Smartphone Mistakes: స్మార్ట్‌ఫోన్ వాడే వారు ఈ తప్పులు చేయకండి, మీ ఫోన్ తొందరగా ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది, అవేంటో ఓ సారి తెలుసుకోండి
పొద్దున లేచిన దగ్గర్నుంచి పడుకునే వరకు స్మార్ట్ ఫోన్ లేకుండా జీవితమే గడవడం లేదు. ప్రతి పనికి స్మార్ట్ ఫోన్ అనేది నిత్యావసర వస్తువుగా మారింది. అయితే చాలా మంది స్మార్ట్‌ఫోన్ వాడే విషయంలో అజాగ్రత్తగా ఉంటారు.
స్మార్ట్‌ఫోన్(Smart Phones)లు ఆధునిక జీవితంలో కామన్ అయిపోయింది. పొద్దున లేచిన దగ్గర్నుంచి పడుకునే వరకు స్మార్ట్ ఫోన్ లేకుండా జీవితమే గడవడం లేదు. ప్రతి పనికి స్మార్ట్ ఫోన్ అనేది నిత్యావసర వస్తువుగా మారింది. అయితే చాలా మంది స్మార్ట్‌ఫోన్ వాడే విషయంలో అజాగ్రత్తగా ఉంటారు. దీని వల్ల ఫోన్ పాడయ్యే ప్రమాదం (Damaging Your Smartphone) ఉంది. సాధారణంగా అందరూ ఈ ఏడు రకాల తప్పులను చేస్తుంటారు. మీరు కూడా ఇలాంటివి (Biggest Common Mistakes) చేస్తున్నట్లయితే వెంటనే మార్చుకుని మీ ఫోన్ ని కాపాడుకోండి. అవేంటో చూద్దాం.
చాలా మంది వినియోగదారులు అన్ని ఛార్జర్‌లు ఒకేలా ఉంటాయనే అపోహతో ఉంటారు. అయితే సరైన ఛార్జర్‌ని ఫోన్‌కు ఉపయోగించడం ముఖ్యం. తక్కువ ధరలో లభించే ఛార్జర్‌లకు దూరంగా ఉండాలి. వాటితో షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. ఇవి స్మార్ట్‌ఫోన్ లైఫ్‌ను దెబ్బతీస్తాయి. ఎల్లప్పుడూ మంచి బ్రాండ్‌కు చెందిన ఛార్జర్‌లను కొనుగోలు చేయండి. పబ్లిక్ Wi-Fi నెట్‌వర్క్‌లు ఉపయోగించడం ప్రధాన భద్రతా ప్రమాదంగా మారవచ్చు. ఈ నెట్‌వర్క్‌లకు కనెక్ట్ అయిఉన్న ఫోన్‌లకు సంబంధించిన సమాచారాన్ని హ్యాకర్లు సులభంగా పొందే ఆస్కారం ఉంటుంది.
కొంతమంది వినియోగదారులు Google Play Storeలో యాప్‌లను వెతికిపట్టుకోలేని సమయంలో ఇతర సోర్స్‌లలో సెర్చ్ చేస్తారు. థర్డ్‌పార్టీ యాప్ స్టోర్‌ల నుంచి యాప్‌లు డౌన్‌లోడ్ చేస్తే ఫోన్‌కు మాల్వేర్ ప్రమాదం ఉంటుంది. మొబైల్ కంపెనీలు క్రమం తప్పకుండా సాఫ్ట్‌వేర్, సెక్యూరిటీ అప్‌డేట్‌లను షేర్ చేస్తూ ఉంటాయి. ఫోన్‌కు కొత్త ఫీచర్‌లు, డిజైన్ ఎలిమెంట్‌లను తీసుకురావడంతో పాటు.. మరికొన్ని హానికరమైన యాప్‌ల నుంచి రక్షించేందుకు ఇవి ఉపయోగపడతాయి. స్మార్ట్‌ఫోన్ ఎలాంటి అవాంతరాలు లేకుండా పని చేయడంలో ఈ అప్‌డేట్స్ కీలకం.
కొన్ని యాప్‌లకు సంబంధించి కొత్త అప్‌డేట్ అందుబాటులో ఉందని తెలిసినా కొందరు పట్టించుకోరు. ఈ అప్‌డేట్‌లు కొత్త ఫీచర్‌లతోపాటు.. అప్పటివరకు ఉన్న లోపాలు లేకుండా వస్తాయి. అప్‌డేట్ చేయకపోవడం ద్వారా పాత సమస్యలు కొనసాగుతాయి. ఇవి కంపెనీ అందించిన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌లపై రన్ అవుతున్న ఫోన్‌లకు మరింత సెక్యూరిటీ ఆప్షన్లు ఉంటాయి. ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌లోని కొన్ని ముఖ్యమైన భాగాలను యాక్సెస్ చేయకుండా వినియోగదారులను నియంత్రిస్తాయి.
ఫోన్ పాడవకుండా వెనుక కవర్లు లేదా ఫోన్ కేస్‌లు ఉపయోగపడతాయి. వినియోగదారులు కవర్ లుక్ కంటే నాణ్యతపై ఎక్కువ దృష్టి పెట్టాలి. సిలికాన్ ఫోన్ కేసులు ఇతర మెటీరియల్‌ల కంటే ఎక్కువ మన్నికైనవి.