘గ్లోబల్ వెల్త్ సమ్మిట్ 2025’లో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ అప్పు, అలాగే ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీసే అంశాల వల్ల కూడా బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయని అయన చాలా నమ్మకంతో చెప్పారు.