Android 12 Update: ఆండ్రాయిడ్ 12 అప్‌డేట్ వచ్చే ఫోన్లు ఇవే! కొత్త ఓఎస్‌పై అన్ని కంపెనీల కసరత్తు, ముందుగా ఈ మొబైల్స్ లో ఆండ్రాయిడ్ అప్ డేట్
ఆండ్రాయిడ్12 వచ్చేసింది. త్వరలోనే అన్ని బ్రాండ్ల మొబైల్స్ లో ఈ కొత్త ఓఎస్ అప్ డేట్ రానుంది. ఈ కొత్త ఓఎస్‌లో యూజర్ ఇంటర్‌ఫేస్ (Interface) మారడంతోపాటు వన్‌హ్యాండ్ మోడ్, ప్రత్యేకమైన గేమింగ్ మోడ్, టేక్ మోర్ బటన్, యూఆర్‌ఎల్ షేరింగ్ వంటి ఎన్నో కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. అయితే ఈ కొత్త ఓఎస్‌ను కొన్ని మొబైల్ కంపెనీలు తాజాగా విడుదల చేసిన మోడల్స్‌లో పరిచయం చేశాయి.
New Delhi, Feb 11: ఆండ్రాయిడ్12 (Android 12 update) వచ్చేసింది. త్వరలోనే అన్ని బ్రాండ్ల మొబైల్స్ లో ఈ కొత్త ఓఎస్ అప్ డేట్ రానుంది. ఈ కొత్త ఓఎస్‌లో యూజర్ ఇంటర్‌ఫేస్ (Interface) మారడంతోపాటు వన్‌హ్యాండ్ మోడ్, ప్రత్యేకమైన గేమింగ్ మోడ్ (Gaming mode), టేక్ మోర్ బటన్, యూఆర్‌ఎల్ షేరింగ్ వంటి ఎన్నో కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. అయితే ఈ కొత్త ఓఎస్‌ను కొన్ని మొబైల్ కంపెనీలు తాజాగా విడుదల చేసిన మోడల్స్‌లో పరిచయం చేశాయి. మరికొన్ని కంపెనీలు త్వరలో విడుదల కాబోయే తమ కంపెనీ ఫోన్లలో పరిచయం చేయనున్నట్లు తెలిపాయి. ఇప్పటికే అన్ని కంపెనీలు ఈ ఓఎస్ పై కసరత్తు పూర్తి చేశాయి. ఎలాంటి సమస్యలు లేకుండా ఓఎస్ అప్‌డేషన్ కోసం ఏర్పాట్లు చేశాయి. మరి ఈ కొత్త ఓఎస్‌ను ఏయే కంపెనీలు ఎప్పుడెప్పుడు తీసుకొస్తున్నాయనేది చూద్దాం.
షావోమి
షావోమి (Xiaomi) ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎమ్‌ఐయూఐ 13 ఓఎస్ బీటా వెర్షన్‌ను గతేడాది ఆగస్టు నుంచి ఎమ్‌ఐయూఐ 11 ఆధారిత ఫోన్లలో అప్‌డేట్ చేస్తుంది. అయితే అధికారికంగా మాత్రం ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఓఎస్‌ను (OS) షావోమి విడుదల చేయలేదు. అయితే షావోమి 12 (Xiaomi 12), షావోమి 12 ప్రో, షావోమి 12ఎక్స్ (Xiaomi 12X), ఎంఐ 11 అల్ట్రా, ఎంఐ 11 ప్రో, ఎంఐ 11 మొబైల్స్‌లో మొదట ఈ ఓఎస్ అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఫిబ్రవరి చివరికి లేదా మార్చి మొదటి వారంలో అప్‌డేట్ అవుతుందని సమాచారం.
శాంసంగ్
శాంసంగ్ (Samsung) ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్‌యూఐ 4స్కిన్ ఓఎస్ బీటా వెర్షన్‌ను గెలాక్సీ ఎస్21(Galaxy S21), గెలాక్సీ జెడ్ ఫ్లిప్3, ఫోల్డ్3, గెలాక్సీ ఏ13 మోడల్స్‌లో పరిచయం చేసింది. త్వరలో పూర్తిస్థాయి వెర్షన్‌ను పరిచయం చేయనుంది. ముందుగా ఎస్20 (S 20), ఎస్10 మోడల్స్‌తోపాటు గెలాక్సీ ఏ52 మోడల్‌కు ఈ అప్‌డేట్‌ను విడుదల చేయనున్నారు. ఏప్రిల్‌లో గెలాక్సీ ఏ32 వంటి మిడ్-రేంజ్, జులైలో గెలాక్సీ ఏ12 (Galaxy A12), గెలాక్సీ ఏ03ఎస్ వంటి లో-ఎండ్ మోడల్స్‌లో పరిచయం చేస్తారని సమాచారం. తర్వాత శాంసంగ్ ఓఎస్ అప్‌డేట్ (Samsung OS Update) పాలసీ ప్రకారం మిగిలిన మోడల్స్‌లో ఆండ్రాయిడ్ 12 అప్‌డేట్ అవుతుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.
వన్‌ప్లస్ & ఒప్పో & రియల్‌మీ
ఆక్సిజన్ ఓఎస్ 12 పేరుతో వన్‌ప్లస్(One plus) కంపెనీ కొత్త ఫోన్లలో ఓఎస్ అప్‌డేట్‌ను విడుదల చేసింది. అయితే అది కేవలం వన్‌ప్లస్, ఒప్పో కంపెనీల విలీనం తర్వాత రెండు కంపెనీల ఫోన్ల కోసం కొత్తగా విడుదల చేసిన అప్‌డేట్‌గా టెక్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో వన్‌ప్లస్ డిసెంబరులో విడుదల చేసిన వన్‌ప్లస్ 9 (One plus 9), 9 ప్రో మోడల్స్‌లో ఆండ్రాయిడ్ 12ను విడుదల చేసింది. ఇందులో బగ్స్ ఎక్కువగా ఉండటంతో దాన్ని నిలిపివేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్‌ప్లస్ ఆక్సిజన్‌ఓఎస్(Oxezen OS) 13 పేరుతో మరో కొత్త అప్‌డేట్‌ను విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆక్సిజన్, కలర్ ఓఎస్ కలయికగా ఆండ్రాయిడ్ 12 ఫీచర్స్‌తో వన్‌ప్లస్, ఒప్పో ఫోన్ల కోసం కొత్త ఓఎస్‌ను పరిచయం చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనే ఆండ్రాయిడ్ 12ను యూజర్స్‌కు పరిచయం చేయనున్నట్లు సమాచారం.
అసుస్
అసుస్(Asus) కంపెనీ గతేడాది డిసెంబరులో విడుదల చేసిన జెన్‌ఫోన్ 8, 8 ఫ్లిప్‌లో ఆండ్రాయిడ్ 12ను పరిచయం చేసింది. అసుస్ గేమింగ్ ఫోన్లు రోగ్ ఫోన్5, 5ఎస్‌లలో 2022 తొలి త్రైమాసికంలో అప్‌డేట్ చేయనున్నట్లు తెలిపింది. అలానే అసుస్ జెన్‌ఫోన్ 7(Asus Zenfone 7), రోగ్ ఫోన్ 3 మోడల్స్‌కు రెండో త్రైమాసికంలో అప్‌డేట్ చేయనుంది.
గూగుల్
గతేడాది గూగుల్ పిక్సెల్(Google pixel) సిరీస్‌లో పిక్సెల్ 6, పిక్సెల్ 6 ప్రో మోడల్స్‌ను అక్టోబరు 19న విడుదల చేసింది. తొలిసారిగా ఆండ్రాయిడ్ 12ను గూగుల్ ఈ ఫోన్లలోనే పరిచయం చేసింది. అదేరోజుల ఆన్-ఎయిర్ ద్వారా పిక్సెల్ సిరీస్‌లోని అన్ని మోడల్స్ (పిక్సెల్ 3 సిరీస్, పిక్సెల్ 4 సిరీస్, పిక్సెల్ 5 సిరీస్)కు ఆండ్రాయిడ్ 12 అప్‌డేట్‌ను గూగుల్ పంపింది.
నోకియా
నోకియా(Nokia) మాత్రం ఆండ్రాయిడ్ 12ను ఎప్పుడు అప్‌డేట్ చేయనుందనే దానిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. గతేడాది డిసెంబరులో విడుదల చేసిన నోకియా ఎక్స్10లో ఆండ్రాయిడ్ 12 విడుదల చేస్తారని భావించినప్పటికీ కంపెనీ ఆండ్రాయిడ్ 11తోనే మార్కెట్లోకి తీసుకొచ్చింది.
మోటోరోలా
ఫిబ్రవరి చివరి వారానికి 2020-21 మధ్య కాలంలో విడుదలైన మోడల్స్‌లో ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఓఎస్ అప్‌డేట్ అవుతుందని మోటోరోలా(Motorola) తెలిపింది. ఈ జాబితాలో ముందు వరుసలో మోటో రేజర్, మోటోరోలా ఎడ్జ్ సిరీస్ ఫోన్లు ఉన్నాయి. అయితే ఈ అప్‌డేట్ ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్లకు వర్తిస్తుందా లేక ఎంపిక చేసిన మార్కెట్లకే పరిమితమవుతుందా అనేది మాత్రం వెల్లడించలేదు. ఆండ్రాయిడ్ 12తోపాటు మై యూఎక్స్ పేరుతో అదనపు ఫీచర్లను మోటోరోలా యూజర్లకు అందివ్వనుంది.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)