No more relationship column in Aadhar Reports (Photo-Wikimedia Commons)

ఇప్పుడు ఆధార్ కార్డు నేడు అన్నింటికీ గుర్తింపు కార్డుగా మారిపోయింది. మొబైల్ సిమ్ కార్డు దగ్గర్నుంచి, క్రెడిట్ కార్డు, వంట గ్యాస్ కనెక్షన్, బ్యాంకు ఖాతా ప్రారంభం, పెట్టుబడులు అన్నింటికీ 'ఆధార్' ఆధారంగా మారింది.మరి ఉన్నట్టుండి ఆధార్ కార్డు పోగొట్టుకుంటే దాన్ని తిరిగి పొందేందుకు చాలామంది ప్రయత్నిస్తుంటారు. ఎలా పొందాలో చాలామందికి తెలియదు. అయితే తిరిగి పొందేందుకు పలు మార్గాలు ఉన్నాయి.

ఆధార్ కార్డు లేకపోయినా కనీసం నంబర్ ఉంటే చాలు. లేదంటే వర్చువల్ ఐడీ, ఎన్ రోల్ మెంట్ ఐడీ అయినా కావాలి. ఆధార్ నంబర్ తోపాటు, ఆధార్ కు లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్ మీ దగ్గర ఉంటే పొందడం చాలా సులభమే.

మీరు https://eaadhaar.uidai.gov.in/#/ పోర్టల్ కు వెళ్లి ఆధార్ కార్డును పొందొచ్చు. ఎంఆధార్ మొబైల్ యాప్ ను ఫోన్లో ఇన్ స్టాల్ చేసుకుని ఈ ఆధార్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. చట్టపరంగా భౌతిక ఆధార్ కార్డుకు, ఈ ఆధార్ సమానమే. ఈ ఆధార్ ను https://eaadhaar.uidai.gov.in/genricDownloadAadhaar పోర్టల్ కు వెళ్లి నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఆధార్ పీవీసీ కార్డును సైతం తీసుకోవచ్చు. క్రెడిట్ కార్డు పరిమాణంలో ఉంటుంది. ఇందుకోసం రూ.50 చెల్లించాలి. సమీపంలోని ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లి సేవలు పొందొచ్చు. ఆన్‌లైన్‌‌లో ఆధార్ కార్డు అప్‌డేట్ చేయడం ఎలా? ఏమేమి ధృవ పత్రాలు కావాలి, అప్‌డేట్ తర్వాత పాత మీ నంబర్ మారుతుందా, పూర్తి గైడ్ మీకోసం..

ఆధార్ కార్డు తిరిగి పొందడం ఎలా?

దశ 1:

UIDAI అధికారిక వెబ్‌సైట్ uidai.gov.inకి వెళ్లి లాగిన్ అవ్వండి

దశ 2:

డ్రాప్-డౌన్ మెనులో 'ఆధార్ సేవలు' విభాగం కింద 'My Aadhaar' ట్యాబ్‌పై క్లిక్ చేయండి.

దశ 3:

తర్వాత వచ్చే రెండు ఎంపికలలో, 'రిట్రీవ్ లాస్ట్ లేదా ఫర్గాటెన్ EID/UID' ఎంపికను ఎంచుకోండి

దశ 4:

మీకు మళ్లీ రెండు ఎంపికలు కనిపిస్తాయి - ఒకటి 'ఆధార్ నంబర్ (UID)'ని తిరిగి పొందడం, మరొకటి 'ఎన్‌రోల్‌మెంట్ ID (EID)'ని తిరిగి పొందడం. అవసరమైన దాన్ని ఒకటి ఎంచుకోండి.

దశ 5:

మీ ఆధార్‌కు సంబంధించిన మొత్తం సమాచారాన్ని పూరించండి

దశ 6:

ధృవీకరణ కోసం క్యాప్చా సమాచారాన్ని పూరించండి మరియు 'OTP పంపు'పై క్లిక్ చేయండి

దశ 7:

OTPని చొప్పించండి మరియు మరోసారి మిమ్మల్ని మీరు నమోదు చేసుకోండి మరియు ధృవీకరించండి

దశ 8:

మీకు లభించే సమాచారాన్ని ఉపయోగించుకోండి మరియు UIDAI వెబ్‌సైట్ నుండి మీ ఇ-ఆధార్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోండి.